Monday, March 31, 2014
Saturday, March 29, 2014
సమస్యా పూరణ ..( 1358 - శల్యు డనగ నెవ్వడు పార్ధ? సారధి కద)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....
శల్యు నిగనిక్రీడినడిగె సన్నిహితుడు
శల్యు డనగ నెవ్వడు పార్ధ? సారధి కద
కర్ణుని రధమునకుతాను కదనమందు
మేటి విలుకాడు మాకౌను మేనమామ
ననుచు పలికెను పార్ధుడు ఘనము గాను
సమస్యా పూరణ ..1357 - నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో.....
కమ్మె కాకుల కోనలో కారుచిచ్చు
పచ్చ దనమంత బడిపోయె చిచ్చులోన
రగులుకొనుచున్న మంటల సెగలు జూడ
నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల
కమ్మె కాకుల కోనలో కారుచిచ్చు
పచ్చ దనమంత బడిపోయె చిచ్చులోన
రగులుకొనుచున్న మంటల సెగలు జూడ
నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల
సమస్యా పూరణ...1356 - రాము డనగను, సాక్షాత్తు రావణుండె )
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో.....
దశరధేశుని తనయుడు ధర్మ మూర్తి
రాము డనగను, సాక్షాత్తు రావణుండె
బిక్షు వేషము ధరియించి భిక్ష గోరి
సీత నెత్తుకు పోయిన ఘాతకుండు
సమస్యా పూరణ..(1355 - కాకియు గోకిలము గలసి కాపురముండెన్ )
-
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....
లోకమున వింత గాదిది
కాకర వారింటివెనుక గన్పడునిదియే
కేకియు గువ్వలు, చిలుకలు
కాకియు కోకిలము గలసి కాపురముండెన్
-
-
కాకమువలెనుండుహరిని
కోకిలవలెపాడురాధ కోరి వరించెన్
లోకులిదిజూచి దలచిరి
కాకియు గోకిలము గలసి కాపురముండెన్
Friday, March 28, 2014
సమస్యాపూరణ..( వెన్నెల ఱేని వెలుగులకు విచ్చె, గమలముల్ -1350)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
పున్నమి రేయిని కలువలు
వెన్నెల ఱేని వెలుగులకు విచ్చె, గమలముల్
మిన్నున దినకరునిగనగ
కన్నుల విందుగ విరిసెను కాసారమునన్
పున్నమి రేయిని కలువలు
వెన్నెల ఱేని వెలుగులకు విచ్చె, గమలముల్
మిన్నున దినకరునిగనగ
కన్నుల విందుగ విరిసెను కాసారమునన్
Sunday, March 23, 2014
పద్య రచన ...( నిద్రలో కృష్ణుడు - 535)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
తెల్ల వార వచ్చె దినకరుడరుదెంచె
గొల్ల వనిత లంత చల్ల ద్రిప్పి
రాల మంద లన్ని గోలచేయుచునుండె
మేలు కొనుము కృష్ణ లీల జూప
వెన్న దీసి యుంచె వ్రేపల్లెవాసులు
పిడత నుండె పాలు పెరటి లోన
వేచి యుండె సఖులు వీధి వాకిటిలో
వేగ మేలు కొనుము వెన్న దొంగ
సగము మూయు కనుల జగములే తిలకించి
మహిమ లెన్నొ జూపి మహిని గాచి
బాల ప్రాయ మందు లీలలే జూపేవు
బాల కృష్ణ నీకు వందనములు
సమస్యా పూరణ..( పందికిన్ బుట్టె చక్కని పాడి యావు -1350)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , కృతజ్ఞతాభివందనములతో....
రక్కసుని వంటివానికి లక్షణముగ
హితవు గోరెడి సద్గుణ సుతుడు గలిగె
జనులు దలచుచుందురిటుల ఘనముగాను
పందికిన్ బుట్టె చక్కని పాడి యావు
రక్కసుని వంటివానికి లక్షణముగ
హితవు గోరెడి సద్గుణ సుతుడు గలిగె
జనులు దలచుచుందురిటుల ఘనముగాను
పందికిన్ బుట్టె చక్కని పాడి యావు
Friday, March 21, 2014
Thursday, March 13, 2014
Tuesday, March 11, 2014
Monday, March 10, 2014
Sunday, March 9, 2014
సమస్యాపూరణ..(1344 - గరుడుని మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్)
- శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి, కృజ్ఞతాభివందనములతో...
వరముగనుగరుడపంచమి
జరుపుచు నొకసతి గరుడుని చలిమిడి ప్రతిమన్
మురియుచు జేయన్ చలిమిడి
గరుడుని మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్
-
- ...
- తరువున యెగురుచు కనియొక
గరుడుని కూననుగనినొక కాకోలమ్మున్
మురియుచు దొరికిన పోతక
గరుడుని మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్
హరివాహనముగ చేకొనె
గరుడుని, మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్
ఇరవున మండూకముగని
ఘురణము కాకుండబట్టి కుహరము దూరెన్
Saturday, March 8, 2014
సమస్యా పూరణ..( ఏటేటా నెన్నికల్ హితమిచ్చు మనకు -1343)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనమలతో...
ద్విపద..(ప్రధమంగా వ్రాశాను)
ఏటేటా నెన్నికల్ హితమిచ్చు మనకు
మాటాడగలహక్కు మనకప్పుడొచ్చు
ద్విపద..(ప్రధమంగా వ్రాశాను)
ఏటేటా నెన్నికల్ హితమిచ్చు మనకు
మాటాడగలహక్కు మనకప్పుడొచ్చు
- ఓటేయు హక్కుని వొదిలించు కోకు
నీటైన రూటున్న నేతల్ని జూడు
తూటాయె మనవోటు తొలగించు చెడును
దాటేసి నావంటె దండాలు నీకు
ఏటేటా నెన్నికల్ హితమిచ్చు మనకు
సమస్యా పూరణ..(1342..శ్రీకృష్ణుడు, శూర్పణఖకు జెవులం గోసెన్)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనమలతో...
పోకిరి కంసుని జంపెను
శ్రీకృష్ణుడు, శూర్పణఖకు జెవులం గోసెన్
కేకల తోలక్ష్మణుడా
లేకిగ సరసమ్ములాడు లేమను జూడన్
పోకిరి కంసుని జంపెను
శ్రీకృష్ణుడు, శూర్పణఖకు జెవులం గోసెన్
కేకల తోలక్ష్మణుడా
లేకిగ సరసమ్ములాడు లేమను జూడన్
Wednesday, March 5, 2014
పద్య రచన..(524..అమ్మాయి)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో..
ముక్కెర మెరుపులు మోమున
చిక్కని కురులందుకలువ చిందెను సొగసున్
చెక్కిన శిల్పము తీరున
చక్కగసింగారమొలుకు సఖినీ వెవరే!
ఇది మా గురువుగారు శ్రీ శంకరయ్యగారి ప్రశంశ..పద్యములు బాగా కాకపోయినా , కాస్తయినా వ్రాయగలుగుతున్నాను అనే నమ్మకాన్ని కల్లించిన ప్రోత్యాహపు దీవెన..
చక్కని పద్యము నుడివిన శైలజకు నుతుల్!’
సమస్యా పూరణ..(రావణుని పత్ని,సీతమ్మ, రామ భగిని 1340)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
పడతి మండోదరెవరికి పత్ని యయ్యె?
రామ చంద్రుని భార్యయౌ రమణి యెవరు?
భామ సోదరి పర్యాయ పదములేవి?
రావణుని పత్ని,సీతమ్మ, రామ భగిని
Monday, March 3, 2014
సమస్యా పూరణ..( తలకాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్ 1339)
Sunday, March 2, 2014
సమస్యా పూరణ - ( మల్లెతీగకు, పూచె చేమంతు లెన్నో 1338)
శ్రీ కంది శంకరయ్య గురువు గారికి కృతజ్ఞతాభి వందనములతో...
పరిమళమ్ములు వెదజల్లి పలుకరించి
బొండు మల్లెలు విరబూసె నిండుగాను
మల్లెతీగకు, పూచె చేమంతు లెన్నో
అందగించుచు కనులకు విందుజేసె
సమస్యా పూరణ..(తల దొలగించిన శుభమ్ము తప్పక కలుగున్ 1337)
పద్య రచన - (521 - చెమ్మచెక్క )
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
సుగంధి.....
అమ్మ నేర్పుపాటలన్ని యాటలందు పాడుచున్
చెమ్మచెక్క చెమ్మచెక్క చెల్లితోనె యాడుచున్
కొమ్మ కొమ్మలందు దాగి కోయిలమ్మ కూయగన్
చిమ్మచీకటందుకూడ చిందులేయు వేడ్కతో
సెల్లుగేము వీడియోలు చేతులందు బట్టుచున్
చెల్లి యక్కలంత చేరి చెమ్మచెక్క లాడునా
పల్లె సీమ లందుకూడ పాత యాటలందురే
కళ్ళజోడు తెచ్చిపెట్టు కాంతిగేము లొచ్చెనే
సమస్యా పూరణ..( హరికి భార్య ,పర్వతాత్మజ యుమ - 1336)
సమస్యా పూరణ..(పుణ్య కర్ముడు నరకమ్ము బొంది వగచె 1334)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....
పుణ్య కార్యము లెన్నియో భువిని జేసి
సత్య వర్తన వీడక సాగి నానె
పాప పలమేదొ నన్నింక బట్టె ననుచు
పుణ్య కర్ముడు నరకమ్ము బొంది వగచె
- .
-
ఆడి దప్పని మహరాజు యాలినమ్మి
అష్ట కష్టము లన్నియు ననుభవించి
కాటి కాపరి తానాయె కర్మమునను
పుణ్య కర్ముడు నరకమ్ము బొంది వగచె
సమస్యా పూరణ .(.ముట్లుడుగిన రాధకిపుడు మూడవ నెలరా - 1331) (వృధ్ధురాలిని వధియించె బుధ్ధుడలిగి 1333)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
ఎట్లో నోములు నోచియు
మెట్లకు పూజలు జరుపగ మేదిని యందున్
హిట్లరు గృహమున వరముగ
ముట్లుడుగిన రాధకిపుడు మూడవ నెలరా
బుద్ధు డనువాడు నీచుడై క్రుద్ధుడవగ
బుధ్ధి నేర్పగ దలచెను ముదుసలవ్వ
దిద్ది తీర్చగ వానిపై శ్రధ్ద జూప
వృధ్ధురాలిని వధియించె బుధ్ధుడలిగి
Saturday, March 1, 2014
( సమస్యా పూరణ..చంద్ర బింబమ్మునందు భాస్కరుడు వెలిగె -1327)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
కలువ ఱేనికి ప్రతిరోజు కాంతి నొసగి
వేయి కిరణాల భానుండు వెలుగు చుండు
తమ్మి దొరతోడ శోభిల్లు ధాత్రి గాదె
చంద్ర బింబమ్మునందు భాస్కరుడు వెలిగె
పద్య రచన 509 ( పాండురంగ) ( తల్లి ఒడి - తొలి బడి - 510)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
పాండు రంగ నిగని
పసిబాలుడేవచ్చి
భక్తి తోడ గొడుగు బట్టె
గనుడు
పరమ భక్తి విత్తు పరమాత్మ
బొందించు
రంగ నాధ సేవ రక్ష గాదె
ఉగ్గు పాలు బోసి యున్నతాశయముల
తెలుగు పలుకులెల్ల తీర్చిదిద్ది
నీతి కధలు జెప్పి నియమాలు నేర్పెడు
తల్లియొడితొలిబడి యెల్లరకును
పస్తులుండి తల్లి బలుకష్టములకోర్చి
పెంచి బెద్ద జేయు పేద యైన
కంటి రెప్ప వోలె గాచును తల్లియె
తల్లియొడితొలిబడి యెల్లరకును
అమ్మ కన్న మిన్న యాదిదైవములేదు
అమ్మ ప్రేమ తోనె యవని నడచు
అమ్మ లేని యిల్లు యంధకారమ్మేను
అమ్మ బ్రహ్మ గాదె యవని లోన
తెలుగు పలుకులెల్ల తీర్చిదిద్ది
నీతి కధలు జెప్పి నియమాలు నేర్పెడు
తల్లియొడితొలిబడి యెల్లరకును
పస్తులుండి తల్లి బలుకష్టములకోర్చి
పెంచి బెద్ద జేయు పేద యైన
కంటి రెప్ప వోలె గాచును తల్లియె
తల్లియొడితొలిబడి యెల్లరకును
అమ్మ కన్న మిన్న యాదిదైవములేదు
అమ్మ ప్రేమ తోనె యవని నడచు
అమ్మ లేని యిల్లు యంధకారమ్మేను
అమ్మ బ్రహ్మ గాదె యవని లోన
Subscribe to:
Posts (Atom)