Monday, February 17, 2014

సమస్యాపూరణ(యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్ 1303)



శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో..


శ్రమనొందిచేయుకార్యము
క్రమముగతగుఫలితమీయకలుగును ముదమున్
విమలమగుయశమునిచ్చుజ
యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్



సుమధురమౌభాషణములు                   
సుమములు హిమశీకరములు సుందర సీమల్
మమతా సమతగలకువల
యము నిష్ట పడంగ నొప్పు నఖిల ప్రాణుల్
 

No comments:

Post a Comment