Friday, August 30, 2013

చిదంబర రహస్యం........


                                          చిదంబరం





          చిదంబరం,..నటరాజస్వామి ఆనందతాండవం చేసేఈ ఆలయానికి కోయిల్ అనే పేరుకూడా వుంది,..అలాగే మరొక నామం తిల్లయ్ అని కూడా పిలుస్తారు..

          పాండిచ్చేరి నుండి బస్ లో రెండున్నర గంటలు పడుతుంది చిదంబరం చేరేసరికి, చాలా పెద్ద ఆలయం. తొలి ప్రాకారంలోంచి మందిరంలోకి ప్రవేశించగానే ఆనంద నటరాజస్వామి నాట్యంచేసే అద్బుత రూపం సాక్షాత్కరిస్తుందిమాటలలో చెప్పలేని అలౌకిక ఆనందాన్ని చూపరులకు కల్గిస్తుంది.స్వామి పక్కనే అమ్మవారి విగ్రహం ్అందాలొలుకుతూ అలరిస్తుంది..


            ఆ ప్రాకారంలోనే గోవిందరాజ పెరుమాళ్ ఆలయం కూడా వుంటుంది.ఇక్కడ ఒకచోట నిలబడి అటు శివుడిని, ఇటు విష్ణువుని చూడవచ్చు..ఈ విధంగా మరెక్కడా లేదు..నటరాజస్వామి వారిని దర్సించాక, అక్కడవున్న పూజారులు
 ఆ గుడి గురించి ,దైవాన్ని గూర్చి తమిళంలో చెపుతారు,. చిదంబరం, అన్న ముక్క తప్ప మరేమీ అర్దం కాదు తమిళ్ రాకపోతే, మా పరిస్తితి అలాగే అయ్యింది,..పక్కన వున్న ఇంగ్లీషు వచ్చిన వారు వివరించారు,..ఆ వెంటనే ,చిదంబర రహస్య గురించి చెప్పి ఒక్క 5 సెకెండ్స్ చూపిస్తారు...


        నటరాజస్వామి కుడివైపున ఒక చిన్న ద్వారం వుంటుంది, అక్కడ గోడకు ఒకయంత్రము బిగించబడి వుంటుందని అక్కడ చెబుతారు, అది యంత్రమో,, చక్రమోఎవరికీ సరిగ్గా తెలియదు,ఆ యంత్రం వున్న భాగంపై చందనం అద్ది వుంటుంది, ఆ యంత్రం వుండే స్తలాన్ని భక్తులు కిటికీ సందుల గుండా చూస్తారు , అదీ కొన్ని క్షణాలు మాత్రమే,పూజ జరిగాక పూజారి హారతి ఇస్తారు , ఆ వెలుగులో యంత్రం ముందు వున్న తెరను తెలగించి చూడమంటారు, ా యంత్రంపై బంగారు బిల్వపత్రాల మాల కన్పిస్తుంది, అదీ హారతి వెలుగులోనే కన్పిస్తుంది,తెర ఎత్తగానే ఒక అపురూప తేజం,కనులముందు మెరుస్తుంది, అదే నిరాకారుడైన దేవుని ఉనికిని తెలియజెసే సూచన,అదే చిదంబర రహస్యం,






        శివదేవుడి ఉనికి రూపాలు 5 రకాలుగా వుంటాయని అంటారు, అవి జల, వాయు అగ్ని, భూమి, ఆకాశంచిదంబరంలో ఆకాశ, రూపంగా కొలుస్తారు,..చిదంబర రహస్యం, ఓ అద్బుతం, ఆశ్చర్యం, ఎవరి భావన ప్రకారం, ఆ రూపంలో నిరాకారుడైన ఆ దేవదేవుని రూపం కన్పిస్తుంది. అనిర్వచనీయమైన ఆనందానుభూతికల్గిస్తుంది,..
        ఆలయమంతా నాట్యకళాసంబంధమైన శిల్పాలతో అందంగా వుంటుంది,.. ప్రతీ ఒక్కరూ ఒకసారైనా దర్శించాల్సిన క్షేత్రం ,భూలోక కైలాసం,చిదంబరం...





శంకరాభరణం..

శ్రీ కందిశంకరయ్యగురువుగారికి,కృతజ్ఞతాభివందనములతో..

నా పద్యము చక్కని ధారతో బాగుందన్న గురువుగారి అభినందన ..పద్యరచన ఇంకా బాగావ్రాయాలన్నఆశక్తి,ఉత్యాహం , కల్గిస్తోంది..ఈ మాత్రం వ్రాయగలుగుతున్నానంటే , అది ఇరువురు గురువుగార్ల చలవ,
ఇంకా సాహితీ మిత్రుల సహకారం...

ఈనాటి పద్యరచన అంశము ..లోభి,,


ధనము కలిగె నేమి దాతృత్వమేలేక
 
ధర్మచింతలేకతానుతినక


 
లోభియైనవాడు లోకానికేచేటు


 
దాచుకున్నచాలు ధర్మమొకటి



శ్రీ జిలేబిగారి బావమునకు ..నా పద్యము....


కత్తి పట్టు రాజు కాచిదాతయునగు

 
బుద్దినొసగు మేధ బూర్తిదాత
 
పుష్టికలుగుగల్ల బుణ్యంబుదాతయు

 
లోభియగునుతానులోకదాత

Wednesday, August 28, 2013

శంకరాభరణం



శ్రీ పండిత నేమాని గురువుగారికి కృతజ్ఞతాబివందనములతో.....
పద్యరచన ...అంశము...పకోడి.....



కరకర లాడుచు కమ్మగ
 
కరముల నందముగ నమరి కన్నుల బడుచో

 
హరుడైన కరగిపోవును

 
మరచుచు నిజతత్త్వము కద మంచి పకోడీ!




 

చిరు చిరు జల్లులు చినుకులు
 

కురియు నెడల నెదుట నీవు ఘుమ్మనుచుండన్
 
నరులయినను సురలయినను
 

నురకలనే వేయరొక్కొ? యుల్లిపకోడీ!



 

ఎందుకు పిజ్జా బర్గరు
 

లెందుకు నూడుల్సు నీవె యెదురగు నెడ నీ
 
ముందెల్ల తీసికట్టే
 

విందగుదువు నీవెకాదె? వేడి పకోడీ!

Monday, August 26, 2013

శంకరాభరణం..

శ్రీ కందిశంకరయ్యగురువుగారికి కృతజ్ఞతాభివందనములతో......

పద్యరచన....అంశము...కృష్ణానదీ స్తవము...

పరమ పావనతల్లిమాపాలవెల్లి
కలుషహారిణి కలుముల కల్పవల్లి
కరుణచిలికెడి కమ్మని కనకధార
కృష్ణవేణమ్మ వెలసెసు క్షేత్రమందు

వాసుదేవుడు కృష్ణగ వసుధ వెలసె
ఇంద్ర కీలాద్రి దుర్గమ్మ ఎదుట నిలిచె
పండు మెండుగ ముక్కారు పంట  చాల
తల్లి నామము పలుక తరలు నఘము

నిన్ను శరణని కొలుతురు నిఖిల లోకం
 జీవమిచ్చునీ నీరము జీవులకును
సకలసంపద లొసగుమా సంతసమున
ప్రణతులిడెదనుకృష్ణమ్మపాద్యమిమ్మ


శంకరాభరణము

శంకరాభరణం బ్లాగులో పద్యరచన,పూరణకు నేను వ్రాసిన పద్యములు 


సరిదిద్దిన శ్రీకందిశంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువర్యులకు 


ధన్యవాదములతో....



పద్యరచన ..అంశము..........భాంధవ్యములు....



ఆర్జనంబు గలుగ నాప్తుల మనుచును    
బంధుజనము వచ్చి పడుదురింట
పేద యైన వాడి పేరైన దలపరు
బంధనము లవి క్షణ భంగురములు



సమస్యాపూరణ........మురళీ గానమ్ము మరణమును గల్గించున్.......




తొలగించుమురళీ గానము మధురా
పురజనులెల్ల వినుచుండి పులకింపగ నా
హరి గని కాళీయునకును
మురళీ గానమ్ము మరణమును గల్గించున్

Friday, August 23, 2013

శంకరాభరణం.



సమస్యా పూరణ......రామభక్తులలో మేటి రావణుండు




పవన సూనుండు, హనుమయు, పక్షిరాజు,
భక్త కంచర్ల గోపన్న, పడతి శబరి,
రామ భక్త శేఖరులు, వైరమ్ము వలన
రామ భక్తులలో మేటి రావణుండు.



పద్యరచన..అంశము.....జనారణ్యము....





అడవులన్ని నేడు నంతరించుచుండె
కడకు పట్టణాలు కాన లాయె
మేకవన్నెపులుల కాకరమైనట్టి

జన విపినములను గనుడు నేడు

శంకరాభరణం


శంకరాభరణం బ్లాగులో  పద్యరచన,పూరణలకు నేను వ్రాసిన పద్యములు,...సరిదిద్దిన శ్రీ శంకరయ్యగురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములు..

పద్యరచన..అంశము ..తిరుగలి...

తిరుగక మగవాడు ధీరుడు గాలేడు
తిరిగి ఆడువారి తీరు జెడును
తిరుగులేని తీర్పు తిరుగలి ఇచ్చెను
తెలిసికొన్న చాలు తెలివికలిగి



ఈ క్రింది పద్యము జిలేబి గారి భావమునకు నేను వ్రాసినది..

తిప్పు వారు లేక తిరుగలి యిప్పుడు
మ్యూజియమ్ము చేరి మూల నక్కె
తీరు బడియె లేక తిన్నదరుగదాయె
చిత్రమాయె మనుజ జీవనమ్ము


సమస్యా పూరణ..అంశము.. .తీర్ధయాత్రలవలన వర్ధిల్లు నఘము..



చిత్తశాంతి నొసగు దీరు చింతలన్ని

భక్తి భావమ్ము కలిగిన భావితరము

తీర్ధయాత్రలవలన వర్ధిల్లు నఘము

చిత్రమాయె మనుజ జీవనమ్ము

Wednesday, August 21, 2013

శంకరాభరణం



శంకరాభరణం బ్లాగులో నేటి పద్య రచన అంశము...రక్షాబంధనము..

సవరించిన శ్రీ కందిశంకరయ్య గురువుగారికి, కృతజ్ఞతలు...




చేయి మెరియగ కట్టును చెల్లి రాఖి
అన్నదమ్ముల అండయె అగును కాన్క
తోడబుట్టిన బంధమ్ము తోడునీడ
భాగ్యమయినది రక్షించు బంధనమ్ము..

Tuesday, August 20, 2013

శంకరాభరణం..


                                       అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.


                   శంకరాభరణం బ్లాగులో  పద్యరచన , సమస్యా పూరణలకు , నేను వ్రాసిన పద్యములు..సరిదిద్దిన శ్రీ పండిత నేమాని గురువుగారికి, శ్రీ కందిశంకరయ్యగురువుగారికి, శ్రీ వరప్రసాద్ గారికి,నా కృతజ్ఞతాభివందనములు...

సమస్యా పూరణ..."వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును..."



సంచితములవలన సామీప్య జన్మలన్ని
సంక్రమించుచునుండునుసతుల కెపుడు

జీవితములనడుమ నన్ని చిక్కుముడులె



వలదు వలదనకొన్న సంప్రాప్తమగును


నేటి పద్యరచన "తెలుగు జాతి మనది"



తెలుగు జాతి మనది తెలివి కలదిలలో" 
తెలుగు భాష మనది తేనె లొలుకు
తెలుగు నేల మనది తేజమై నలరగ
తెలుగు వీర నీవు దెలుసు కొనుము



ఉత్యాహ ..


తెలుగుదనము చాట నీవు తెలుగు పాట పాడరా!


జ్వలన విషమ భావ శిఖలు సంయమమున నార్పరా!


తెలుగు జాతి మనది యని మదిన్ విపంచి మీటరా!


తెలుగు తల్లి కనులు తుడిచి తిలక మొప్ప దిద్దరా! 






Monday, August 19, 2013

Beautiful పాండి.....

             

           
               
                                 పాండిచ్చేరి(పుదుచ్చేరి) సుందర నగరం, విశాలమైన ఫ్రెంచ్ కోలనీస్ కనువిందు కల్గిస్తాయి,చక్కని ఇళ్ళ నిర్మాణాలతో ,రణగొణ ధ్వనులు లేక ప్రశాంతంగా వున్న ప్రాంతాలలో వారి నివాసాలు ఆహ్లాదకరంగా ప్రశాంతతకు వారు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పకనే చెపుతుంటాయి..

                 ముందుగా మాత్రి మందిర్ గురించి చెప్పాలి, పాండచ్చేరి సిటీ ఔట్ స్కర్ట్స్ లో ఆరోవిల్లి అనే ప్రాంతంలో మాత్రి మందిర్ వుంటుంది,..ఇది కట్టేందుకు ఎనిమిదేళ్ళు పట్టిందట...అక్కడ మెడిటేషన్ , యోగా చేస్తుంటారు, చాలా ప్రశాంతంగా వున్న వాతావరణంలో గోల్డ్ కలర్ పెటల్స్ తో పెద్ద గ్లోబ్ ఆకారంలో అత్యద్భుతంగా వుంటుంది .. ఆ గ్లో బ్ మద్య భాగంలో క్రిస్టల్ పవర్ వుంటుంది
ఆది తాకితే మంచి ఎనర్జీ వస్తుందట..అయితే దానిని తాకాలంటే 3 రోజులు ముందు అనుమతి తీసుకోవాలి..

                                                     
                                                                మాత్రిమందిర్

                ఆ ప్రాంతంలో అందరూ ఎక్కువగా ఫ్రెంచివారే వున్నారు..మాత్రి మందిర్ కి వెళ్ళడానికి ముందు ఎంట్రన్స్ల్ లో నమూనా మాత్రి మందిర్ ,దాని గురించిన అన్నివివరాలతో వీడియో కూడా చూపిస్తూ వుంటారు,..అవి చూసి లోపలకి వెళ్ళడానికి అనుమతి తీసుకుని , చాలాదూరం, పచ్చని , పొడవాటి చెట్లు , అవి చేసే ధ్వనులు వింటూ వెళ్తే మాత్రి మందిర్ వస్తుంది...అలసట అనిపించినా మందిర్ చూసాక మంచి అనుభూతి కల్గుతుంది...


                                          ఇదే అరవిందాశ్రమం ఎంట్రన్స గేట్..

                   ఇక ఫాండిచ్చేరిలో మరొక మంచి ప్రశాంత వాతావరణంకల్గినది అరవిందాశ్రమం..మాటలలో చెప్పలేనంత ఆహ్లాదకరంగా, ఎన్నో కాక్ట్స్కస్ మొక్కలతో, మంచి మంచి పూల తో, తాదాత్మత ఇచ్చే పరిమళభరితమైన సువాసనలతో, మన శ్వాస చప్పుడు మనకే విన్పించేంత అతి ప్రశాంతంగా అలరారుతూ వుంటుంది అరవిందాశ్రమం..అక్కడ పొటోస్ తీయడానికివీలులేదు , సెల్ఫోన్లు ఆఫ్ చేయాలి,..అక్కడ అరవిందులవారి సమాధి వున్నది ,.చుట్టూ చాలామంది కూర్చుని మెడిటేషన్ చేస్తుంటారు...

                  ఆశ్రమానికి అతి దగ్గరలో పాండి బీచ్...చాలా అందంగా వుంది...దాని ఎదురుగా ఫ్రెంచ్ గవర్నమెంట్ అఫీషియల్ బిల్డింగ్స్ ఎంతో అందంగా చూపరులను ఆకర్షిస్తాయి....అక్కడ చాలాసేపు గడిపి , దానికి కాస్త దగ్గరలోనే వున్న పాండి మార్కెట్ కి వెళ్ళాము,,అక్కడ సన్ డే మార్ట్కెట్ నాడు హాఫ్ టు హాఫ్ ఏ వస్తువైనా అమ్ముతారట...బ్రాండెడ్ వస్తువులు తక్కువకి దొరుకుతాయట.అదీ అక్కడ విశేషం..
                చాలాపెద్ద మార్కెట్ ..అంతా చూసి అక్కడి జ్ఞాపకాలు భద్రపరచి, తిరిగి మా రూంకి వచ్చేశాం..పాండిచ్చేరి అంతా చూసాక నాకు అన్పించింది..ప్రెంచివారు ప్రశాంతతని ఎక్కువగా ఇ్టపడతారు..ప్రకృతిని ప్రేమిస్తారు...


             




Saturday, August 17, 2013

శంకరాభరణం

శంకరాభరణం భ్లాగులో నేను వ్రాసిన పద్యములు ,పూరణలు,..వీటిని సవరించి ఎంతో ప్రోత్సాహాన్ని,కల్గిస్తున్నశ్రీ శంకరయ్య గురువుగారికి,శ్రీ పండిత నేమాని గురువుగారికి,కృతజ్ఞతాభివందనములు..

అలాగే..చందస్సు వివరాలు తెలియజేస్తూ, నన్నెంతో ప్రోత్సహిస్తూ,తమ సహాయ ,సహకారాలందిస్తున్న, సాహితీ మిత్రులు, శ్రీ వరప్రసాద్ గారికి, శ్రీ మధుసూదన్ గారికి ధన్యవాదములు...



ఇంత  అద్భుతంగా ఫొటో తీసిన పరుచూరి వంశీగారికి అభినందలు....

 


పద్యరచన...అంశము...పిడికిట సూర్యుడు.....

దుఢుకుగ పండని భానుని
వడిగా మ్రింగగ నెగసెను వాయు సుతుండున్
పిడికిట సూర్యుని బట్టగ
గడుసుగ చిత్రముగ తీయు ఘను డీ నరుడున్






పద్యరచన అంశము........గురుభోధన......



గురుని యొద్ద విద్య కుదురుగ నేర్చిన


జయము లొదవు చుండు జగతి యందు


గురియె గలుగు గాన గురు బోధనములందు

మార్గదర్శకుడగు మంచి గురువు

పద్యరచన...అంశము......స్వాతంత్యదినోత్సవము..


స్వాగతించె జగతి స్వాతంత్ర్య దివసమున్ 

స్వార్థ చలిత సంఘ సమరమందు

నింపి శాంతి పూలు నిలుప సమైక్యత


గల పతాక ఎగురగలుగు నెపుడొ?

సమస్యా పూరణ......స్వాతంత్యఫలమ్ము దక్కు స్వార్ధపరులకే...

స్వాతంత్ర్య దినోత్సవమున
                                                      
వాతలు వచ్చును! మనుజుల వ్రాఁత తొలఁగునే?


నేతల వ్రాఁతలె వేఱగు;


స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు స్వార్థపరులకే!

Wednesday, August 14, 2013

భారతమా..ప్రియభారతమా..

                                                   

                              ...   అందరికీ స్వాతంత్యదినోత్యవ శుభాకాంక్షలు...

               ( ఈ పాట గతంలో దూరదర్శన్ లో ప్రసారమైన లిమ్కాబుక్ఆప్ వరల్డ్ రికార్డ్స్ 13 వారాల టెలీసీరియల్...కీర్తికిరీటాలు..కి నేను వ్రాసిన టైటిల్ సాంగ్..ఇదే నా మొదటి పాట రికార్డింగ్ ,..ఈ పాట పాడినవారు , ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్,తన పాటలతో ఉర్రూతలూగిస్తున్న,పేమస్ సింగర్ , మంచి మనసుకు మారుపేరు , 
 శ్రీ కుంచె రఘుగారు...)

  భారతమా ప్రియభారతమా
  బంగరు వెల్గుల భవితవమా
 నీ ముంగిట పారిజాతాలు 
 నవకాంతి శాంతి మణిదీపాలు
 సాధనమే తమ ఆయుధమై 
 సాధించిన ఘనవిజయాలు 
         కీర్తి కిరీటాలు, కీర్తికిరీటాలు,కీర్తికిరీటాలు..
సంగీత నాట్యకోవిదులు
సమ్మోహనటవైతాళికులు
క్రీడల అనితరసాధ్యులు
శాంతిపావురాలు 
వింతైనగోపురాలు
మృతిలేని మందిరాలు
గతకాలవైభవాలు
చెరిగేపోని,తరుగేలేని
సృతిగాఉండిపోని
           కీర్తికిరీటాలు,కీర్తికిరీటాలు,కీర్తికిరీటాలు..


శంకరాభరణము

శంకరాభరణం బ్లాగులో ఈనాటి పద్య రచన ..అంశము...అపరిచితులు..

సవరించిన శ్రీ కందిశంకరయ్య గురువుగారికి, శ్రీ పండిత నేమాని గురువుగారికి , కృతజ్ఞతాభి వందనములు..


నా పద్యము..


మంచి భావ మరసి మైత్రి జేయగ పరి


 చితు లపరిచితులను చింత యేల?

 పరిచయమ్ము కాని వారేరి యత్నింప

 నపరిచితులె యాప్తు లగుదురేమొ!



సమస్యా పూరణ.....హారము కొరకై యొకసతి హారము నమ్మెన్....



ప్రధమంగా కంద పద్యాన్ని ప్రయత్నించాను...



మొదటిసారి అయినా చాలా వరకు సఫలమయ్యానని గురువుగారు 


చెప్పారు...వారి సవరణలతో ..నా పద్యం..




  దారిద్ర్యమువలనను తన

 
  దారులవియె మూసుకొనగ ధారుణిలోనన్


  మారు తెరువును గనక నా
 
  హారము కొరకై యొకసతిహారమునమ్మెన్. 








Tuesday, August 13, 2013

శంకరాభరణము

శంకరాభరణం బ్లాగులో ...

ఈనాటి పద్యరచన అంశము..శిల - శిల్పము..
 శ్రీ పండిత నేమాని గురువుగారికి, శ్రీ కందిశంకరయ్యగురువుగారికి,కృతజ్ఞతలు,....



  శిలను జెక్కెనేని శిల్పమ్ము గానగు
 
 జెక్కుచున్న భాష చేరువగును

 
 గుణము జెక్కుచున్న గుణవంతుడగు భువి

 
 మనసు జెక్కు నెడల మనుజుడగును 

నా జ్ఞాపకాలలో .ఓరుగల్లు.....

                                    
                                  భద్రకాళి అమ్మవారి గుడి

                        వరంగల్(ఓరుగల్లు) ..దగ్గరలోనే వున్న చారిత్రాత్మక ప్రదేశం,.అనుకోకుండా ఒకరోజు ట్రయినింగ్ కేంప్..ఎప్పటినుండో చూడాలనుకుంటున్న వాటిల్లో ఓరుగల్లు ఒకటి,.ఆ కోరిక  ఈ కేంప్ తో తీరింది.. ముందస్తుగా ట్రయినింగ్ స్పాట్ కి  వెళ్తూనే మద్యలోభద్రకాళి అమ్మవారి గుడిని దర్శించుకున్నాం,ఆ కోవెల చాలా అందంగా , విశాలంగా,ముచ్చటైన గోకులంతోగుడిని ఆనుకుని మంచి కోనేరుతో,అలరారుతున్నది,భద్రకాళి అమ్మవారుచూడ కన్నుల వేడుకగా,ప్రశాంతంగా,అతిమనోహరంగా ఉన్నారు,..వరంగల్ లో చాలా షాపులు,మొదలైన వాటికి భద్రకాళి అమ్మవారి పేరుతో వున్నాయి,..



                                                   వేయిస్తంభాలగూడి...
                 చూడగానే ఓ కోరిక తీరిన పీలింగ్..చాలా విశాలమైన ఆవరణలో నెలకొనివున్న వేయిస్తంభాలగుడిఆనాటి శిల్పుల అద్వితీయమైన శిల్పకళకు మచ్చుతునక, ఎటువంటి మార్పులు ,చేర్పులు లేక ఎలా వున్నది అలానే వున్నది,..అయితే అదిచూసేవరకూ, వేయిస్తంభాలు విడివిడిగా (వుంటాయనుకున్న) కాక కలిసే వుంటాయని తెల్సింది,
ఆ స్తంభాల మంటపం ముందు పెద్ద నందీశ్వరుని విగ్రహం కొలువై చూపరులను ఆకర్షిస్తుంది, నందిని కొలిచి , అక్కడ పొటోస్ తీసి,లోన కొలువైవున్న రుద్రేశ్వరస్వామిని దర్శించి,అక్కడంతా కలయతిరిగి, పంతులుగారు ఇచ్చిన పులిహోర ప్రసాదం(చాలా బాగుంది)తీసుకుని వేయిస్తంభాలగుడి జ్ఞాపకాలను ఫొటోస్ రూపంలో భద్రంచేసుకుని వచ్చేసాం..
          అయితే ఒక్కటి మటుకు చాలా భాదేసింది, తగిన సంరక్షణ లేక, అంత గొప్ప చారిత్రాత్మక కట్టడం దైన్యంగా వుంది, పురావస్తుశాఖ ఎందుకు ఆలా ఆ గుడిని వుంచేశారో అర్దంకాలేదు... ఇక వరంగల్ ఫోర్ట్ చూడటానికి , అప్పటికే చీకటిపడటంతో, గోదావరికి ముందే రిజర్వేషన్ అయి వుండటంతో తిరిగి స్టేషన్ కి వచ్చేశాం...

Monday, August 12, 2013

శంకరాభరణం..

శంకరాభరణం బ్లాగులో ఈనాటి పద్యరచన అంశము ... అద్దె ఇల్లు..(అద్దెకొంప)...

సరిది్ద్దిన శ్రీ కందిశంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలు...


నేను వ్రాసినపద్యములు...


  అద్దె కొంపయె యగు నాత్మకుదేహంబు

 
 శాశ్వతంబు కాదు సంతసించ

 
 నాత్మ శుధ్ధి కలిగి యందున్న మేలైన

 
 హరిని గాంచవలయు నఖిలజనులు.





  అద్దె ఇల్లు చూడ అధములకిచ్చిన

 
 గుత్తజేసికొనును గుట్టుగాను

 
 తగని వారికెపుడు తాళంబులొసగిన

 
 తనకు హానిగలుగు తప్పకుండ

Sunday, August 11, 2013


శంకరాభరణం బ్లాగులో పద్యరచన అంశము..కోయదొర...ఈ క్రింది ఫొటో వ్యాఖ్యకు నేను వ్రాసిన పద్యము..







 దేనికైనమందు దెయ్యమైనవదలు
 
 దైవమాన యనుచు ధైర్యమిచ్చు

 
 పొట్ట కోసమెకద పోరాడునందరు

 
 కోయదొరల మాయ కొత్తగాదె



 ఈనాటి పద్యరచన అంశము ..గానుగ.. సరిదిద్దిన శ్రీ పండిత నేమాని 

గురువుగారికి కృతజ్ఞతలు..




 భ్రమణ మొందకున్న భవితయే మాయమౌ 
 
 గానుగెద్దు లాగ గంజి సున్న

 
 పగలు రేయి బండి పయనమ్ము బ్రతుకులు

 
 పగలు సెగలు వలదు ప్రకృతి లోన