ప్రహేళిక- 50
ఇతని పేరేమిటి?
సీ. ఖాండవమ్మను పేరు గలిగినట్టి దదేది?
వెలుఁగు నిచ్చెడునట్టి వేల్పెవండు?
జలమందు ముదమున జన్మించు పువ్వేది?
ఉచ్చైశ్శ్రవాఖ్యమై యొప్పు నేది?
స్తంభమున జనించి దనుజుఁ జంపె నెవండు?
దట్టమౌ వని కే పదంబు గలదు?
వనిలోన సీతఁ బట్టిన రాక్షసుఁ డెవండు? *
శిబి దేనికొఱకు నిచ్చెఁ దన పలలము?
తే. గీ.అన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లందు రెండవ యక్షరా లరసి చూడ
దేశరాజకీయములలోఁ దేజరిలిన
తెలుఁడువాఁడి నామమ్మగుఁ దెలుపఁగలరె?*(రావణుఁడు కాదు)
విపినము
సవితుడు
వనజము
తురగము
నృసింహుడు
గహనము
విరాధుడు
పావురము
పద్యరూపంలో నా సమాధానం...
బహుముఖ ప్రజ్ఞాశాలియు
బహుభాషల కోవిదుండు భరతావనిలో
సహృదయుడు గ్పంథివరుడౌ
రహి శ్రీ పీవినరసింహ రావగు నార్యా!!!
బహుభాషల కోవిదుండు భరతావనిలో
సహృదయుడు గ్పంథివరుడౌ
రహి శ్రీ పీవినరసింహ రావగు నార్యా!!!
No comments:
Post a Comment