Monday, November 10, 2014

న్యస్తాక్షరి - 4

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
 
    అంశం- నగర జీవనము
ఛందస్సు- కందము
మొదటిపాదం మొదటి అక్షరం ‘న’, రెండవపాదం రెండవ అక్షరం ‘గ’, మూడవ పాదం మూడవ అక్షరం ‘ర’, నాల్గవ పాదం నాల్గవ అక్షరం ‘ము’.
 

గరమున బ్రతుకు జూడగ
సుమముగా నుండు మిగుల సొమ్ములు గలుగన్
దగము లొచ్చిన దీరును
నగరము లో జీవనమ్మె నయముగ దోచున్ !

Friday, November 7, 2014

న్యస్తాక్షరి - 3

శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....

అంశం- జటాయువు వృత్తాంతము.
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా జ-టా-యు-వు ఉండాలి. 


నక సుతతోడ లంకేశు జనుటగనిక
టారి నెదిరింప దానవుం డాగ్రహముగ
యురుకు రెక్కలు ఖండించి పెరుక రాఘ
వునకు తెలిపి ప్రాణములను వీడెనపుడు!

నిషిద్ధాక్షరి - 18

శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....

  అంశం- పద్మవ్యూహంలో అభిమన్యుఁడు.
నిషిద్ధాక్షరాలు - పవర్గాక్షరాలు (ప,ఫ,బ,భ,మ)
ఛందస్సు - మీ యిష్టం వచ్చింది.


కంజ రచనను ఛేదించి కఱ్ఱి సుతుడు
శత్రు సేనల నెదురొడ్డి సంహరించె
నీరు గారెను కురుసేన వీరు నిగని
చిన్న వాడని జూడక చేరువయ్యి
దాడి జేయుచు గూల్చెను దండు గాను!!!

Thursday, November 6, 2014

న్యస్తాక్షరి - 2

 

 శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....


అంశం- వినాయక స్తుతి.
ఛందస్సు- ఆటవెలది.
మొదటిపాదం 1వ అక్షరం ‘వి’, రెండవ పాదం 3వ అక్షరం ‘నా’, మూడవ పాదం 10వ అక్షరం ‘య’, నాలుగవ పాదం 12వ అక్షరం ‘క’.


విశ్వ నాధ సుతుడ విఘ్నేశ జేజేలు
విఘ్న నాయకునకు వేల నతులు
విద్య లొసగు మయ్య విజమ్ము లొసగుచు
శుభము గలుగ నెపుడు శూర్ప ర్ణ

న్యస్తాక్షరి - 1

 శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో...

ఇక మన మొదటి న్యస్తాక్షరి ఇది....
అంశం- సరస్వతీ స్తుతి.
ఛందస్సు- తేటగీతి.
మొదటిపాదం మొదటి అక్షరం ‘స’, రెండవ పాదం మూడవ అక్షరం ‘ర’, మూడవ పాదం తొమ్మిదవ అక్షరం ‘స్వ’, నాలుగవ పాదం పన్నెండవ అక్షరం ‘తి


సన్ను తించెద సతతము శారదాంబ
మధుర భాషిణి వాగ్దేవి మదిని నిన్ను
పలుకు కలికి సరస్వతీ! వందనమ్ము
ప్రస్తు తించెద భగవతి! ప్రణతి యిడుదు
 

నిషిద్ధాక్షరి - 17

శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో...

కవర్గాక్షరాలు లేకుండా
కాకాసుర వృత్తాంతాన్ని గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.



పత్ని ధరుణంబు జీరెడి పర్వి జూచి
దాశరథి వేసె నస్త్రము దర్భతోడ

చావ వెఱచిన పిశునము శరణుజొచ్చె
బొంది నందలి నేదైన పొంది యమ్ము
శాంత మౌనని శ్రీరామ చంద్రుడనిన
నేత్ర మొండిచ్చి సేవించి సూత్రి వెడలె
 

నిషిద్ధాక్షరి - 16


శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో ...
రామపట్టాభిషేకాన్ని వర్ణిస్తూ తేటగీతి వ్రాయండి.
మొదటిపాదాన్ని ‘రా’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘మ’ నిషిద్ధం.
రెండవపాదాన్ని ‘భ’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘ర’ నిషిద్ధం.
మూడవపాదాన్ని ‘ల’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘క్ష్మ’ నిషిద్ధం.
నాలుగవపాదాన్ని ‘శ’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘త్రు’ నిషిద్ధం.
నిషిద్ధాక్షరాలు కేవలం పాదంలో రెండవస్థానానికే పరిమితం. పద్యంలో మిగిలిన స్థానాలలో వాడవచ్చు.




 రాజ్య పట్టాభిషిక్తుడౌ రామునకును
భక్తి మీరగ మారుతి పరిచరించ
లక్షణంబుగ శత్రఘ్న లక్ష్మణుండు
శక్తిశాలురు జనులంత జయములిడగ
రమణి సీతమ్మతల్లితో రహిని గాంచె!!!

నిషిద్ధాక్షరి - 14

 శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో....

ర’ అన్న అక్షరాన్ని ఉపయోగించకుండా
రామ రావణ యుద్ధాన్ని వర్ణిస్తూ
కందపద్యం వ్రాయండి.


సీతమ్మ ను గావ దలచి
సీతాపతి లంక కేగె సేతువు మీదన్
పాతకుడౌ లంకేశు ని,
నాతిని బట్టిన దనుజుని నాశముజేసెన్!


కట్టెను సేతువు సత్యుడు
గొట్టెను లంకాధిపతిని కుజనే తెచ్చెన్
బిట్టుగ నయోధ్య జనితా
పట్టమ్మును గట్టుకొనెను పావనితోడన్!

నిషిద్ధాక్షరి - 13

 
శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో...
 
 
మొదటిపాదంలో కవర్గాక్షరాలను, రెండవపాదంలో చవర్గాక్షరాలను, 
మూడవపాదంలో తవర్గాక్షరాలను, నాల్గవపాదంలో పవర్గాక్షరాలను ఉపయోగించకుండా
భారతమాతను స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
 
 
జీవ నదులన్ని ప్రవహించు జీవభూమి!
వేదములు గీత వెలసిన వేదభూమి!
సకల కళలకు కాణాచి జయము జయము !
సుందర నందన జనని కి జోతలిడుదు!


Wednesday, November 5, 2014

నిషిద్ధాక్షరి - 12

శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....


 సరళాక్షరము(గ-జ-డ-ద-బ)లను ఉపయోగించకుండా
గాంధీజీని స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.



తెల్ల వారినెల్ల తరిమి తెచ్చె మనకు విచ్చలున్
తెల్లపంచె చేతికర్ర తెలిపె మానవత్వమున్
పిల్లలన్న పూవు లన్న ప్రేమ పంచు తత్వమున్
మల్లె వంటి మంచి మనసు మరువలేము తాతనున్

నిషిద్ధాక్షరి - 11

 శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....


 అనుస్వారాన్ని ఉపయోగించకుండా
పెండ్లి విందును గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.



విరిసిన మమతల తోడన్
మురియుచు నావడలు, బూరె, పులిహోరలతో
యరిసెలు మరి పాయసముల
పరిణయ భోజనము తినగ ప్రమదము గాదే!




 వరుస భోజనము లుపోయి పళ్లెము లను బట్టుచున్
మురిసి తినగ నొక్కమారె ముచ్చెమటలు బట్టునే
పరిణయమున భోజనములు ఫాస్ట్ ఫుడ్డు బోలగన్
వెరసి జూడ మొక్కుబడి గ వేడుకయ్యె నేడుగా!

నిషిద్ధాక్షరి - 10

 శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో..

శ, ష, స, హ అక్షరాలను ఉపయోగించకుండా
సతీసావిత్రి పాతివ్రత్యాన్ని గురించి 
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.


పతికి ప్రాణమ్ము లిమ్మని పట్టు బట్టి
వెంబడించెను కంకుని వేడుకొనుచు
దండపాణిని మెప్పించి ధర్మముగను
పతిని, తనయుని బొందెనా భాగ్యవతియె!

నిషిద్ధాక్షరి - 8



 శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....

కవర్గాక్షరము (క-ఖ-గ-ఘ-ఙ)లను ఉపయోగించకుండా
కైకేయి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.


 సుతుని రాజుని జేసెడి సూత్రమిదని
దుష్ట మంధర మాటలు దూరచెవిని
వరము నెపమున రాముని వనము జేర్చి
దశరధుని చిన్న భార్య యె తల్లడిల్లె.!

Tuesday, November 4, 2014

నిషిద్ధాక్షరి - 7

శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో....


గురువుల నిషేధంతో
గణపతిని స్తుతిస్తూ ఆటవెలదిలో
సర్వలఘు పద్యం వ్రాయండి.




శుభము గలుగు నెపుడు సుముఖుని దలచిన
విరుల నొసగి గొలువ సిరులు గురియు
కుడుము లిడిన జనుల నిడుములు తొలగును
పరశు ధరుని గొలిచి ప్రణతులిడుదు!!

నిషిద్ధాక్షరి - 6

శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో...

నిరోష్ఠ్యంగా (ప,ఫ,బ,భ,మ అనే అక్షరాలను ఉపయోగించకుండా)
మద్యపానాన్ని మానుమని హితబోధ చేస్తూ
మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.




సారా సేవించ వలదు
సారాయే హానిజేయు సర్వుల కిలలో
సారా కలతకు హేతువు
సారాయిని త్రాగకున్న స్వస్థత గల్గున్

నిషిద్దాక్షరి - 5

శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో....

నిషిద్ధాక్షరి.....


అవనిజ కనుదోయి వెలయ
శివధనువెత్తి దునుమాడి చేపట్టె కుజన్
దివి భువి నుతించె సత్యుని
పవనజనుతు భక్తితోడ వందన మనుచున్

Friday, October 3, 2014


నా బ్లాగు వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు

Tuesday, September 9, 2014

పద్య రచన

శంకరాభరణం 8 వ తేదీ పూరణలు :

పనులు మానుకొనుచు పదిలంగ గూర్చుని
కవిత లల్లుచున్న కసురుభార్య !
 నరచేతనుండగా నప్పడాలకర్ర
కవిత లల్లకున్న కలుగు సుఖము !

కలత పడును మనసు కవులకు ప్రతి రోజు
కవిత లల్లకున్న, కలుగు  సుఖము
అచ్చ తెలుగులోన నాహ్లాద కరమగు
కవిత లల్లుచున్న కాంక్ష తీర !

సుతుని రాజుని చేసెడి సూత్రమిదని
దుష్ట మంధర మాటలు దూరచెవిని
వరము నెపమున రాముని వనము జేర్చి
దశరధుని చిన్న భార్య యె తల్లడిల్లె.!

పరశుధరుని గీర్తించుచు
జరిపెదరు నిమజ్జనము సంబరములతో
శరణంచును సకల జనులు
సురవందిత నీకు మొక్కు చూడుము దయతో!

Tuesday, September 2, 2014

బాపూ బుడుగు



         గీతకు ప్రాణము పోయుచు
  జ్యోతిగ వెలిగించి నావె జోతలు బాపూ!
         రాతకి కీర్తిని తెచ్చిన 
         భూతలమున బ్రహ్మనీవు !బుడుగుకి తండ్రీ



Friday, August 29, 2014

వినాయక చవితి శుభాకాంక్షలు


బ్లాగ్ మిత్రు లందరకూ శ్రీ సిధ్ధి వినాయక చవితి శుభాకాంక్షలు.

వందనములు హేరంబుడ
వందనములు విఘ్నరాజ పార్వతి తనయా!
వందనములు లంబోదర
వందనమో నేకదంత వందన శతముల్  ! !

 


Thursday, July 3, 2014

పద్య రచన - (560)



శ్రీ  కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతోో...


శ్రీరామ నవమి రోజున
శ్రీరాముని శరణువేడ శ్రేయము గలుగున్
శ్రీరామునిపెండ్లి కనగ
శ్రీరామునిరక్ష కలిగి చింతలు దీరున్ 




 వామాంకమునన్ సీతను
ప్రేమముతోననుజునిలిపె ప్రీతిగ సరసన్
గోముగ భద్రాచలమున

క్షేమముగానుండి బ్రోచు సీతాపతియే!

Sunday, April 20, 2014

సమస్యా పూరణ...( ముండన్ జేరిన నరునకు పుణ్యము గలుగున్ 1375)

శ్రీ కంది శంకరయ్య గురువుగారకి కృతజ్ఞతాభివందనములతో....





కొండల రాయని దలచుచు
మెండుగ పూజించుచుండ మేలౌ నిలలో
వెండియు శివవల్లభ చా
ముండన్ జేరిన నరునకు పుణ్యము గలుగున్

Wednesday, April 9, 2014

పద్య రచన..559


శ్రీ కంది శంకరయ్య  గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...







పుట్టు చున్న దెల్ల గిట్టుచు నుండును
గిట్టు చున్న దెల్ల బుట్టు చుండు
పుట్టి గిట్టు లోని పోకడ లేమిటో
ఎరుక గలుగు వారు ధరను గలరె?




కర్మతోనె బుట్టి కర్మతో బెరుగుచు
కర్మ ఫలము నందె నర్మిలిచ్చి
కర్మ యందు లయము గలిగించు కాలుడే
కర్మ జన్మ గాదె కాశి నాధ

సమస్యా పూరణ..1374 (మగవానికి, గర్బమయ్యె మానిని గూడన్)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో..





తగ దైవగతింబొనరెన్
మగవానికి, గర్బమయ్యె మానిని గూడన్
సుగుణాలరాశి భార్యకు
సొగసైన సుతుడు జనించి సుఖమున్ నొసగెన్

పద్య రచన..558 -(ఏడుస్తున్న పాప)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....






పాలు గాఱెడు చిన్నారి పాప యొకతి
ఏడ్చు చుండెను తన బుగ్గలెఱ్ఱ బడగ
కనుల జారెను నీలాలు కలవరమున
ఏమి కారణ మేమియో యెవ్వ రెరుగు?


Tuesday, April 8, 2014

శ్రీరామ నవమి శుభాకాంక్షలు....

              ... అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు...
                  శ్రీరాముడు...మంచి బాలుడు ..ఒకటే మాట, ఒకటే భాణం..., ఒకటే పత్ని...అన్నదమ్ముల మీద   అలవికాని   మమతానురాగాలు, గురువులపై భక్తి, తండ్రి మాట జవదాటని సుతుడతడు...శత్రువునైనా మన్నించే గుణం,మిత్రులపై ప్రేమ...జంతువులపైన కరుణ...దర్మం తప్పని పరిపాలన...వెరసి..రామరాజ్యం...
                  ఇన్ని గుణములు  ..ఎవరికైనా సాధ్యమా..సకలగుణాబి రాముడు..శ్రీరాముడు..అందుకే అందరికీ ఆదర్శప్రాయుడు...అతనికి అన్నింటా తగిన దే మన సీతమ్మ తల్లి...
                    ప్రతీ ఉూరూ వాడా ,శోభాయమానంగా జరుపుకునే పండగ రామ నవమి...ఉదయాన్నే రామరసం(పానకం) తయారు చేసి, వడపప్పుబెల్లంతో  సీతాపతికి నివేదన చేసి , పూజ అయిన తర్వాత ఎంతో ఇష్టంగా అందరూ ఆ రామరసం సేవిస్తారు..తర్వాత గుడిలో జరిగే రామ కల్యాణం భక్తి శ్రధ్ధలతో చూసి తరిస్తారు..

           రామ, రామ,రామ యన్నచాలు అదే తారక మంత్రం...ఆ మంత్రానికున్న మహిమ అపారం... ప్రతి దేశం.ప్రతి రాష్ట్రం,.ప్రతి ఊరు, రామరాజ్యం కావాలని, ప్రతీ ఇంట్లో రాముని వంటి సుతులు వుండాలని ఆకాంక్షిస్తూ....
ఆ శ్రీరాముని  దయ అందరిపై  సదా వెల్లివిరియాలని కోరుతూ....జై శ్రీరామ్.....







Sunday, April 6, 2014

పద్య రచన..557 -(ముదితల్ నేర్వగరాని విద్యగలదే )


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...







మగువలు నేర్వని విద్యలు
జగమున లేవనుట నిజము చక్కగ నేర్పన్
మగవారికి చేదోడుగ
సగభాగము తామగుదురు సాధ్వీ మణులే!


సంగరమందున నురుకును
నింగిని సైతము వెలుగును, నిప్పుల నార్పున్
శృంగము లెక్కును చివరకు
మంగలిపని నేర్వగలరు మహిళా మణులే

సమస్యా పూరణ..1373 - (మార్జాలము సింహమయ్యె మర్మంబేమో!)


 శ్రీ  కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....


అర్జును నింటను పెరిగిన
మార్జాలము సింహమయ్యె మర్మంబేమో!
ఖర్జువు కుట్టిన దేమో!
గర్జించుచుసింహమువలె గడపను దాటెన్

సమస్యా పూరణ..1372 ( సతిని, జంపె రామచంద్రమూర్తి)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....



రక్కసు చెరనుండి రక్షించు కొనుటకు
సతిని, జంపె రామచంద్రమూర్తి
లంక నేలు నృపతి రావణ బ్రహ్మను
లక్షణముగ కుజకు రక్ష జెేసె

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...








 ఉత్సాహ......


ముందు జన్మ సచివు లనుచు ముదముతోడ నాడుచున్
వంద నీయుడగు హనుమను వానరముల వెదుకుచున్
చిందు లేయు చుండెనుగద చిన్ని కృష్ణుడన్నతో
విందు గాను చూచు చుండె వెనుక నుండి తల్లియే

Friday, April 4, 2014

పద్య రచన ..555 ( పొగత్రాగుట)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...









 భుగభుగమని పొగ వదలుచు
సిగరెట్టును ద్రాగుచున్న సిరితా పోవున్
పొగద్రాగుట హానికరము
పొగద్రాగుట మానుకున్న పొందును సుఖమున్

Thursday, April 3, 2014

సమస్యా పూరణ..1370 (నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...




చుట్టముల కొత్త యింటను
పెట్టెిరి రేడియముశశిని ప్రీతిగ తారల్
తట్టిన మేధకు జోతల్
నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే

పద్య రచన..553 (పరీక్షిత్తు)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృజ్ఞతాభివందనములతో...





 

దాహ మడుగగ బలుకని తపసి పైన
సార్వబౌముడు పడవైచె సమయునహిని
శాప మొందిపరీక్షిత్తు జనెను తుదకు
ప్రభువు నైనను వీడునా పాప ఫలము

సమస్యా పూరణ..1369 (నీతి పరుని మాట నీటి మూట)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...



గట్టి మేలు జేయ గద్దెనెక్కునెవరు?
దోచు కొనుట కదియె దొంగ దారి
దేశ ప్రజల దోచి దేవుళ్ళమను నవి
నీతి పరుని మాట నీటి మూట

పద్య రచన ..553 ( మామిడి పళ్ళు)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....







మామిడి పండ్లను జూడగ
ప్రేమను నోరూరి కొనగ వేగిర పడగా
నేమని చెప్పుదు రామా?
క్షేమంబగు ధరలు గలవె సేవింపంగన్ 




వాసి కెక్కిన పండ్లను రాశి పోసి
జూడ చక్కగ బేర్చెను జూపు లలర
పండ్లు జూడగ బంగిన పల్లి యగును
మండు వేసవి మరపించు మావి పండ్లు

జయ ఉగాది కవిత...


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....

  
జయ జయ జయవత్సరమా!
జయములనీయుము జగతికి జాగృతి తోడన్
జయమనె కోకిల రవములు
జయమంచు పలికె నుగాది జయ జయ జయహే!

పద్య రచన ..552 ( ఉగాది పచ్చడి)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...







తెల్లని మల్లెల నవ్వులు
పుల్లని మామిళ్ళు జూడ పులకరమొందన్
యెల్లరకు జయములీయగ
యుల్లము రంజిలగనేడు యుగాది వచ్చెన్

సమస్యా పూరణ ..1368 ( గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాబివందనములతో...





మతి మాలిన చేతలతో
గతుకుల బడద్రోసిపోయె గతకాలంబే
చితికిన యతుకుల బ్రతుకుల
గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ



వెతికిన లేదే శాంతియు
పతనము వైపే పరుగులు భారతదేశం

బతలా కుతలము జేసిన
గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ

పద్య రచన 551 - ( విజయకు వీడుకోలు)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...






అజరామరమగు శుభములు
నిజముగ నందించలేక నిందలు పడుచున్
విజయయె వెడలుచు నుండెన్
విజయా! వీడ్కోలు నీకు వినయము తోడన్

సమస్యా పూరణ..1366 (మల్లియతీవియకు, గాచె మామిడి కాయల్)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....




మల్లెలు పూచెను ఘుమ్మని
మల్లియతీవియకు, గాచె మామిడి కాయల్
కొల్లలుగతోట లందున
నుల్లంబులు సంతసిల్ల నూరించెనుగా

పద్య రచన -550

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...








తెల్లని తురగమునుగనగ
చల్లగ వారాశిదరిన చక్కగ నుండెన్
అల్లది కల్కికి జెందిన
తెల్లని జవనాశ్వ మనుచు తెలిసెనిపుడహో!

చమత్కార పద్యము

క్రింది పద్యంలోని చమత్కార మేమిటి?

కం.
ఏమీనన తా బేలన
నా ముంగిటి కేల రాడు నరహరి పిన్నా
రాముల ముమ్మా రంపిన
ప్రేమను మరి బుద్ధి చెప్పి పిలువవె కలికీ!


(ఏమీ అనను. తాను బేలవాఁడు. నా ముందరకు ఎందుకు రాడు? ఆ నరహరి పిన్నవాఁడు. రాములును ముమ్మారులు పంపించాను. నీవైనా బుద్ధి చెప్పి పిలువవే. కలికీ!)
 
 
సమాధానం....
 
ఈ పద్యంలో దశావతారాలు పేర్కొనబడ్డాయి.
మీన (మత్స్య), తాబేలు (కూర్మ), కిటి (వరాహ), నరహరి (నృసింహ), పిన్న (వామన), రాములు (పరశురాముఁడు, శ్రీరాముఁడు, బలరాముడు), బుద్ధి (బుద్ధ), కలికి (కల్కి). 

సమస్యా పూరణ ..1365 (నాలు గైదులు పదునారు నలిన నయన!)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...




లెక్క లందున చిక్కులు పెక్కు కలవు
పంచ వలయురెండైదులు ప్రాకటముగ
నైదు తో,వచ్చు ఫలమున కైదు కూడ
నాలు గైదులు పదునారు నలిన నయన!

నా భావము.(.55/5)+5=16


Wednesday, April 2, 2014

పద్య రచన -549 ( క్షీరసాగర మధనం)


 శ్రీ కంది శంకరయ్య  గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...

 

అమరు లసురులు చిలుక క్షీరాంబునిధిని
వచ్చు హాలహలము గని భయమునొంద
గరళ మంతయునున్ ద్రావి గళమునందు
నిలిపి పెనుముప్పు దప్పించె నీలగళుడు 


 ప్రధమంగా నేను వ్రాసిన ఖండిక యిది..  ఇదంతా గురువులైన శ్రీ శంకరయ్యగురువుగారు, శ్రీ నేమాని గురువుగార్ల ఆశీర్వాద బలం, ప్రోత్సాహం.... వారికి సదా కృతజ్ఞతాభివందనములతో...


                                                          క్షీరసాగరమధనం 

   ఖండిక......                                                  

మంధరగిరి కవ్వముగను
బంధముగయాదిశేషు బట్టగ గిరి నా
నంధువుగహరికమఠమై

సింధువు మధనమ్ము జేయ చెలువము తోడన్

పొందుగ సురలును దనుజులు
నందముగాకడలిచిలుక నానందముతో
బొందిన హాలాహలమున్
ముందుగ పుక్కిటనుబట్టె మృత్యుంజయుడే

మ్రింగెనుగద పరమశివుడు
పొంగిన గరళమ్ముతాను పుక్కిట నిడుచున్
హంగుగ గళమున బెట్టిన
జంగమదేవర నుగనగ జయజయ మనుచున్

హరిహరులను గొలిచిజనులు
మరలన్ మధనమ్ముజేయ మంధర గిరితో
సురభియు నైరావతమును
సిరియును కల్పకము శశియు చెన్నుగ వచ్చెన్

ధరియించెను శశిని శివుడు
వరియించెను సిరిని శౌరి వాత్యల్యమునన్
తరలెను సురపతి వెంబడి
సురభియు నైరావతమును సొగసుగ దివికిన్

వందనము నీలగళునకు
మందరగిరిధారి హరికి మధుసూదనకున్
వందనము సిరికి, శేషుకు
వందనమాచార్యులకును వందన మెపుడున్



సమస్యా పూరణ..1364 (బధ్ధ కించు వాడె , భాగ్య శాలి)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి   కృతజ్ఞతాభివందనములతో...



కష్టపడకయున్న కడుమందుడగును
బధ్ధ కించు వాడె , భాగ్య శాలి
యగును బద్దకమును దిగవైచినంతనె
జయము బడయు నెపుడు జగతి లోన

పద్య రచన...548 ( త్రిశంకుస్వర్గం)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....





మునివరుడా గాధిసుతుడు
ననువుగ సృజియించెనాడు నద్భుత రీతిన్
ఘనముగ త్రిశంకు కోసము
వినువీధిన సృష్టి జేసె వేరొక దివినే



నేతల మాటలు వినగా
గోతిన్ బడద్రోయనేమొ గొప్పగ జనులన్
భూతల త్రిశంకు దివియిది
ఏతావాతా నరయగ నేమగు నేమో!

ప్రహేళిక -52

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....

 ఫ్రహేళిక ...- 52




తండ్రికొడుకు లొక్క తరుణిని రమియింప
పుత్రు లిద్ద రొంది పోరు గలుగ
నొకని జంపి రాజ్య మొకని కిచ్చిన ప్రభు
వాతఁ డిచ్చు మనకు నఖిల సిరులు. 



సమాధానం...

 తండ్రి కొడుకులైన తరణి యముల చేత
కర్ణ ధర్మజులను గనెను కుంతి
సమరమందు కర్ణుఁ జంపించి ధర్మజు
నవనిపతిగఁ జేసె హరియె గాదె.

సమస్యా పూరణ..1363 (గరళ కంఠుని బూజింప,గరళ మిచ్చు)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...

 

చిత్త శాంతిని గల్గించి చింత దీర్చు
గరళ కంఠుని బూజింప,గరళ మిచ్చు
ననుచు గేలిడు వారిని గనుచు మురియు
భక్త వరదుడౌ శూలికి వందనములు

పద్య రచన ..-547 ) ఉపాధ్యాయుడు)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి, కృతజ్ఞతాభివందనములతో....








నిరతము విద్యను నేర్పుచు
పరహిత మునుగోరుచుండు వాత్సల్యముతో
సరిరారు గురువుకెవ్వరు
గురుదేవోభవ యనుచును గొలువగ రారే!




మంచి మార్గము జూపెడు మార్గదర్శి
జ్ఞాన భోధన జేయు విజ్ఞాన వేత్త
మట్టి ముద్దను ప్రతిమగ మార్చు శిల్పి
బహు ముఖమ్ముల ప్రతిభతో బరగు యొజ్జ
నట్టి బుధులకు భక్తితో నంజలింతు

Tuesday, April 1, 2014

పద్య రచన ..546 ( తోటకూర)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...








ఆకు కూరల నన్నింట ప్రాకటముగ
తోట కూరయె వసుధలో మేటి దనగ
పప్పువండగ కూరతో పరమ రుచియు
కరకర పకోడి జేసెడి కూర ఘనము




తోటన పెరిగిన కూరను
వాటముగా కోసి కడిగి వండగ పులుసున్
నోటిన నీరే యూరగ
తోటాకుల కూటు తినగ ధూర్ఝటి వచ్చున్ 

సమస్యా పూరమ.. 1361 ( జందెము విడనాడువాడె సద్బ్రాహ్మణుడౌ)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...



జందెము జీర్ణము కాగా
జందెము విడనాడువాడె సద్బ్రాహ్మణుడౌ
అందముగా లేదనుచును
జందెము విడనాడువాని జడుడన వచ్చున్

పద్యరచన -545 (మతసహనం)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...



 



పౌరు లంద రెపుడు పరమత సహనమ్ము
కలిగి యున్న మహిని గలుగు జయము
ముస్లిమైన గాని పూజించి రాముని
దైవ మొక్కడనుచు భావ మిడెను



 

రాముని గని యల్లా యని
ప్రేమముతో బూజ చేసిరి చెలియలు కదా
నామము రూపము మారిన
రాముడు జీససు రహీము లా రక్షకుడే

సమస్యా పూరణ..1360 -(గీతా పారాయణమ్ము, గీడొనరించున్)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో,,,


 
నీతియు నియమము నేర్పును
గీతా పారాయణమ్ము, గీడొనరించున్
ఖాతాలో నల్లధనము
గోతాములసంపదున్న గొడవలు దెచ్చున్

పద్య రచన ..544 - (చదువుచున్నవనిత)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...








 
చంద మామ మోము చారెడేసికనులు
నినుడు తిలక మాయె నింతి నొసట
సిగను మల్లె మాల చేతిలో పొత్తము
పట్టు చీర గట్టె పైడి బొమ్మ

సమస్యా పూరణ.. 1359 (కామితార్ధముల్ సిద్ధించు, లేమి వలన)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో..


సత్య పధమున సాగెడు సర్వులకును
కామితార్ధముల్ సిద్ధించు, లేమి వలన
కలతలవలలో జిక్కును కాపురములు
చిత్త మందున హరినామ చింత యున్న
వెతలు దీరును మనుజుల బ్రతుకు మారు

పద్య రచన ..542 ( నాణెములు)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....








యెల్లరి మన్నన బొందిన
చిల్లర నాణెమ్ములన్ని చేరెను మూలన్
చిల్లర సిరిమాలచ్చిమి
చెల్లక పోయిననునేడు చేయరె జోతల్

పద్య రచన...543 (వెన్న దొంగ )

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...







మెల్లగ వెన్నను మ్రుచ్చిల
నల్లని కన్నయ్యజేరి నటనము లాడెన్
అల్లన చట్టిని వాలిచి
చల్లగ వెన్నంత గ్రోలు చక్రికి జోతల్ 



 
అన్న రాముని తోడుగ వెన్న దొంగ
వెన్న మ్రుచ్చిల జేయచు వేడ్క నొందె
వన్నెచిన్నెల మోమున నెన్ని హొయలు
చిన్ని కృష్ణయ్య నీలీల లెన్న తరమె

Saturday, March 29, 2014

సమస్యా పూరణ ..( 1358 - శల్యు డనగ నెవ్వడు పార్ధ? సారధి కద)



 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....



శల్యు నిగనిక్రీడినడిగె సన్నిహితుడు
శల్యు డనగ నెవ్వడు పార్ధ? సారధి కద
కర్ణుని రధమునకుతాను కదనమందు
మేటి విలుకాడు మాకౌను మేనమామ
ననుచు పలికెను పార్ధుడు ఘనము గాను

సమస్యా పూరణ ..1357 - నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో.....


 

కమ్మె కాకుల కోనలో కారుచిచ్చు
పచ్చ దనమంత బడిపోయె చిచ్చులోన
రగులుకొనుచున్న మంటల సెగలు జూడ
నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల

పద్య రచన.. (541 - నర నారాయణులు)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో.....







నరనా రాయణు లనుగని
కరములు జోడించి మునులు గరుణను గోరెన్
నరహరి యవతారమనుచు
పరిపరి విధములనుతించి పరవశమొందెన్









బదరీ వనమందుమునులు
బదరీనారాయణులను భక్తిగ గొలిచెన్
పృధివీ తలమున శ్రీహరి
బదరీ క్షేత్రమునవెలసి భక్తుల భ్రోచెన్

సమస్యా పూరణ...1356 - రాము డనగను, సాక్షాత్తు రావణుండె )



 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో.....




దశరధేశుని తనయుడు ధర్మ మూర్తి
రాము డనగను, సాక్షాత్తు రావణుండె
బిక్షు వేషము ధరియించి భిక్ష గోరి
సీత నెత్తుకు పోయిన ఘాతకుండు

పద్య రచన .. ( 540 - గణపతి)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...








కరివదనుని నొడిలోనిడి
మురిపెముతో సింహయాన ముచ్చట లాడెన్
గిరిసుత ప్రేమను బొందిన
వరదుడ శ్రీ విఘ్నరాజ వందనమయ్యా!

సమస్యా పూరణ..(1355 - కాకియు గోకిలము గలసి కాపురముండెన్ )


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....


 

లోకమున వింత గాదిది
కాకర వారింటివెనుక గన్పడునిదియే
కేకియు గువ్వలు, చిలుకలు
కాకియు కోకిలము గలసి కాపురముండెన్ 



కాకమువలెనుండుహరిని
కోకిలవలెపాడురాధ కోరి వరించెన్
లోకులిదిజూచి దలచిరి
కాకియు గోకిలము గలసి కాపురముండెన్

Friday, March 28, 2014

పద్య రచన . ..539 -వటువు)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...







నొసటన విభూధి దిద్దిన
పసిప్రాయపుబాలవటువు భాసిలు చుండెన్
పొసగున్ మంత్రము బలుకగ
విసుగొందక నేర్చుచుండె వేదము శుభమున్

సమస్యాపూరణ..( వెన్నెల ఱేని వెలుగులకు విచ్చె, గమలముల్ -1350)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి  , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...


పున్నమి రేయిని కలువలు
వెన్నెల ఱేని వెలుగులకు విచ్చె, గమలముల్
మిన్నున దినకరునిగనగ
కన్నుల విందుగ విరిసెను కాసారమునన్

Sunday, March 23, 2014

పద్య రచన ...( నిద్రలో కృష్ణుడు - 535)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...









తెల్ల వార వచ్చె దినకరుడరుదెంచె
గొల్ల వనిత లంత చల్ల ద్రిప్పి
రాల మంద లన్ని గోలచేయుచునుండె
మేలు కొనుము కృష్ణ లీల జూప




వెన్న దీసి యుంచె వ్రేపల్లెవాసులు
పిడత నుండె పాలు పెరటి లోన
వేచి యుండె సఖులు వీధి వాకిటిలో
వేగ మేలు కొనుము వెన్న దొంగ


సగము మూయు కనుల జగములే తిలకించి
మహిమ లెన్నొ జూపి మహిని గాచి
బాల ప్రాయ మందు లీలలే జూపేవు
బాల కృష్ణ నీకు వందనములు

సమస్యా పూరణ..( పందికిన్ బుట్టె చక్కని పాడి యావు -1350)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , కృతజ్ఞతాభివందనములతో....





రక్కసుని వంటివానికి లక్షణముగ
హితవు గోరెడి సద్గుణ సుతుడు గలిగె
జనులు దలచుచుందురిటుల ఘనముగాను
పందికిన్ బుట్టె చక్కని పాడి యావు

Friday, March 21, 2014

పద్య రచన..( 534 - పుస్తకాల పురుగు)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి ,శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....









పుస్తకములపురుగై నను
మస్తకమునకెక్కలేదె మానవ నీకున్!
మస్తుగ పెరిగెకితాబులు!
పుస్తకములు తొడవులయ్యె పుడమిని జూడన్

Thursday, March 13, 2014

సమస్యా పూరణ..( 1348 - తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి, కృతజ్ఞతాభివందనములతో....



ఘనమగు కృష్ణుని ముద్దిడి
అనునయముగ జెంత జేరి హతమొనరించన్
చనుబాలనిచ్చి నాపూ
తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్

Tuesday, March 11, 2014

పద్య రచన - 531 ( కంప్యూటర్)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి, కృజ్ఞతాభివందనములతో....









విశ్వమంత జూపు విజ్ఞాన మందించు
మాన వాళి కిలను మంచి దోస్తు
ఘనత నంద జేయు కంప్యూటరేనేర్వ
మౌసు పట్టు కొనిరి మామ్మ గారు

Monday, March 10, 2014

పద్య రచన - 530 ( మొసలి-పక్షి)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...






ఎగురు చున్న బకము నెరవేసి బట్టగ
జోరు తోడ మకరి నోరు తెరచె
శక్తి యుక్తులున్న చక్కడగు విపత్తు
మకరి నోట బడక బకము నెగిరె

సమస్యా పూరణ..1345 (సీతకు రాఘవుడుపుట్టి శివధనువెత్తెన్)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...



భూతలముననాధుండై
సీతకు,రాఘవుడుపుట్టి శివధనువెత్తెన్
మాతయయిన కౌసల్యకతడు
ప్రీతిని గలిగించితల్లి ప్రేమను బొందెన్

Sunday, March 9, 2014

పద్య రచన - 529 ( మురళీగానము)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...








చూపించక నీరూపము
పాపము నీరాధతోనె పరిహాసములా
చూపులకైనను చిక్కని
గోపాలకనిన్ను వెదకె కోమలి రాధన్




మురళీ గానము వినగనె
కరములు జోడించి రాధ కదలుచు నాడెన్
తరులను విరులనునడుగుచు
విరహిణియౌ రాధమనసు వేదన జెందెన్


సమస్యాపూరణ..(1344 - గరుడుని మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి, కృజ్ఞతాభివందనములతో...



వరముగనుగరుడపంచమి
జరుపుచు నొకసతి గరుడుని చలిమిడి ప్రతిమన్
మురియుచు జేయన్ చలిమిడి
గరుడుని మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్

...
తరువున యెగురుచు కనియొక
గరుడుని కూననుగనినొక కాకోలమ్మున్
మురియుచు దొరికిన పోతక
గరుడుని మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్





హరివాహనముగ చేకొనె
గరుడుని, మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్
ఇరవున మండూకముగని
ఘురణము కాకుండబట్టి కుహరము దూరెన్
 

పద్య రచన..(528- చల్దులారగించుట)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీనేమాని గురువుగారికి  కృతజ్ఞతాభివందనములతో...






గోప వనితలు బాలురు గోవు లదివొ
నడుమ గూర్చుండె కన్నయ్య నల్లనయ్య
ఆల మందలు గాయుచు నలసి రేమొ!
చల్ది బంచుచు దినుచును సంతసమున

Saturday, March 8, 2014

సమస్యా పూరణ..( ఏటేటా నెన్నికల్ హితమిచ్చు మనకు -1343)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనమలతో...


 ద్విపద..(ప్రధమంగా వ్రాశాను)


ఏటేటా నెన్నికల్ హితమిచ్చు మనకు
మాటాడగలహక్కు మనకప్పుడొచ్చు




ఓటేయు హక్కుని వొదిలించు కోకు
నీటైన రూటున్న నేతల్ని జూడు
తూటాయె మనవోటు తొలగించు చెడును
దాటేసి నావంటె దండాలు నీకు
ఏటేటా నెన్నికల్ హితమిచ్చు మనకు

పద్య రచన..(527- అవిటితనం)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో,,

 




దెబ్బలు తగిలిన నాతడు
నిబ్బరమునుకోలుపోక నేర్చెను పనులన్
కొబ్బరి కాయల వృత్తిన
ఇబ్బందులు పెట్టకయ్య యింకా! రామా!

సమస్యా పూరణ..(1342..శ్రీకృష్ణుడు, శూర్పణఖకు జెవులం గోసెన్)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనమలతో...




పోకిరి కంసుని జంపెను
శ్రీకృష్ణుడు, శూర్పణఖకు జెవులం గోసెన్
కేకల తోలక్ష్మణుడా
లేకిగ సరసమ్ములాడు లేమను జూడన్

పద్య రచన..( 526 - ఏనుగు- మొసలి)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి  కృతజ్ఞతాభివందనములతో....




కరి కరముబట్టిమకరము
సరసుకు లాగుచునుకరిని జంపగ దలచెన్
బిరబిర సరిగొని మకరిని
హరి నీవేబ్రోవవలయు నాకరిన్ దయతో

Wednesday, March 5, 2014

పద్య రచన ( ఉతుకు..525)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో.....







పట్టుచు నీరును ధారగ
గొట్టెను బిందెలనునేల కోపము తోడన్
బట్టను పతిగా దలచుచు
గట్టిగ యుతికేనుసతియె కలహాంతరితై




బట్టను బాదిన రీతిన
గట్టిగ యుతికెను మగనిని కారణ మేమో?
కట్టిన తాళిని భార్యను

పట్టక పొరలిడెడి పతుల పనిగోవిందా

పద్య రచన..(524..అమ్మాయి)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో..



ముక్కెర మెరుపులు మోమున
చిక్కని కురులందుకలువ చిందెను సొగసున్
చెక్కిన శిల్పము తీరున
చక్కగసింగారమొలుకు సఖినీ వెవరే!







ఇది మా గురువుగారు శ్రీ శంకరయ్యగారి ప్రశంశ..పద్యములు బాగా కాకపోయినా , కాస్తయినా వ్రాయగలుగుతున్నాను అనే నమ్మకాన్ని కల్లించిన ప్రోత్యాహపు దీవెన..

చక్కని పద్యము నుడివిన శైలజకు నుతుల్!’



సమస్యా పూరణ..(రావణుని పత్ని,సీతమ్మ, రామ భగిని 1340)



శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...




పడతి మండోదరెవరికి పత్ని యయ్యె?
రామ చంద్రుని భార్యయౌ రమణి యెవరు?
భామ సోదరి పర్యాయ పదములేవి?
రావణుని పత్ని,సీతమ్మ, రామ భగిని

Monday, March 3, 2014

సమస్యా పూరణ..( తలకాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్ 1339)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...


అలివేణి పెళ్ళి విందున
పులిహోర వడలు యరిసెలు పూర్ణపు బూరెల్
భళిభళి యన్నియునని చిం
తలకాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్

పద్య రచన (కదళీఫలము-524)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....






ఫలములలోకెల్లఘనము
పలురకములమేలుచేయు ఫలమే యిదియున్

సులువుగ తినగలుగు ఫలము
పులకించి తినెదరుగాదె వృద్దులు పాపల్ 



 
.
మధురము గాలేనిమధువు
మధనము లేనట్టిహృదియు మాతయు లేకన్
మృదువుగనుండని వెన్నయు
కదళీపలమిడనిపూజ గలవే మహిలో