Saturday, July 25, 2009

ఇదే " నా " భారతం ? ..!

"యత్ర నార్యంతు పూజ్యంతే '

ఎందుకులెండి ? మనం ఇంకోలా చెప్పుకుందాం "యత్ర నార్యంతు హింసతే " అక్కడ చరించేది మటుకు దానవులే, మానవ రూపం లో కనిపించే దానవులు . నాకో పాట గుర్తొస్తోంది ,
" ఎక్కడి కెళుతోంది దేశం ఏమై పోతోంది "

ఎప్పుడో ద్వాపర యుగంలో వస్త్రాపహరణ గురించి చదువుకున్నాం , అదీ రెండు సమయాల్లో అనుకుంటాను , కృష్ణుడు గోపికల వస్త్రాలు చిన్నప్పుడు సరదాగా దాచి వారిని అల్లరి పెట్టటం , నిండు సభలో ద్రౌపదిని వలువలు విప్పి కౌరవులు అవమానించటం , అప్పుడు ద్రౌపది మానసంరక్షనకు గోవిందుడు వున్నాడు , మరి ఇది కలియుగం , ఇప్పుడు మానసంభక్షకులే గాని ,మాన సంరక్షకులు ఏరి ? నలుగురిలో నడిరోడ్డుమీద ఒక నారి కి అవమానం , ఇంతకన్నా హేయమైన స్తితి వుంటుందా ? భారత భారతి ఎన్నిసార్లు తన సంతతిని చూసి సిగ్గుతో తలదించుకుని ఎడ్త్చిందో కదా ?
ప్రతీ మనిషి మహనీయులు కానవసరం లేదు , మానవత్వాన్ని మరిచిపోకూడదు , పాసవికమైన ఆనందం కోసం , పరమ నీచానికి దిగకూడదు , 'కలకంటి కంట కన్నీరు ఒలికితే ' ఇల విలవిల లాడి, సజీవ జల సమాధి అవుతుంది , కాదు కాదు ,ఇప్పటికే అవుతోంది , ఒక చిన్న మంచి పని, ఒక నిజం, ఒక చిన్న సహాయం , చేయటంలో వున్న
ఆనందం ,ఇంకెదులోను దొరకదు , మనం మనుషులం , పసువులం కాదు , అవి కూడా ఇలా ప్రవర్తించవనుకుంట,

" గడ్డి మేసి ఆవు పాలిస్తుంది
పాలు త్రాగి మనిషి విషమవుతాడు
అది గడ్డి గొప్ప తనమా ?
ఇది పాల దోష గుణమా ?
లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మ "

అన్నారు ఒక కవి ,గడ్డే తింటే పోలా ..

1 comment:

  1. మీ బ్లాగ్ ని ప్లానెట్ లో చేర్చాను. ప్రొఫైల్ లో మీది విజయనగరం అని వ్రాసారు. మేముండేది శ్రీకాకుళంలో. మా అమ్మగారు ఇంటర్మీడియేట్ చదువుకున్నది కూడా విజయనగరం కాలేజిలోనే. మీరన్నట్టు విజయనగరం ఒకప్పుడు విద్యలనగరమే. ఒకప్పుడు మా జిల్లాలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు లేకపోతే మా మామయ్యని కూడా విజయనగరం క్రిస్టియన్ స్కూల్ లో వేశారు.

    ReplyDelete