Tuesday, October 29, 2013

శంకరాభరణం...సమస్యాపూరణలు(పతి తల ఖండించెనంట-పార్వతి కినుకన్) (క్షీరాబ్దిశయనడనంగ శివుడే గదరా)(మామా యని బావమఱది మాటలు గలిపెన్)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...

సమస్యాపూరణ.....పతి తల ఖండించెనంట -పార్వతి కినుకన్..
 ప్రతిసతి పార్వతి గాదే
మతిచెడి పరసతులగోరు మహిషుల నణచన్
అతిహీనుండయినఉమా
పతి తల ఖండించెనంట-పార్వతి కినుకన్


సమస్యా పూరణ...క్షీరాబ్దిశయనుడనంగ ,శివుడే గదరా...


నారాయణినాధుడుహరి
క్షీరాబ్దిశయనుడనంగ,శివుడే గదరా
గౌరీ మనోహరుడనగ
కోరిక తీరగ నిరువురి కోరిభజింతున్
సమస్యాపూరణ.....మామా యని బావమరది మాటలు గలిపెన్...
 మామా! బావా! పిలుపులు
మామూ లయిపో యెనిపుడు మాటల మధ్యన్

మామకు నక్కను యివ్వగ
మామాయని బావమరది మాటలు గలిపెన్

రామా! రామా! యేమిది
మామవు బావవు వరుసకు,మాన్యుడు నీవున్
కామా పెట్టుము గొడవకు
మామా! యని బావమరది మాటలు గలిపెన్
ప్రేమగ బెద్దలు జేయగ
మామకు నక్కకు ముదమున మనువే జరిగెన్

మామయె బావగ మారిన
మామాయని బావ మరదిమాటలు గలిపెన్

శంకరాభరణం..సమస్య పూరణ( నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞు డనన్) పద్య రచన.(.కలము -కత్తి)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...


సమస్యా పూరణ...నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞు డనన్..


నెహ్రూ విజ్ఞాన ఖనికద
నెహ్రూ బాలల మనసుల నిలిచిన చాచా
నెహ్రూ నెవరందురిటుల
నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞూ డనన్
పద్య రచన..కలము - కత్తి....

కత్తి కలము రెండు ఘనమగు శస్త్రముల్
కలము బలము మిన్న కత్తి కన్న
కత్తి చేయలేని కార్యము సైతము
కదల కుండ నదియె కలము చేయు

Monday, October 28, 2013

శంకరాభరణం..సమస్యా పూరణ.( పద్యమ్ముల వ్రాయునట్టి వాడల్పు డగున్)పద్య రచన..( అతిశయోక్తులు)



శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...

సమస్యా పూరణ..పద్యమ్ముల వ్రాయునట్టి వాడల్పు డగున్...



పద్యము కవితకు ఆద్యము
పద్యమునకుప్రాణమగును ప్రాసలు యతులున్
హృద్యముగానవివ్రాయక
పద్యమ్ముల వ్రాయునట్టి వాడల్పు డగున్




పద్యము సుస్వర భరితము
పద్యము వ్రాయగ పదముల భావము పలుకున్
పద్యము మధురిమ నెరుగక
పద్యమ్ముల వ్రాయునట్టివా డల్పు డగున్

పద్య రచన...అతిశయోక్తులు...
మితిమీరునతిశయోక్తుల్
గతుకులలోనెట్టినిన్నుగారడి చేయున్
వెతలకు దారిని తీయక
శృతిమించకమాటలాడ శుభమగు ధరణిన్
అతిశ యోక్తులు బల్కుచు యంతలోనె
కొండ మీదికోతినయిన గోరు మనుచు
యడుగు చుందురు కొందరు యతిశయముగ
వాస్త వమ్మును మరచుట పాడి యగునె

శంకరాభరణం.సమస్యాపూరణ(జీతము లేనట్టి కొలువె శ్రేష్టము జగతిన్) పద్య రచన( నిధి చాల సుఖమా?)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....

సమస్యా పూరణ..జీతము లేనట్టి కొలువె శ్రేష్టము జగతిన్..


యాతన బడితే జీతము
జీతము వచ్చిననుకోతె జీవికి గొలువున్
మ్రోతలు వాతల బ్రతుకుల
జీతము లేనట్టి కొలువె శ్రేష్టము జగతిన్
పద్య రచన..నిధి చాల సుఖమా.?..

నిధియే సంతుష్టినొసగు
నిధియే కీర్తిని నిలుపును నేరము మాపున్
నిధియే దైవంబిలలో
నిధిచా లసుఖమ్మునిచ్చు నిక్కము గానే




లేదే నిధిలో సౌఖ్యము
రాదే నిధితోనెశాంతి రాదే చోటన్
పోదే నిధితో వేదన
ఏదీ పెన్నిధి యెచటన్ ఎరుకగ లేదే

శంకరాబరణం.సమస్యా పూరణ.(ధవున కపుడు గర్భమయ్యె దనయుడు పుట్టెన్) పద్య రచన..(ముద్దబంతిపూలు)


శ్రీ కంది శంకరయ్య గురువు గారికి కృతజ్ఞతలతో...

సమస్యా పూరణ..ధవున కపుడు గర్భమయ్యె దనయుడు పుట్టెన్




అవునట నేనూ వింటిని
భవుడట మోహించెహరిని భామగ జూడన్
భువనము లేలెడి యామా
ధవున కపుడు గర్బమయ్యె దనయుడు పుట్టెన్


పద్య రచన..ముద్దబంతిపూలు..


ముద్ద బంతి పూలు ముద్దులొలుకుచుండు
రకము లెన్నొ కలవు రాణి బంతి
సీమ బంతి జూడ సింధూర వర్ణము
బంతి సొగసు బొగడ బ్రహ్మ తరమె

శంకరాభరణం..సమస్యాపూరణ..(కనుల వినవచ్చు వీనుల గాంచవచ్చు)పద్యరచన..( విద్యుద్విపత్తు)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...

సమస్యా పూరణ...కనుల వినవచ్చు వీనుల గాంచవచ్చు...


ఏక దృష్టిని నిలిపిన ఎవ్వ రైన
నాద జలధిని గాంచును నమ్మకముగ
మాతృ దైవమా మోంకార మాత నపుడు
కనుల వినవచ్చు వీనుల గాంచవచ్చు



పద్య రచన....విద్యుద్విపత్తు......


విద్యుద్విపత్తు వచ్చెను
విద్యుత్ బృందము వరుసగ విధులకు రాకన్
పద్యము పంపగ బ్లాగున
విద్యుత్ లేదాయె చివరకు వీధులనైనన్

శంకరాభరణం..సమస్యా పూరణ..(అరిసెలు వేచగా వలయునా? ముదమందున బెండ్లి విందుకై..)( కంచి గరుడ సేవ ఘనత గాదె)

శ్రీ కంది శంకరయ్య గురువు గారికి కృతజ్ఞతలతో...

సమస్యా పూరణ......అరిసెలు వేచగా వలయునా? ముదమందున బెండ్లివిందుకై




వంటవారు వారు చేసిన వంటలు చెప్పు సందర్బము..


సరిసరి యన్ని వంటలును చక్కగ అయ్యెనువాటినన్నిటిన్
వరుసగ లడ్డు జాంగిరిలు బాగుగ వేగిన బజ్జి బాదుషా
విరివిగ గారి బూరెలయె, వేడిగ నేతిని గాచి బాగుగా
అరిసెలు వేచగావలయునా ? ముదమందున బెండ్లి విందుకై



సమస్యా పూరణ.....కంచి గరుడ సేవ ఘనత గాదె.....

తల్లి నివిడి పించు తనయుడు గరుడుడు
అందు కాయె నతడు హరికి తేరు
మంచి వారి సేవ మాధవుండేచేసె
కంచి గరుడ సేవ ఘనత గాదె

శంకరాభరణం..పద్య రచన(ఫ్రణయ కలహము) సమస్యా పూరణ..( ఆనప పాదునకు జూడ ననుములు పండెన్)



శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో.....

పద్య రచన..ప్రణయ కలహము....


కలహ మాడెడు యింటిన కలిమి సున్న
ఫ్రణయ కలహమందున ప్రబలు ప్రేమ
ప్రణయధారలు పలుకున పంచుకొనగ
మధుర మైనది పరిణయ బంధనమ్ము

సమస్యా పూరణ...ఆనప పాదునకు జూడ ననుములు పండెన్..

పూనా లోనొక బామ్మకు
కానక కానక కడుపున కవలలు బుట్టెన్
శీనయ గారిపెరటిలో
ఆనప పాదునకు జూడ ననుములు పండెన్



ఏనా డోనా టినదిది
కానగ కాయలు దినములు గడచిన రావే!
మేనెల లోగన గచిత్రము!
ఆనప పాదునకు జూడ ననుములు పండెన్.

Sunday, October 27, 2013

శంకరాభరణం ..పద్య రచన( ఓమనగుంటలు) సమస్యా పూరణ ( త్ర్యంబక సంభవుడు మరదియగు శ్రీపతికిన్)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో..

పద్య రచన.   వోమనగుంటలు....


వామన గుంటల నాటల
ప్రేమగ చెప్పిన కబురుల పెరిగిన చెలిమిన్
మోమున విరిసిన నవ్వులు
ఏమూలకుపోయెనేమొ ఎవరికి తెలియున్


పల్లె సీమల నాడెడి పాత యాట
కాల గతిలోన గానక కదలి పోయె
అతివ లందరు సరదాగ నాటలాడు
కున్నయోమన గుంటలీ యుర్వి లేవు



సమస్యా పూరణ......త్ర్యంబక శివుడు మరదియగు శ్రీపతికిన్

సంబరమాయెను వినగా
లంబోదరుడుగణపతికి లక్ష్మీపతికిన్
సంబంధమిదియని తెలిసెన్
త్య్రంబక సంభవుడు మరదియగు శ్రీపతికిన్

శంకరాభరణం..పద్యరచన(తాళము) సమస్యాపూరణ..(రాము నోడించె వాలి సంగ్రామమందు)...


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో..

పద్యరచన..తాళము....



యింటికి తాళము వేయగ
కంటికి కళ్లెము నువేయ కలుగును మేలౌ
మింటిని తారలు గోరగ
వంటికి మంచిదది గాదు వనితల కెపుడున్

సమస్యా పూరణ......రాము నోడించె వాలి సంగ్రామమందు

వాలి సుగ్రీవు లిరువురి రణము నందు
వాలి యెవ్వరో యెరుగక వార లందు
శరము వేయగ రాముడు జడిసెనపుడు
రాము నోడించె వాలి సం గ్రామమందు

Friday, October 25, 2013

శంకరాభరణం..పద్యరచన(పిత్రమావాస్య) సమస్యాపూరణ..(సతికి నమస్కరించి విలసద్గతి గాంచిరి పెద్దలెందరో)



శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
 పద్యరచన...పిత్రమావాస్య...
పొత్త రాలిచ్చి పిత్రులకు భోజ్య మిడును
మాళ యమవస్య రోజున మహిని జనులు
సద్గతులుగల్గి సతతము స్వర్గ మందు
పితరు లెల్లరు యుందురు ప్రీతిగాను

 సమస్యా పూరణ...సతికి నమస్కరించి విలసద్గతి గాంచిరి పెద్దలెందరో..

;సతికినిఏకదంతుడునుషణ్ముఖమాతనుగూర్మి గొల్వగన్
శృతిగతినిచ్చునామెఘనశూలికిరాణియుచండియంబికన్
సతతముగౌరిదేవియుమశాంభవియమ్మలగన్నయమ్మకున్
సతికినమస్కరించివిలసద్గతిగాంచిరిపెద్దలెందరో