Tuesday, February 18, 2014

సమస్యా పూరణ..(కటిక చీకటి నొసగె భాస్కరుడు వచ్చి 1308)




శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....


కళలు తరిగిఅమవసన కలువ ఱేడు  
టికి చీకటి నొసగె, భాస్కరుడు వచ్చి
వెలుగు వెదజల్లి జగమంత వేడి నింపు  
వనజహితునకు వేవేల వందనములు



పగలు రేయిగ మారగ భయము తోడ                 
పక్షు లన్నియు గూళ్ళకు బరుగు దీయు
గ్రహణ సమయము నందిది కలుగు భువిని
కటిక చీకటి నొసగె భాస్కరుడు వచ్చి
 

No comments:

Post a Comment