Wednesday, July 8, 2009

జ్ఞాపకాలు

అమ్మ .. ఎంత కమ్మనిది మాట సందర్భం లో గజల్ శ్రీనివాస్ గారు ఆలపించిన గజల్ గురుతొస్తోంది,
" ఒక్కసారి నన్ను తిట్టి ఎన్ని రోజులు ఏడిచింది
ఒక్కసారి నన్ను కొట్టి రోజంతా పస్తుంది,
అది అమ్మే కదా .. జీవనదే కదా ..
నిజం కదండీ ,.. ఎంత దుర్మార్గులైన పిల్లలైనా , కడుపులో పెట్టి కాపడుకునేది అమ్మ ఒక్కతే .. అలాంటి తల్లిని నులకమంచం ఇచ్చి నడివీధిన వదిలేసాడు ప్రభుద్దుడు .. ఇలాంటి వారిని ఏమనాలి ...ఇలాంటి సంఘటనలు ఎన్నో...తల్లితండ్రులు పిల్లలకి చ్చేది మంచి జీవితాన్ని , మననుండి వారు ఆశించేది కాస్త ప్రేమని .. పెద్దవయసులో వారు పసిపిల్లలతో సమానం , స్థితి లో వారిని కష్టపెట్టకుండా చూడటం మన కనీస ధర్మం .. ఏమంటారు ?..
కవి కలం నుండి జాలు వారిన చినుకులో తెలియదు కాని , నన్ను కదిలించిన చినుకులలో మీరు కూడా తడవాలని రాస్తున్నా..

" అమ్మంటే ఎవరో తెలుసా ..
జన్మంటే ఏమో తెలుసా ..
నేలమీద ఉదయించిన దేవతరా అమ్మ ,
కన్నీళ్ళు , చనుబాలు కలబోస్తే జన్మ . '
అందమైన మా వూరు, ఎన్నో జ్ఞాపకాల సెలయేరు , శలవలకి ఇంటికి వచ్చే నా కోసం గడపలోనే ఎదురు చూసే అమ్మ ,
వస్తున్దిలేవే , చూసి చూసి , మెడ నొప్పెడుతుంది రా , అనే నాన్న , తిరిగి వెళుతున్నపుడు అమ్మ కళ్ళలో కదలాడే సన్నటి నీటిపొర , ఇప్పటికీ నాకు గుర్తే .. నేనే కాదు చదువుల నిమిత్తం ఎందరో పిల్లలు , వారి కన్నవారు పడే అవస్త ఇదే .కాని ప్రేమ పేరుతొ సునాయాసంగా వారి జీవితాలికి వారే చరమ గీతం పాడుకుని , కన్నవారి గుండెల్లో ఆరని చిచ్చు రగిలిస్తున్నారు నేడు చాలా మంది .ఇది ఎంతవరకు సమంజసమో ? వారు ఆలోచించటం లేదు ప్రేమలో వున్నవారు ఒక రకమైన వున్మాదస్తితి లో వుంటారు ..ప్రేమ వికటిస్తే జీవితం సరి అన్నభావనలో వరం లాగదొరికిన జీవితాన్ని శాపంగా చేసుకుంటున్నారు .. సమస్య వచ్చినపుడు దానిని కాలానికే వదిలేస్తే , కొన్నాళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే ,,,నేనేనా ? అంత పిచ్చిగా ఆలోచించినది అని భావిస్తారు .. ఇది నిజం ..కాలానికా శక్తి వుండిమరణిస్తే మరల పుడతామో లేదో తెలీదు .. నిధి లా దొరికిన జీవితాన్ని పెన్నిధి లా చూసుకోవాలి , మన జీవితం మన ఇష్టం ,అనుకుంటాము ,, కానీ మన జీవితం మీద మనకి హక్కు వుందంటారా .. వుంటే .. అది అమ్మకి నాన్నకి మాత్రమే వుంటుంది , ఎందుకంటె అది వారు పెట్టిన భిక్ష అందుకే అందమైన అనుభందాల మధ్య అవరోధాలని ఆనందంగా స్వీకరించి , జీవితాన్ని మధ్యలోనే త్రుంచకుండా ..పూర్తిగా గడపగలగాలి .. నిజమే కదా ...

No comments:

Post a Comment