Sunday, March 9, 2014

సమస్యాపూరణ..(1344 - గరుడుని మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి, కృజ్ఞతాభివందనములతో...



వరముగనుగరుడపంచమి
జరుపుచు నొకసతి గరుడుని చలిమిడి ప్రతిమన్
మురియుచు జేయన్ చలిమిడి
గరుడుని మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్

...
తరువున యెగురుచు కనియొక
గరుడుని కూననుగనినొక కాకోలమ్మున్
మురియుచు దొరికిన పోతక
గరుడుని మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్





హరివాహనముగ చేకొనె
గరుడుని, మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్
ఇరవున మండూకముగని
ఘురణము కాకుండబట్టి కుహరము దూరెన్
 

No comments:

Post a Comment