శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....
వన్నె వన్నె పూల వర్ణాలతోముగ్గు
కన్ను చెదరి నట్లు కలికి వేయ
చిట్టి చెల్లి వచ్చి చక్కనౌ నొకచంద
మామ ముగ్గు బెట్ట మగువ మురిసె
రంగ నాధుని సేవించి రమణి గోద
భక్తి గానము చేయుచు పరవశించి
పాశురములను రచియించి భావ భవుని
తండ్రినే భర్తగా బొంది తరుణి మురిసె
No comments:
Post a Comment