Sunday, March 23, 2014

పద్య రచన ...( నిద్రలో కృష్ణుడు - 535)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...









తెల్ల వార వచ్చె దినకరుడరుదెంచె
గొల్ల వనిత లంత చల్ల ద్రిప్పి
రాల మంద లన్ని గోలచేయుచునుండె
మేలు కొనుము కృష్ణ లీల జూప




వెన్న దీసి యుంచె వ్రేపల్లెవాసులు
పిడత నుండె పాలు పెరటి లోన
వేచి యుండె సఖులు వీధి వాకిటిలో
వేగ మేలు కొనుము వెన్న దొంగ


సగము మూయు కనుల జగములే తిలకించి
మహిమ లెన్నొ జూపి మహిని గాచి
బాల ప్రాయ మందు లీలలే జూపేవు
బాల కృష్ణ నీకు వందనములు

2 comments: