- శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
పద్య రచన...దొంగల ముఠా..
దోచుకొనుచు దిరుగు దొంగలదే ముఠా
దోషు లెవరు యిలను దెొరలు వారె
ప్రజల సొమ్ము దినుచు పదవుల కెక్కిన
వారి నామ మేమి వాయు సుతుడ
సమస్యా పూరణ...అప్పు లేని వాడె యధముడు గద
Friday, September 27, 2013
శంకరాబరమం..(పద్య రచన( దొంగలముఠా) పూరణ(అప్పు లేని వాడె యధముడుగద)
శంకరాబరణం,పద్య రచన.( పోస్టు కార్డు) పూరణ..(రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో..
పద్య రచన..పోస్టు కార్డు...
చిన్న నాటినే స్తంకద చిట్టి జాబు
చిత్త గించక యుండెను చిత్త మందు
పేద మధ్యతరగతికి పెన్ని ధయిన
తంతి పోస్టలు కార్డులు తరలి పోయె
సమస్యా పూరణ...రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్
పద్య రచన..పోస్టు కార్డు...
చిన్న నాటినే స్తంకద చిట్టి జాబు
చిత్త గించక యుండెను చిత్త మందు
పేద మధ్యతరగతికి పెన్ని ధయిన
తంతి పోస్టలు కార్డులు తరలి పోయె
సమస్యా పూరణ...రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్
శంకరాభరణం..పద్య రచన(దోమ) పూరణ..( ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుడు పుట్టె)న్
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
పద్య రచన..దోమ..
దోమా! పద్యము వ్రాయగ
లేమా! నీపై! నిదురను లేదే ధీమా
కామా! పెట్టక కుట్టుచు
టీముగ తిరిగిన తమరిని ఢీకొన గలమా
చక్కెర కైనను దొరకవు
చక్కగ ఆలవుటుకసలు జడవవె దోమా.
చుక్కలు చూపుతు జనులకు
చిక్కక తిరిగెదవుగాదె చీయన లేమే
సమస్యా పూరణ...ముట్టుడిగిన (ముట్లు)సతికినొక్క పుత్రుడు పుట్టెన్
పట్టిన నోములు పట్టక
చెట్టును పుట్టను దిరుగుచు చేయగ పూజల్
పట్టిని కోరిన, వరముగ
ముట్టుడిగిన సతికి నొక్కపుత్రుడు పుట్టెన్
ఎట్లో నోములు నోచియు
చెట్లను పుట్టలను దిరుగి శ్రీ తిరుమలపై
మెట్లకు మ్రొక్కగ, వరముగ
ముట్లుడిగిన సతికి నొక్కపుత్రుడు పుట్టెన్.
Sunday, September 22, 2013
శంకరాభరణం..(పూరణ..(జింకను గని జెదరి పాఱె జిఱుతపులివడిన్) పద్య రచన..(విశ్వాశఘాతకుడు)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో.....
సమస్యా పూరణ......జింకను గని జెదరి పాఱె జిఱుతపులివడిన్
ముంచుకు వచ్చిన ముప్పును
జంకక తలపడి నిలచిన జరుగును మేలున్
బింకముతో నెదిరించిన
జింకను గని జెదరి పాఱె జిఱుతపులివడిన్
సమస్యా పూరణ......జింకను గని జెదరి పాఱె జిఱుతపులివడిన్
ముంచుకు వచ్చిన ముప్పును
జంకక తలపడి నిలచిన జరుగును మేలున్
బింకముతో నెదిరించిన
జింకను గని జెదరి పాఱె జిఱుతపులివడిన్
పద్య రచన....విశ్వాశఘాతకుడు.....
జన్మ నిచ్చిన వారిని జంపు వారు
తిన్న ఇంటికి వాసాలు నెన్ను వారు
తిన్న ఇంటికి వాసాలు నెన్ను వారు
చేయు మేలుకు చేటును చేయు వారు
కనగవిశ్వాసఘాత కులనబడుదురు
కనగవిశ్వాసఘాత కులనబడుదురు
Saturday, September 21, 2013
శంకరాభరణం..పద్య రచన..( జూదము) పూరణ..(దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్)
శ్రీ శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....
సమస్యా పూరణ...దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్
అనియెను! ప్రహ్లాదుడు,సఖులు,
దనుజులకొమరులనుబిలచి దానవు లారా!
వినరే ! హరియే దైవము
దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్
పద్య రచన....జూదము....
జూదము లాడిన జనులకు
వేదన మిగులును బ్రతుకున వేడుక లేదే
జూదము లాడిన ప్రభువులె
భాధల పాలై ఆడవుల పాలయిరి గదా
సమస్యా పూరణ...దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్
అనియెను! ప్రహ్లాదుడు,సఖులు,
దనుజులకొమరులనుబిలచి దానవు లారా!
వినరే ! హరియే దైవము
దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్
పద్య రచన....జూదము....
జూదము లాడిన జనులకు
వేదన మిగులును బ్రతుకున వేడుక లేదే
జూదము లాడిన ప్రభువులె
భాధల పాలై ఆడవుల పాలయిరి గదా
శంకరాభరణం..పద్య రచన..(ఋణానుబంధము)
పద్య రచన...ఋణానుబంధము.....
మత్తకోకిల...
ఇన్నిజన్మల బంధనమ్ములు ఏఋణమ్ముల రూపముల్
అన్నదమ్ములు ఆలుబిడ్డలు అన్నిబంధము లందరున్
అన్నివేళల కన్నవారిని ఆదరమ్మున చూచుచున్
అన్నికర్మలు ఆచరించుచు ఆదిదేవుని గొల్వుమా
తల్లి ఋణము దీర్చ తనయుని ధర్మంబు
భోగ భాగ్య ములను పొందు కన్న
నమ్ము కున్న వారి నట్టేట ముంచని
తనయులున్నవాడె ధన్య జీవి
మత్తకోకిల...
ఇన్నిజన్మల బంధనమ్ములు ఏఋణమ్ముల రూపముల్
అన్నదమ్ములు ఆలుబిడ్డలు అన్నిబంధము లందరున్
అన్నివేళల కన్నవారిని ఆదరమ్మున చూచుచున్
అన్నికర్మలు ఆచరించుచు ఆదిదేవుని గొల్వుమా
తల్లి ఋణము దీర్చ తనయుని ధర్మంబు
భోగ భాగ్య ములను పొందు కన్న
నమ్ము కున్న వారి నట్టేట ముంచని
తనయులున్నవాడె ధన్య జీవి
శంకరాభరణం...పద్య రచన.(కాలుష్యము) పూరణ...(పుస్తకములజదువువాని బుద్ధి నశించున్ )
పద్య రచన..కాలుష్యము...
కాలుష్యములన్నియునూ
కాలము మనసును తనువుల కబళించంగన్
గోలగు కర్కశ శబ్దపు
కాలుష్యముతో బ్రతుకులుగాడిని తప్పెన్
సమస్యా పూరణ....పుస్తకములజదువువాని బుద్ధి నశించున్
పుస్తకములు జదివినచో
స్వస్తి నొసగును మనసుకి స్వాంతనగల్గున్
మస్తకము ప్రకోపించే
పుస్తకములజదువువాని బుద్ధి నశించున్
Friday, September 20, 2013
శంకరాభరణం..పద్య రచన ( జోలపాట) పూరణ..( తాతను వివాహ మాడెను తరుణి మెచ్చి)
శ్రీ శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....
పద్య రచన.. జోలపాట....
అమ్మ
జోలపాట హాయిని గూర్చును
శిశువు నిదుర నొదుగు చిన్ననాట
జగము నేలు వారె చల్లగా నిదురించు
రమ్య మయిన జోల లాలి పాట
రామయ్యకి యిచ్చె రత్నాల లాలిని
నల్లనయ్య నచ్చె నంద లాలి
వెంకన్నమెచ్చేను వకుళమ్మ లాలిని
గణపతికిముద్దాయె గౌరి లాలి
శిశువు నిదుర నొదుగు చిన్ననాట
జగము నేలు వారె చల్లగా నిదురించు
రమ్య మయిన జోల లాలి పాట
రామయ్యకి యిచ్చె రత్నాల లాలిని
నల్లనయ్య నచ్చె నంద లాలి
వెంకన్నమెచ్చేను వకుళమ్మ లాలిని
గణపతికిముద్దాయె గౌరి లాలి
సమస్యా పూరణ..... తాతను వివాహ మాడెను తరుణి మెచ్చి....
తనకు
పెళ్ళిచేయతగిన ధనము లేక
కలత పడుచున్న తలిదండ్రి కలలు తీర
వయసుడిగినను మనసున్న వాని జూచి
తాత నువివాహ మాడెను తరుణి మెచ్చి
శంకరాభరణం..రద్య రచన..(తన్మయత్వము) పూరణ.(బలరాముడు లంకజేర వారధి గట్టన్)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతలతో..
పద్య రచన...తన్మయత్వము..
సుగంధి.......( ప్రధమ ప్రయత్నం)......
జన్మనిచ్చు తల్లి వంటి జన్మభూమినిన్ గనన్
తన్మయత్వ మొందరొక్కొ ధన్య జీవు లెల్లరున్
జన్మ లెన్ని యెత్తియైన జాతి కీర్తి చాటుచున్
తన్మయత్వ మొందరొక్కొ ధన్య జీవు లెల్లరున్
చిన్మయున్ ముకుందు జూచి చిత్త శాంతి నొందుచున్
తన్మయత్వ మొందరొక్కొ ధన్య జీవు లెల్లరున్
సన్మతిన్ భజించి స్వామి షణ్ముఖున్ నుతించుచున్
తన్మయత్వ మొందరొక్కొ ధన్య లైన తల్లులున్
పూరణ......
బలవంతులైన కపులను
పలువురినెల్లకలుపుకుని పలుకగమేలై
తలపడె నిజముగ వానర
బల రాముడు లంకజేర వారధి గట్టెన్
శంకరాభరణం....రద్యరచన..( గుడిగంట, బడి గంట )
పద్య రచన....గుడి గంట ...బడి గంట..
బంగారుగుడి గంట పలుకును మంత్రమ్ము
భక్తి ముక్తి నొసగె భావరవము
బడిగంట నదము భవితకు శ్రీకరము
భుక్తి యుక్తి కరపె పుణ్యపథము
భక్తి ముక్తి నొసగె భావరవము
బడిగంట నదము భవితకు శ్రీకరము
భుక్తి యుక్తి కరపె పుణ్యపథము
గుడి
గంటలు వినగానే
అడుగులు ఆవైపుమరలు ఆనందముతో
బడి గంటలువినబడగా
వడిగా బాలురు వెడలును పరుగులు పెడుతూ
అడుగులు ఆవైపుమరలు ఆనందముతో
బడి గంటలువినబడగా
వడిగా బాలురు వెడలును పరుగులు పెడుతూ
శంకరాభరణం....పద్య రచన.( గుణత్రయము, ) పూరణ..( భాష కేల నయ్య వ్యాకరణము)
పద్య రచన...గుణత్రయము....
సత్వ గుణము యున్న సాధించు కీర్తిని
రజోగుణము వలన రాజిల్లు జీవనం
తమోగుణము నెపుడు తగ్గించుకోవలె
గుణత్రయము మనుష్య గురుతు గాదె..
సమస్యా పూరణ... భాష కేల నయ్య వ్యాకరణము......
కంటి భాషకేల ఘనమయి నలిపులు
కనులచెమ్మ తెలుప గలదె భాష
అమ్మ ప్రేమ కొలుచు అవనిలో నేభాష
భాష కేల నయ్య వ్యాకరణము?
పలుక వలయునన్న భావమొక్కటి చాలు
ప్రాస యతుల దారి పట్టనేల
పలుకు పలికి నపుడు పద్యాలు పలుకునా
భాష కేల నయ్య - వ్యాకరణము ?
Wednesday, September 18, 2013
శంకరాభరణం...పద్య రచన..పూరణ..( తులసి కోట, పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్! )
శ్రీ శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో.....
పద్య రచన.....తులసికోట...
హారతీయవలయు అనుదినమ్ము
తులసి యున్నఇంట దురితమ్ముతొలగును
పెంచవలయు తులసి ప్రేమతోడ.
సమస్యా పూరణ..... పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్!
రంజింప
బాల్యమందు పు
రంజనుపై భక్తి లేక బ్రతికి చివరకున్
కంజాతనేత్రు దలచిన
పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్!
రంజనుపై భక్తి లేక బ్రతికి చివరకున్
కంజాతనేత్రు దలచిన
పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్!
బాల్యమందున
దేవతా భక్తిలేక
యవ్వనమునందు భక్తియె అసలురాక
పండువయసున భక్తిగని, పంజరమున
నున్న చిలుక ఫక్కున నవ్వెన్! ఉర్విజూచి
యవ్వనమునందు భక్తియె అసలురాక
పండువయసున భక్తిగని, పంజరమున
నున్న చిలుక ఫక్కున నవ్వెన్! ఉర్విజూచి
శంకరాభరణం...పద్యరచన, పూరణ...(పట్టు విడుపులు, బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ)
శ్రీ శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
పద్య రచన...పట్టు విడుపులు...
పట్టుపట్టవలెను పలుపరీక్షలలోన
ఫలితమొచ్చు కీర్తి ప్రాప్తమగును
పట్టువిడువకున్న పడిపోవుబంధాలు
చెట్టు పిట్టకొకరు పట్టిపోవు.
సమస్యా పూరణ......బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ
మానమ్ములుపోయి అత్మాభి
మానము అంగడులబడిన మారణాలు కనగా
హీనమ్ముగానయి నానది
బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ
శంకరాభరణం...సమస్యా పూరణ...( పాయసమ్మున గారమ్ము వేయదగును )
సమస్యా పూరణ.....పాయసమ్మున గారమ్ము వేయదగును
పాలయందును కలియును పంపునీరు
పంచదారను చేరును పాడురవ్వ
పాయసమ్మున గారమ్ము వేయదగును
కల్తీ గానిదేమున్నది కాలమందు...
పాయసమ్మును చేయగ పరమశుభము
పాయసమ్ము ను తిన్నను పరమ రుచియు
పాయసమ్ము న మమకారపాలు కలిపి
పాయసమ్మున గారమ్ము వేయవలెను ...
శంకరాభరణం...పద్యరచన (పునర్ఝన్మ)
శ్రీ శంకరయ్యగురువుగారికి కృతజ్ఞతలతో....
ఫద్య రచన... పునర్ఝన్మ......
మత్త కోకిల..... ( ప్రధమంగా )...
జన్మలన్నవి ఎన్నియున్నవొ జాడతెల్పిన దెవ్వరున్
ఉన్నజన్మలు ఎత్తివచ్చిన నుర్విపుత్రులు లేరుగా
మిన్ను నిక్కము, మన్నునిక్కము మీదుజన్మలు నిక్కమా
ఎన్ని జన్మలు ఎత్తెనేమిటి ఎత్తిపోతలు తప్పవే
Saturday, September 7, 2013
శంకరాభరణం; సమస్యా పూరణ ; ( సర్వదా చింతయే గాదె సంతు వలన)
శ్రీ కంది శంకరయ్య గురువుగారి చలువ వలన ప్రధమ ప్రయత్నంగా ఈ రోజు
పూరణ సీసపద్యంతో పూర్తి చేసాను...
తల్లి యొడిని దూరి తారాటలాడిన
....పసిపిల్లలనుగని బరవశించు
ఉగ్గుపాలను పోసి ఉన్నతిని కాంక్షించి
....తెలుగుపలుకుతెల్పితీర్చిదిద్దు
పస్తులున్ననుగానిపలుకష్టములురాని
....పెంచిబెద్దగజేయుపేదయైన
కంటికిరెప్పగ కాచిరక్షించుచు
....కాలమ్మువారికే ఖర్చుజేయు
ఎన్ని చేసిన తల్లుల కేమి ఫలము
ఎదురుమాటలచేతల ఎదను కోయు
పేరునిల్పరుసరికదావేరుచేయు
సర్వదా చింతయేగాదెసంతువలన…….
పూరణ సీసపద్యంతో పూర్తి చేసాను...
తల్లి యొడిని దూరి తారాటలాడిన
....పసిపిల్లలనుగని బరవశించు
ఉగ్గుపాలను పోసి ఉన్నతిని కాంక్షించి
....తెలుగుపలుకుతెల్పితీర్చిదిద్దు
పస్తులున్ననుగానిపలుకష్టములురాని
....పెంచిబెద్దగజేయుపేదయైన
కంటికిరెప్పగ కాచిరక్షించుచు
....కాలమ్మువారికే ఖర్చుజేయు
ఎన్ని చేసిన తల్లుల కేమి ఫలము
ఎదురుమాటలచేతల ఎదను కోయు
పేరునిల్పరుసరికదావేరుచేయు
సర్వదా చింతయేగాదెసంతువలన…….
శంకరాభరణం; సమస్యా పూరణ ; ( పాపాత్ములె పూజ్యులగు నుపాద్యాయులిలన్)
కోపము జూపుచు బెత్తము
చేబూ నినపుడుచెరుపును చెడుగుణమెల్లన్
రేపటి పౌరులదీర్చగ
పాపాత్ములె! పూజ్యులగు నుపాద్యాయు లిలన్
Wednesday, September 4, 2013
పద్యం....పూరణ...
సవరించిన శ్రీ శంకరయ్యగురువుగారికి,శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతలతో...
పద్యరచన ..అంశము.....బావ...
అక్కకుమగడగుబావన్
చక్కనిజోడగు వరుసకు చెల్లి మగడగున్
హక్కుగను మేనమామకు
నక్కడ సుతుడగును బావ నలుగురు మెచ్చన్
చక్కనిజోడగు వరుసకు చెల్లి మగడగున్
హక్కుగను మేనమామకు
నక్కడ సుతుడగును బావ నలుగురు మెచ్చన్
హితుడుగ నిలుచును తనస్నే
హితుడుగ నలరించు నెపుడు హితవచనములన్
సతతము సన్నిహితుడగున్
జతగా బావని పిలుచుచు జగడములాడున్
పద్యరచన ..అంశము...రూపాయి...
మాధవుండైన మహిని మనుజులైన
పచ్చనోట్లకు అహరహం పరితపించు
పరమపావన రూపమై పరిఢవిల్లు
ఇచ్చురూపాయిలేకదా ఇహముపరము
పచ్చనోట్లకు అహరహం పరితపించు
పరమపావన రూపమై పరిఢవిల్లు
ఇచ్చురూపాయిలేకదా ఇహముపరము
పూరణ....శూలి తనయగంగసోదరియుమ....
వావి వరుస నడుమ
వర్ణనలువినుడి
బావగారునయ్యెభవుడు నేడు
బ్లాగు జూడవచ్చెబ్రహ్మహరిబావ
శూలితనయగంగసోదరియుమ
బావగారునయ్యెభవుడు నేడు
బ్లాగు జూడవచ్చెబ్రహ్మహరిబావ
శూలితనయగంగసోదరియుమ
పూరణ......పాదమ్ములులేని నరుడు పరుగిడ జొచ్చెన్
*శోధన చేయగచాలును
సాధింతురుపనులనిలనుశ్రమతోనయినన్
పాదముజైపూరివితొడిగి
పాదమ్ములులేనినరుడుపరుగిడజొచ్చెన్
సాధింతురుపనులనిలనుశ్రమతోనయినన్
పాదముజైపూరివితొడిగి
పాదమ్ములులేనినరుడుపరుగిడజొచ్చెన్
నాదే గెలుపని తలచెను
గాదే యుత్తరుడు రిపులగని భీతిల్లెన్
దా దిగె నరదము నో యధి
పా! దమ్ములు లేని నరుడు పరుగిడ జొచ్చెన్
దా దిగె నరదము నో యధి
పా! దమ్ములు లేని నరుడు పరుగిడ జొచ్చెన్
పద్యరచన...అంశము..దానిమ్మపండు..
ఎంత మంచిది దానిమ్మ ఎఱ్ఱనుండు
తినగతినగగారూపము తీరునుండు
పుష్కలముగవిటమినులుపూర్తిగుండు
దివ్య మయినట్టి మందిది తినగ రండు
తినగతినగగారూపము తీరునుండు
పుష్కలముగవిటమినులుపూర్తిగుండు
దివ్య మయినట్టి మందిది తినగ రండు
పద్యరచన...అంశము..తెలుగు పద్యము...
తెలుగున పద్యము తీయన
మిలమిలమని మెరయునెపుడు మిన్నునతారన్
పలికిన పదముల భావము
సులువుగధారణ పరుగిడి సురుచిరమునగున్
మిలమిలమని మెరయునెపుడు మిన్నునతారన్
పలికిన పదముల భావము
సులువుగధారణ పరుగిడి సురుచిరమునగున్
తేనెకన్న తీపి తెలుగుభాషమనది
పాలధారవోలె పద్యముండు
భావనిధులువేడి భారతీదేవికి
ఆటవెలదితోడ ఆర్ఘ్యమిత్తు
పాలధారవోలె పద్యముండు
భావనిధులువేడి భారతీదేవికి
ఆటవెలదితోడ ఆర్ఘ్యమిత్తు
పూరణ......భాగ్యనగరము కాదు హైదరాబాదు....
భాగమతిపేరవెలసిన
భాగ్యసీమ
భావ రంజితసత్కళాభాసురమ్ము
భాగ్యనగరముహైదరాబాదు!కాదు!
కాదనియన్నపాడియా!కనులజూడ
భావ రంజితసత్కళాభాసురమ్ము
భాగ్యనగరముహైదరాబాదు!కాదు!
కాదనియన్నపాడియా!కనులజూడ
పద్యరచన...ఆకాశవాణి...
అకట! ఆకాశవాణియెనంతరించె
కొత్త పోకడరూపమై కోరిపిలిచె
మంచిమాటలు పాటలు మాయమయ్యె
మిర్చిరేడియోగోలలు మింటికెగసె
కొత్త పోకడరూపమై కోరిపిలిచె
మంచిమాటలు పాటలు మాయమయ్యె
మిర్చిరేడియోగోలలు మింటికెగసె
Subscribe to:
Posts (Atom)