Tuesday, February 18, 2014

సమస్యాపూరణ..( కుంభకర్ణుండు రూపసి కుంతి మగడు1304 )



శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...


పగలు రేలును పవళించు బలుడెవండు
  అందగత్తెల నేమందు రాదరమున?
సతుల తాకిన మృతినొందు సామి యెవరు?
  కుంభకర్ణుండు రూపసి కుంతి మగడు


రావణాసురు తమ్ముండు రక్కసుండు     
కుంభకర్ణుడు, రూపసి కుంతి మగడు
పంచ పాండవులకుతండ్రి పాండురాజు
ధర్మ బద్దుడు సదయుడు దానశీలి
 

No comments:

Post a Comment