Monday, April 29, 2013

మహాకవికి...అక్షరసుమాంజలి......




కళ్ళుంటే చూసి
వాక్కుంటే వ్రాసీ
ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరనిదాహం
అన్నారు మహాకవి శ్రీ శ్రీ ..                                  అలాగే..కుక్కపిల్లా,..అగ్గిపుల్లా,...సబ్బుబిళ్ళా,..తలుపుగొళ్ళెం,..హారతిపళ్ళెం,..హీనంగా చూడకు దేన్నీ,..కవితామయమేనోయ్ అన్నీ .......అని కూడా అన్నారు...నిజమే కదా..కళ్ళకి మనసు,..మనసుకి కళ్ళు వుంటే... కవితావస్తువు కానిదేముంది?....కవితలు వ్రాస్తున్న తొలిరోజుల్లో..శ్రీ శ్రీ మహాప్రస్థానం ప్రబావం నామీద చాలా వుండేది...ఆ మహాకవికి వున్నఅనేకమంది ఏకలవ్యశిష్యుల్లో.. నేను కూడా వున్నాను...
                 అందుకే ..ఏ రసనిర్దేశం లేని వాటిపై..కవితలు వ్రాయాలని....ఇలా కొన్ని...
హారతిపళ్ళెం…..
గుళ్లో హారతి పెట్టాలన్నా
కాసులుబాగా పట్టాలన్నా
కొత్తకోడలు వచ్చిందన్నా
బారసాలలు చేయాలన్నా
చెల్లెలు రాఖీ కట్టాలన్నా
చిల్లరపైసలురాలాలన్నా
వేడుకలన్నీ జరగాలన్నా
వాడుక మనకీ హారతిపళ్ళెం….
తలుపుకి గొళ్ళెం….
మనుషుల్ని.. దండించాలన్నా
మనసుల్ని.. బంధించాలన్నా
మమతల్ని.. ఖతం చేయాలన్నా
మమకారాలపై.. కారం చల్లాలన్నా
మాటల్ని ..మాటున వుంచాలన్నా
మూటల్ని.. పదిలపరచాలన్నా
కావాలి తలుపుకి గొళ్ళెం……


Wednesday, April 24, 2013

వర్షం ..వర్షం



                  వర్షం ..వర్షం.. ఎంత హర్షం...మండే ఎండలమధ్యన ఒక్కసారిగా మంచు పూల వర్షం..మావైపు గోళీల సైజులో వడగళ్ళ వర్షం పడింది..జూన్ లో పడాల్సిన వర్షాలు యిప్పడు పడుతున్నాయని ..యీ అకాల వర్షాలు మంచివి కావని యిప్పుడే న్యూస్ విన్నా...

                ఏది ఏమైనా ..కర్షకులకి యీ వర్షం  ఎంత మాత్రం హర్షం కాదు...

              ఓ పక్క గ్లోబల్ వార్నింగ్..    మరోపక్క రాను రానూ పెరుగుతున్నపొల్యూషన్...ఇంకోవంక.. భూప్రకంపనలతో వణికిపోతున్న దేశాలు..మొన్నటివరకూ యుగాంతం ..ప్రజలని భీతావహులని చేసి వదిలింది..ఇక పైని చూద్దామంటే..  ఎప్పడు ఏ గ్రహ శకలం వచ్చి పడుతుందో అన్న భయం..ఇక కిందన చూస్తే పచ్చదనం మచ్చుకైనా కనిపించదే..

               విజ్ఞానం పెరుగుతున్నకొద్దీ  మన వినాశనం మనమే కొని తెచ్చుకొంటున్నామా..!!!!!!ఇన్ని భయాలు పక్కన పెట్టుకుని నిర్భయంగా ఎలా వుండగలం...????ఎలాగో వుందామన్నా..నిర్భయ లాంటి కేసులు ప్రతీరోజూ కోకొల్లలు...భాధ.. నరాల్ని మెలితిప్పే భాధ.. ఏమీ చేయలేని నిస్సహాయత.. వేదన ..మనసున్న ప్రతీ ఒక్కరికీ వేదనే ....రోదనే...అరణ్యరోదనే..

            మనసులను మండించు వేదనా ఆగవే ..

            దేనికోసం నీవు పరుగుపెడుతున్నావు...

             వ్యధాభరిత శిధిలహృదయం కోసమా... ఏమో మీకైనా తెలుసా....

                

           అక్షరాలు అశ్రువులై...రాలుతున్నాయి...

           బావాలు భాధగా....గాయంచేస్తున్నాయి

             గాయాలు గేయాలై గొంతుదాటి రాకున్నాయి..
                                  గద్గదమైనది స్వరము...

Saturday, April 20, 2013

బాల్యమా.... భారమా...




                       టైమ్.... అప్పడే తొమ్మిది కావస్తోంది...ఎటెండ్ కావాల్సిన  కేసులు చాలా వున్నాయి...తొందరగా వెళ్ళాలి...పని చూస్తే ఇంకా తెమలటంలేదు..సరిగ్గా అప్పడే ట్రింగ్..ట్రింగ్.. అంటూ ఫోన్...లిఫ్టు చేయగానే అటునుంచి  నా స్నేహితురాలు మంగళ   తిట్ల దండకం..మరీ  ఎంత లాయర్ వైనా వస్తానని చెప్పి ఎన్నాళ్ళైంది...అలా దాటేస్తున్నావు..నువ్వు వస్తేనే గానీ  నేను రాను ..అని బెదిరింపు..ఇంక ఆపవే తల్లీ..ఈ రోజు ఎలాగైనా వచ్చి తీరతాను సరేనా...ముందు ఫోన్ పెట్టెయ్..అంటూ వాల్ క్లాక్ చూస్తూ పరిగెట్టాను..

                       సాయంకాలం ఇంటికి వస్తుండగా గుర్తొచ్చింది..నే చేసిన వాగ్దానం.. తీరా చూస్తే చాలా దూరం  వచ్చేశాను...తప్పదు..వెళ్ళాల్సిందే అనుకుంటూ కారుని బేక్ చేసి..  మంగళ ఇంటివైపు పోనిచ్చాను...

              నన్నుచూడగానే ఆనందంతో ..ఏం తల్లీ ఇప్పటికైనా తీరిందా !” అంటూ ఎదురొచ్చింది.. ఏం చేస్తాను.. ఈ సాయంత్రం నీకిలా బుక్ అయ్యాను ..కానీ..అంటూ హాల్లో సోఫాలో బేగ్ పడేసి... కూర్చున్నా..అపుడే చూసా... ఒకామె అక్కడ వుండటం..ఇంతలో....మా మంగళ......ఇదేనండీ నే చెప్తుంటానుగా..... నా బాల్యస్నేహితురాలు శైలజ..మంచి లాయర్.....అని ఆవిడకి నన్ను పరిచయం చేసి ..శైలూ..ఈవిడ మా కొలీగ్ హరిత...అని పరస్పరం పరిచయం చేసింది...అలా కబుర్లతో ఓ పావుగంట గడిచాక..హరిత వస్తానని లేచారు..మా పాపని మ్యూజిక్ క్లాసుకి తీసుకెళ్ళాలి ..లేకుంటే ఇంకాసేపుందును మాటల్లో టైమ్ చూడలేదు అంటూ హడావిడిపడుతూ లేచారు.. ..

                  వావ్!!..నైస్....మ్యూజిక్ నేర్పిస్తున్నారా? ..ఎంతవరకు వచ్చింది?” ..అని సంగీతం పట్ల నా కున్న ఇష్టంతో అడిగాను..

                టి వి ఛానల్స్ పోటీలకి పంపించడానికి తయారు చేస్తున్నామండీ...అన్నారావిడ..ఎంతో సంబరంగా...

                ఓహ్ అలాగా..పాపకి ఎన్నేళ్ళు?”..

                మా శ్రావ్యకి  మూడేళ్లు వచ్చాయండీ..అని చెప్పి.... హరిత కంగారుపడుతూ.. మళ్ళీ కలుద్దామండీ.... అని ఆదరా బాదరాగా బయలుదేరారు....

             ఆవిడని పంపించి వచ్చి మంగళ నా ప్రక్కన కూర్చొని ..ఆ..ఏంటి చెప్పు కబుర్లు....ఉండు తినడానికేమైనా తీసుకువస్తాను...అంటూ కిచెన్లోకి వెళ్లింది...

          అప్పటికే నా ఆలోచనలు చిన్న చిన్న పిల్లలు ...పాటలపోటీలు ..చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.........................

              .ఛానల్స్ లో చిన్న  పిల్లలు పాడటం..గెలవటం ఓడటం..ఇవన్నీ చూస్తునపుడు..ఇప్పటి జనరేషను పిల్లలు తమ బాల్యాన్ని పోగోట్టుకుంటున్నారనిపిస్తోంది..బండెడు పుస్తకాల బరువు ఒకవైపు..మరోవైపు ..ఒకరిని చూసి ఒకరు..... వారి పిల్లలు కూడా అలాగే కావాలని..వారి వయసుకి మించిన భారాన్ని వారిపై నెట్టేస్తున్న పెద్దలు......హాయిగా ఏ చీకూ చింతా లేకుండా ఆడుకోవాల్సిన వారిపై తలకు మించిన బారాన్ని మోపడం..తీరా అవకాశమొచ్చీ స్టేజి ఎక్కాక .మాస్ మసాలా పాటలు.. ప్రేమ పాటలు  పాడించటం....మసక మసక చీకట్లో ....లాంటి పాటలు వాళ్లచే పాడిస్తే ఎంత అసహ్యంగా, అసహజంగా వుంటుందో ఎందుకు తలితండ్రులకి అర్ధం కావట్లేదో!!!.....ఆ పసి మనసులకి ఆపాటల  అర్ధాలు ఏంతెలుస్తాయి?...... ఓడినపుడు వా ళ్ళు పడే  బాధ వర్ణనాతీతం.....

            ఎలిమినేషన్  సమయంలో ఆ చిన్ని హృదయాలు ఎంత వేదన అనుభవిస్తున్నాయో!.... ఇవన్నీ వారి వయసుని ఎంతగా ప్రబావితం చేస్తున్నాయి..డాన్స్ కాంపిటీషన్స్ కూడా ఇదే మూసలో  సాగుతున్నాయి..... చిన్నారి బాల్యాన్ని ,బారంగా మార్చి, ఏమార్చే, ..ఇలాంటి పోటీలవల్ల వచ్చే పేరు ,డబ్బుకి పెద్దలు ఆశించకుండా దయచేసి ..బాల్యాన్ని.... బాల్యంగా బతకనీయండి.....

                 అందమైనది..తిరిగి రానిది బాల్యం..ప్రతీవారి జీవితంలో ఓ మధుర స్మతిగా మిగలాలి గానీ ........అపశ్రుతి గా మారకూడదు...కాదంటారా????!!!!!!!!..

Thursday, April 18, 2013

శ్రీరామ నవమి.......



శ్రీరామ నవమి అనగానే ముందుగా గుర్తొచ్చేది ,..రామరసం...భెల్లం , ఏలకుల పొడి,మిరియాలపొడి వేసి కలిపిన పానకం..తీపి ఘాటు కలయికతో చక్కని రుచి వస్తుంది ..దీనిని నివేదన చేస్తారు...

                      పివరే రామరసం

                       రసమే పివరే రామరసం......

            భద్ద్రాచలం  లో ఎంత బాగా ఈ పండగ జరుగుతుందో..మా విజయనగరం జిల్లా రామతీర్ధం లో కూడా అంతే బాగా జరుపుతారు.. చాలా ఊర్లనుంచి ఈ పండగ చూడటానికి రామతీర్ధం వస్తారు...

            రాముడు సకల గుణాబి రాముడు..ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్నీ,..శ్రీరామ ఆదర్శం..

రామ రాజ్యం ఆదర్శ రాజ్యం...సర్వ జనులకు ఆదర్శ ప్రాయుడు, రాముడు...తలితండ్రుల మాటకు విలువిచ్చిన తనయుడు..సోదరప్రేమాతత్పరుడు,...గొప్ప స్నేహితుడు,,..జంతుజాలము పట్ల కూడా అపారమైన ప్రేమను చూపిన కరుణా సముద్రుడు...ఎన్నియుగాలు గడిచినా...రామ చరితం ఆ చంద్రతారార్కం ఆచరణీయం..అబినందనీయం...ఆరాధ్యనీయం....

                      రాయినైనా కాకపోతిని

                      రామ పాదము సోకగా

                       బోయనైనా కాకపోతిని

                      పుణ్యచరితము వ్రాయగా

                        కడలి గట్టున ఉడుతనైతే

                      బుడత సాయము చేయనా

                       కాలమెల్లా రామభద్రుని

                      వేలి గురుతులు మోయగా...

                        మనిషినై జన్మించినానే

                        మత్సరాలే నింపగా...............

      మదమత్సరాలే నింపగా

శ్రీరాముడిలాంటి ..ఆదర్శమూర్తులందరికీ    ....శైలూ సలామ్.......




దేశమా.....నవ్వెటు...?



                     ఎక్కడికెళుతోంది ..?దేశం ఏమైపోతోంది...?దిక్కులు దాటిన చక్కని సంస్కృతి..దిక్కూ,మొక్కూ లేని ప్రకృతి....

                పరాయిదేశంవారిని సైతం ..మురిపించిన మన జాతి సంస్కృతి ,పతమనవుతోంది..దీనికి లేదా నిష్కృతి..

                                “నడుమ బట్ట కడితే నగుబాటు

                          నాగరీకం ముదిరితే గ్రహపాటు..

                   అని ఓ పాత పాట వుంది..  అలా...నాగరికత పెరిగిన కొద్దీ ఉచ్ఛం,.. నీచం, మరచిన ప్రవర్తన ..విదేశాల సంస్కృతి దిగుమతి,..అంతకంతకూ వెర్రితలలు వేస్తున్న ఫ్యాషన్స్...పబ్ కల్చర్,...కట్టే బట్టలు కూడా బరువయిపోతున్నాయేమో...లోదుస్తులు పైన వేసుకుని తిరిగే సత్ సంప్రదాయం....ఆడయినా , మగయినా ,..ఈక్వల్ రైట్స్ కదా... అన్నింట్లో..  మరి మద్యంలో ఎందుకుండకూడదు..మజ్జిగ తాగినంత హాయిగా తాగే యడం వాగేయడం....

                     హై క్లాస్,..లో క్లాస్,..మిడిల్ క్లాస్,..ఏ క్లాసు చూసినా ...ఎంత చెట్టుకి,.అంతగాలి ..ఇదేనా అభివృధ్ధి...?విదేశస్తులు సైతం , మన కట్టు ,బొట్టుని , ముచ్చటపడి అనుకరిస్తుంటే,..మనమేమొ ,మన సంస్కృతిని మనమే దిగజార్చుకుంటున్నాం..ఇందులో తల్లితండ్రుల పాత్ర ఎంతవరకుంది..?పిల్లలని పట్టించుకోని తలితండ్రులదా...?వారి మాటలు వినని పిల్లలదా...?ఏమో.!

                      అమ్మాయిల అందం అతి కురచ బట్టలులోనే వుందా?...నిండుగా వున్న డ్రస్ లో  వుండదా?...నాగరికత అని దీనినే అంటారా...పచ్చని పల్లెసీమలని కూడా కలుషితం చేస్తోంది ఈ జాడ్జ్యం,

             ఇలాంటి..... అభివృధ్ధికర వాతావరణంలో ..అరాచకాలు, విధ్వంసాలు కాక ఇంకేమొస్తాయి...ఎంతో వున్నతమైన మన సంసృతి ,సంప్రదాయాలు, కట్టుబాట్లకి విలువనిచ్చి, ఆచరించే విధంగా పిల్లలని పెద్దలు సరిదిద్దాలి,...

                నాగరికంగా వుండడంలో తప్పులేదు... అనాగరికంగా ప్రవర్తించడం తప్పు...

                           

Friday, April 12, 2013

నేటి పండగలు.....



           లైప్ మెకానిజం అయిపోతోంది... కాదు..కాదు.. అయిపోయింది...ఒకప్పడు పండుగలొస్తే అందరూ ఒక చోట చేరి,...చాలా సందడిగా, అప్యాయంగా పిలిచే పిలుపులతో, ఛలోక్తులతో, ఆటలతో,...జీవం ఉట్టిపడుతూ పండగ వాతావరణం వుండేది,, కానీ ..ఇప్పుడో..“నామ్ కే వాస్తే చందాన వుంటున్నాయి...తలా ఒక చోట..జీవనం,ఎప్పుడో గానీ రాలేని జీవిత విధానాలు,....ఎవరు ఎవరికి ఏమవుతారో కూడా తెలియని రిలేషన్స్.. ఇలాంటపుడు .....కుటుంబాలమధ్య అభిమానం అప్యాయత,....ఆమడదూరం కాదా....ఫోన్లలో... విషెస్,.......వీడియోలో ఛాటింగ్,......స్వగృహ నుంచి తెచ్చిన స్వీట్స్, ఆకాశాన్ని అంటుతున్న ధరలు,...  అంతా..యాంత్రికం. .యాంత్రికం...ఆఖరికి..... పూజా సామగ్రి కూడా అందుబాటులో దొరకని పరిస్తితి....,.. ఈ ఉగాదినాడు చాలా చోట్ల సిటీస్ లో వేపపువ్వు ..గగన కుసుమం   అయిందిట...ఇంతకుముందయితే..ప్రతీ పండగలకి ,..బంధువులకి ,...స్నేహితులకి ,.... గ్రీటింగ్స్ కోసం షాపింగ్,..ఆ కార్డు లోపల,  అప్యాయంగా పిలిచే వరసలతో, వారినే చూసినట్లనిపించే  స్వదస్తూరి..పంపినవారికీ .....,అందుకున్నవారికీ ,.ఎనలేని ఆనందాన్నిచ్చే ఆ సరదాలు  ఏవీ....

                  ఇ మెయిల్స్.. ఫేస్బుక్ లో గ్రీటింగ్స్,..సెల్ఫోన్లో మెసేజస్,...మనిషి మేధస్సు పెరిగినకొద్దీ.. బంధాలు,..అనుబంధాలు వాల్ లో ఫ్రేమ్ లలో బిగించబడి పోతున్నాయి,.....అయితే ఒకటి మాత్రం ఒప్పుకోక తప్పదు,...ఈ టెక్నాలజీయే... లేకపోతే...మానవ సంబంధ, భాందవ్యాలు ఇంకా బలహీనపడిపోయేవేమో......కనీసం ఇలా అయినా చూస్తున్నందుకు  .... సంతోషించాలి...

             ఈ స్పీడు యుగంలో,.. ఎక్కడవున్నా,.ఇప్పటికీ...భారతీయ సాంప్రదాయాలకు , కుటుంబ కట్టుబాట్లకు,...విలువనిచ్చి,.. వీలున్నా,.. లేకున్నా,..వీలు కల్పించుకుని....స్నేహితులిని ,  రక్తసంబందీకులని,. ..బందువులని,,, అనుబంధాలతో అల్లుకుని, అలరించి, అప్యాయతలు పంచియిచ్చే.... అమృతమూర్తులందరికీ  ,......................శైలూ...సలామ్...................

Wednesday, April 10, 2013

ఏడాదికి ఆది...ఉగాది....



ఉగాది వచ్చింది...ఏడాదికి ఆదిగా వచ్చిందీ ఉగాది.

విరించి ఈ సృష్టిని ప్రారంబించిన రోజు ఉగాది అని నారద పురాణం చెబుతోంది.

అలుపెరుగని  కాలచక్రం ఒక ఆవృతం పూర్తిచేసినరోజు ఉగాది.

వేపపూల ఘుమఘుమలు,కొత్తబట్టల రెపరెపలు,పంచాంగశ్రవణాలు,మామిడితోరణాలు,...............

           ఏవత్సరమొస్తెనేమి..

           ఏమున్నది గర్వకారణం

           ఏవైపు తొంగిచూసినా ..

           ఏదో ఒక దానవకృత్యం....

                                     కనీసం....

                        విజయనామ వత్సరాన

                        విజయాలను ఆశిద్దాం

మత్సరాలు మాయనంతవరకు...ఏ వత్సరమైనా ...శాంతిహరణం...కాదంటారా...?



Tuesday, April 9, 2013

ఇదా మన భారతం

                                           దేశం పాడై పోయింది , సినిమా వాళ్ళకే సినిమా కష్టాలు, ఆత్మహత్యలు,కిడ్నేప్లు ,సర్వ సాధారణమైపోయాయి, ముఖానికి మేకప్ వేసుకున్నవాళ్లకే కాదు ,,ఆఖరికి ముక్కుమూసుకుని సర్వం త్యజించిన సర్వసంగపరిత్యాగులకు కూడా తప్పటంలేదు.,కారణాలు చిన్నవైనా పెద్దవైనా

                                         ఇవి మటుకు రొటీన్..

                                      దేముడు చేసిన మనుషుల్లారా

                                        మనుషులు చేసిన దేముళ్ళారా..

                                         వినండి దేముడి గోల

                                         కనండి మనుషుల లీల...

పగలూ ప్రతీకారాలు  ,పంతాలు, పట్టుదలలూ, ప్రేమలూ ,దోమలూ , ముక్కలూ ,చెక్కలూ,పక్కవాడిపై ఏడుపులు , ఇలా ఒకటేమిటి..ప్రతీ వాటికీ, ఆత్మహత్యలూ , కిడ్నాప్లు , నరమేధాలు, ఇదీ మన భారతం...

               మానవత్వం మచ్చుకైన కానక మన  శాంతికపోతం ఎక్కడికెగిరిందో..ఏమో...