' అటు చుస్తే సేమ్యా ఇడ్లీ
ఇటు చుస్తే బాదాం పూరి
ఏట కేగుటో తెలియనిదొక విద్యార్ధికి .. అన్నారు శ్రీ శ్రీ , ప్రతీ మనిషీ ఎప్పుడు విద్యర్దే , అన్నింటిలోను ఈ ఎంచుకునే సమస్యవస్తూనే వుంటుంది . అలాగే ఇప్పుడు వచ్చిన హాట్ టాపిక్ , అటు శాస్త్రమా ?ఇటు చుస్తే బాదాం పూరి
ఇటు ఆధ్యత్మికమా ? .. వీటి గురించి మాట్లాడెటంత అనుభవం ఆలోచన నాకు లేకున్నా , ఆసక్తి చాలా వుంది, వీటిపైఅవగాహన ,వున్నవారెవరైనా ఇంకొన్ని విషయాలు తెలియపరుస్తారేమోనని జిజ్ఞాస .. రెండువేల పన్నెండు మే ఇరవైఒకటవ తేదీకి ప్రపంచ ప్రళయం అని టీవీ లో హొరెత్తుతు మరీ చెప్తున్నారు , ఒకవపు గ్లోబల్ వార్మింగ్ , మరో వైపు వచ్చేమూడు నెలల కాలంలో మూడు గ్రహణాలు వలన ఏవో ఆపదలు సంభవిస్తాయని , పదే, పదే చెపుతున్నారు ,ఇవీచాలవన్నట్లు గ్రహాంతర వాసులు ఎప్పుడైనా మీ ముందుకు రావచ్చు , అని మనిషిలో భయాన్ని తట్టి లేపుతున్నారు ,
మొన్నే వెళ్ళిన బిగ్ బ్యాంగ్ భయాన్నుండి జనం కోలుకోకముందే మళ్ళిఇవేమిటి ? బిగ్ బ్యాంగ్ భయం వలన హార్ట్ ఎటాక్కి గురి ఐన వారు వున్నారు , ఈ ప్రకృతి పరిణామాలు వస్తాయో రాదో తెలీదు గానీ ,సున్నిత మనస్కులకి ఈరకమైన వార్తలే స్కయ్లాబ్ వచ్చి ఢీ కొన్నంత మానసిక ఆందోళనకు గురిచేస్తున్నై , రానున్నది రాకమానదు , కానున్నది కాకపోదు ,కాలాన్ని మనం నియంత్రించలేమన్నది వాస్తవం ,కాదంటారా ? ప్రకృతిని మన కనుకూలంగామార్చుకుంటూ, మన వినాశనానికి మనమే పునాది తీసుకుంటున్నాం ,
" గ్రహదారుల నదిగమించి
ఘన తారల పదమునుంచి
గగనాంతర రోదశిలో
ఘంధర్వ గోళ గతుల దాటి
చంద్రలోకమైనా , దేవెంద్రలోకమైనా
బొందితో జయించి, మరల
భువికి తిరిగి రాగలిగే "
మానవుడి ఈ మేధా శక్తి , దేనికి దారి తీస్తుంది ? విజయానికా ? లేక .... ఘన తారల పదమునుంచి
గగనాంతర రోదశిలో
ఘంధర్వ గోళ గతుల దాటి
చంద్రలోకమైనా , దేవెంద్రలోకమైనా
బొందితో జయించి, మరల
భువికి తిరిగి రాగలిగే "
No comments:
Post a Comment