Sunday, March 2, 2014

సమస్యా పూరణ..( హరికి భార్య ,పర్వతాత్మజ యుమ - 1336)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....




సిరులను కురిపించు శ్రీమహా లక్ష్మియే
హరికి భార్య ,పర్వతాత్మజ యుమ
సాంబశివునికామె సహధర్మచారిణి
అఖిల జగము నేలు యాది శక్తి





పాలకడలి పట్టి పాలేటిరాచూలి
హరికి భార్య, పర్వతాత్మజయుమ
ఆది బిక్షువునికి యర్ధాంగి తానగు
పద్మభవుని భార్య వాణిగాదె

No comments:

Post a Comment