Saturday, March 1, 2014

పద్య రచన 509 ( పాండురంగ) ( తల్లి ఒడి - తొలి బడి - 510)



శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...



పాండు రంగ నిగని పసిబాలుడేవచ్చి భక్తి తోడ గొడుగు బట్టె గనుడు పరమ భక్తి విత్తు పరమాత్మ బొందించు రంగ నాధ సేవ రక్ష గాదె



 

ఉగ్గు పాలు బోసి యున్నతాశయముల
తెలుగు పలుకులెల్ల తీర్చిదిద్ది
నీతి కధలు జెప్పి నియమాలు నేర్పెడు
తల్లియొడితొలిబడి యెల్లరకును

పస్తులుండి తల్లి బలుకష్టములకోర్చి
పెంచి బెద్ద జేయు పేద యైన
కంటి రెప్ప వోలె గాచును తల్లియె
తల్లియొడితొలిబడి యెల్లరకును


అమ్మ కన్న మిన్న యాదిదైవములేదు
అమ్మ ప్రేమ తోనె యవని నడచు
అమ్మ లేని యిల్లు యంధకారమ్మేను
అమ్మ బ్రహ్మ గాదె యవని లోన
 

No comments:

Post a Comment