Wednesday, November 27, 2013

శంకరాభరణం....తాతకు నేర్పును మనుమడు - దగ్గెడు విధమున్ ...


శ్రీ కంది శంకరయ్యగురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...

సమస్యపూరణ.. తాతకు నేర్పును మనుమడు - దగ్గెడు విధమున్

పాతవి పాతర వేయుచు
నూతన పోకడలుపోవు నూతన తరమున్
తాతల రాతలు మారగ
తాతకు నేర్పును మనుమడు - దగ్గెడు విధమున్

నూతన విధములు తెలియని
పాతతరానికిప్రతినిధి పండితుడయినన్
పౌత్రుడు చెప్పగ వినవలె
తాతకు నేర్పును మనుమడు - దగ్గెడి విధమున్

శంకరాభరణం..తనివి గల్గించె రాముడు దానవులకు ..


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...

సమస్యాపూరణ...తనివి గల్గించె రాముడు దానవులకు

రామ పాదము తాకుచు లంక జనులు
రక్ష గోరగ, వారికి రాము డపుడు

సత్య శీలత ధర్మము చాటి జెప్పి
తనివి గల్గించె రాముడు దానవులకు

శంకరాభరణం..కడప మిరియముల్ గుమ్మడికాయలంత..


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...

సమస్యా పూరణ...కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత



ఆర డుగులుగ గెలవేసె నరటి చెట్టు
కంది చేనుకి నువ్వులు కాపు కాసె
కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత
కలవు వింతలెన్నెన్నోయీ  కలియుగాన

శంకరాభరణం..పూలవానకు శిరమున బుండ్లు రేగె...


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతలతో....

సమస్యా పూరణ....పూలవానకు శిరమున బుండ్లు రేగె....

దీప కాంతుల భువిజూడ దివియె కాగ
నిండు అమవాస రోజున నింగినుండి
రంగు రంగుల వెలుగుల రాలు అగ్ని
పూలవానకు శిరమున బుండ్లు రేగె


పూలవానకు తనువంత పులకరించు
పూల వానకు మురియును పుడమి తల్లి
జలద రింపును కల్గించు జ్ఞాపకాల
పూల వానకు శిరమున బుండ్లు రేగె

శంకరాభరణం..గాంగేయుడు పెండ్లియాడి కనె సత్సుతులన్..

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....

సమస్యా పూరణ.....గాంగేయుడు పెండ్లియాడి కనె సత్సుతులన్....



గంగా ధరునికి కొమరుడు
హంగుగ నెమలిన తిరిగెడు అంబా సుతుడున్
మంగళముగశ్రీవల్లిని
గాంగేయుడు పెండ్లియాడి కనె సత్సుతులన్

శంకరాభరణం..చెంప మీద గొట్ట సిరులు గురియునన్న.....


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి  కృతజ్ఞతలతో....

సమస్యా పూరణ..చెంప మీద గొట్ట  సిరులు గురియు


చిలిపి వలపు తెలుప చిన్నారి చెలియకు
చెంత జేరి సఖుడు చెలిమి తోడ
సిగ్గు పడుచు నవ్వు చిన్నదానినిజూచి
చెంప మీద గొట్ట సిరులు గురియు నన్న



బూది మెత్తి యున్న బుద్దిహీనుడొకడు
మాయ జేయు చుండె మాట లమ్మి
చెంప మీద గొట్ట - సిరులుగురియునన్న
చేర బిలిచి జనులు జెంప చూపె
 

శంకరాభరణం..ఆర్తజన రక్ష సేయని హరియె దిక్కు..

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారరికి కృతజ్ఞతాభివందనములతో..

సమస్యా పూరణ.....ఆర్తజన రక్ష సేయని హరియె దిక్కు


హరిని నమ్మని వారెల్ల యందు రిటుల
ఆర్తజన రక్ష సేయని హరియె దిక్కు
నీకు, హరిపదమ్ములునమ్ము నిర్మలులకు
రక్ష సేయును హరితాను లక్ష ణముగ

Thursday, November 21, 2013

శంకరాభరణం..సమస్యా పూరణలు..(ప్రాణమొసగును మృత్యదేవత జనులకు) మత్తు గలిగించు వాడెపో మంచివాడు...)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో..

సమస్యా పూరణ...ప్రాణ మొసగును మృత్యుదేవత జనులకు



శుష్క దేహము బూర్తిగా శుధ్ధిజేసి
కర్మ బంధమ్ములన్నియు కడిగి వేసి
మారు తనువిచ్చి మమతతో మరల బ్రతుక
ప్రాణ మొసగును మృత్యుదేవత జనులకు

సమస్యా పూరణ.......మత్తు గలిగించు వాడెపో మంచివాడు
మత్త్తు గలిగించు వాడెపో మంచి వాడు
కాడు! కలమును కదిలించి కవిత లల్లి
కరకు గుండెలు కరిగించి కలత నిదుర
మత్తు వదిలించ గలవాడు మంచి వాడు


చలువ వెన్నెల జల్లిన చందమామ
మేల్మి బంగరు పాపల మేనమామ
మబ్బు మాటున దాగొని మనసు దోచి
మత్తు గలిగించు వాడెపో మంచివాడు

శంకరాభరణం..దత్తపది-34(వల) సమస్యా పూరణ(కమలాప్తుని రశ్మి సోకి , కలువలు విచ్చెన్)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...



దత్తపది - 34 (వల)
"వల"
పై శబ్దాన్ని ప్రతి పాదాదిలో నిల్పుతూ
శకుంతలా దుష్యంతుల ప్రణయవృత్తాంతాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి



వలచిన వాడే మరువగ
వలపును గురుతులనుజూపి వలవల యేడ్చెన్
వలతిశకుంతల కలతల
వలలో జిక్కెను చివరికి వలపే గెలిచెన్




సమస్యా పూరణ.....కమలాప్తుని రశ్మి సోకి , కలువలు విచ్చెన్



కమలములువిరిసె సరసున
కమలాప్తుని రశ్మి సోకి , కలువలు విచ్చెన్
కుముదే శునిగని ముదముగ
మమకారముతో సుమములు మరిమరి మురిసెన్

                ఫ్రప్రధమంగా దత్తపది (వల) వ్రాయగలిగాను,.. ఇరువురు గురువుగార్ల  చలవ వలన. .".ఆశక్తి , పద్యము వ్రాయాలనే పట్టుదల,భాషపై భక్తి.."వున్న ఎవ్వరినైనా పద్య విద్యలో తీర్తిదిద్దగల ఉత్తమ గురువులు వారిరువురు...
సర్వదా వారికి కృతజ్ఞతలు...

Tuesday, November 12, 2013

శంకరాభరణం..సమస్యా పూరణ..(కర్ణుడు ,సుయోధనుని జంపె గదనమందు)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...

సమస్యా పూరణ....కర్ణుడు ,సుయోధనుని జంపె గదనమందు







పాండు తనయుడు పార్ధుడు ప్రతిన తీర
అన్న నెరుగక జంపగ నంతమాయె
కర్ణుడు ,సుయోధనుని జంపె గదనమందు
భీమ సేనుడు గదతోడ భీకరముగ

మడుగు యడుగున దాగిన మానధనుని
భీకరమ్ముగ బిలిచెను భీము డపుడు
హితుడు హతుడయ్యె గావగ నింకరాడు
కర్ణుడు ,సుయోధనుని జంపె గదనమందు

శంకరాభరణం..సమస్యా పూరణలు..(కందుకూరి వీరేశలింగము ఖలుండు) (దీపము నార్పగ గృహమున దేజ మ్మెసగెన్)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో..

సమస్యా పూరణ..కందుకూరి వీరేశలింగము ఖలుండు


కాల ధనములు జగతికే ఖర్చుజేయు
కందుకూరి వీరేశలింగము ఖలుండు
గాదు, గద్యతిక్కన యని ఘనత గాంచె
పరహితంబునుగోరెడి ప్రాజ్ఞుడుగద


సమస్యా పూరణ....దీపము నార్పగ గృహమున దేజ మ్మెసగెన్



 కోపము నసత్య భామయె
పాపము చెల్లినదియనుచు పట్టెను శరమున్
శ్రీపతి భళిభళి యనదితి
దీపము నార్పగ గృహమున దేజ మ్మెసగెన్

Monday, November 4, 2013

శంకరాభరణం .సమస్యా పూరణ( వచ్చును దీపావళి యను పండుగ నవమిన్ )



శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో..

సమస్యా పూరణ...వచ్చును దీపావళి యను పండుగ నవమిన్..



వచ్చెడి రాముని పెళ్లికి
పచ్చని పందిరిలువేసి పండుగ జరుగున్
విచ్చిన చిచ్చుల కాంతుల
వచ్చును దీపావళి యను పండుగ నవమిన్


చిచ్చుల బుడ్డులు జువ్వలు
ముచ్చట తీరగ ముదముగ ముందే గాల్చన్
హెచ్చగు వెలుగుల నిచ్చుచు
వచ్చును దీపావళి యను పండుగ నవమిన్

శంకరాభరణం..సమస్యా పూరణలు..(క్రోధమే మేలుగద సర్వ గుణములందు) విరసంబై కావ్యమొప్పె - వీనుల విందై)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి  కృతజ్ఞతాభివందనములతో....

సమస్యా పూరణ..క్రోధమే మేలుగద సర్వగుణములందు,

కలుగు కష్టనష్టములకుకారణమ్ము
క్రోధమే, మేలుగద సర్వ గుణములందు
శాంత మయ్యదె సాధించు సౌఖ్యములను
సహన శీలము శాంతికి సాక్షి యగును



జిలేభి గారి భావము నచ్చి ...ఈ పద్యము..


అదిమి పెట్టిన కోపము హానికరము
మట్టు బెట్టగ క్రోధము మహికి శాంతి
బయట బెట్టగ క్రోధము భాధ తీరు
క్రోధమే మేలుగద సర్వ గుణములందు



సమస్యా పూరణ...విరసంబై కావ్యమొప్పె - వీనుల విందై...


హరినే తలచుచు ఒకకవి
హరి కధ నే రచనచేయ హరహర యనుచున్
సురుచిరసుమధురమగు మా
వి రసంబై కావ్యమొప్పె - వీనుల విందై

Sunday, November 3, 2013

దీపావళి..


                                                                          దీపావళి



దీపపు కాంతుల లోకము
రేపటి వెలుగుల పగలును రేయిలొ చూడన్
దీపము దారిని జూపగ
దీపా వళివచ్చెనేడు దివ్వెల వెలుగున్    
            

Saturday, November 2, 2013

శంకరాభరణం..సమస్యా పూరణ..(పద్దెము వ్రాయ విద్దెయన పాచిక లాడిన చందమే సుమా) (కలి గలిగిన వాని యింట కలవే సుఖముల్)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీనేమాని గురువుగారికి

కృతజ్ఞతాభివందనములతో....

సమస్యా పూరణ...పద్దము వ్రయ విద్దయన పాచిక లాడిన చందమే సుమా


వద్దకు చేరు నొద్దికగ భారతి దీవెనలున్న వారికిన్
బుద్ధిని బెంచు పద్యచయముల్ రసబంధుర భావవాహినుల్

పద్దెము లల్లి యాశువుగ వాణిని గొల్చిన భాగ్యశాలికిన్
పద్దెము వ్రాయ విద్దెయన బాచిక లాడిన చందమే సుమా



సమస్యా పూరణ...కలి గలిగిన వాని యింట కలవే సుఖముల్..




కలహము లాడెడు యింటిన
కలియంబలయినదొరకదు కలదే కలిమిన్
చెలిమే కరువై పోయిన
కలి గలిగిన వాని యింట కలవే సుఖముల్




కలహము లాడెడు యింటిన
కలియంబలయినదొరకదు కలదే కలిమిన్
చెలిమే కరువై పోయిన
కలి గలిగిన వాని యింట కలవే సుఖముల్