Monday, February 17, 2014

సమస్యా పూరణలు..(ఓడిన వారలకు దృప్తి యొనగూడు గదా! 1301) ( కోట్లు దినుట నేర్చె కుక్కుటములు 1302)




శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....

ఓడిన సతీసుతులతో
ఓడుట కాదది గెలుపునకొక నజరానా!  
వీడని పౌరుష మున్నను
ఓడిన వారలకు దృప్తి యొనగూడు గదా!


కీడును చేయక యెవరికి           
వేడుకగానాడినోడ వీగుట గాదే!
పోడిమి పోయిన గానీ
ఓడిన వారలకు దృప్తి యొనగూడు గదా!
 పదవి దక్కగానె ప్రజలమాటమరచి         
వెధవ బ్రతుకు కొరకు వెతుకులాడి
నిధులు మ్రింగ దలచి నేర్పుగా తిరుగాడి
కోట్లు దినుట నేర్చె కుక్కుటములు




No comments:

Post a Comment