Saturday, July 11, 2009

మంచి మనిషికి అభినందనం

" మానవత్వం పరిమళించే మంచి మనిషికి వందనం
బ్రతుకు అర్ధం తెలియజేసిన మంచి మనసుకు అభివందనం "

ఈ బ్లాగు చదివే చదువరులతో నేను విన్న ,చూసిన , ఒక అనుభూతి వెంటనే పంచుకోవాలని మళ్లే ఈ రోజే రెండవపోస్టింగ్ కూడా చేస్తున్నా, మంచి పనులు చేయాలంటే సంచి నిడుగా డబ్బే వుండనవసరం లేదని మరోమారు రుజువైందిఇప్పుడే చానల్స్ అన్నీ తిప్పుతూ చూస్తున్న నాకు , సాక్షి ఛానల్ వారి సాక్షి సలాం ప్రోగ్రాం కనిపించింది , సాక్షి ఎడిటర్ రామ్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు ,ఆసక్తి గాఅనిపించి చూసాను , ఒక మామూలు కామన్ మాన్ సమాజానికి తన వంతు సేవ చేయాలన్న తపనతో , తనసంపాదనలో కొంత వెచ్చించి అన్నం ,రొట్టెలు ,మజ్జిగ వంటివి అన్నార్తులకి అందేటట్లు , అంతేకాక రోడ్ల పైన ప్రమాదకరంగా వున్నా గోతులని పూడ్చడం , ఇంకా చడువురానివారి దగ్గరకి వెళ్లి తనకు తెలిసిన చేతిపనులు, నేర్పి వారిచే షాప్స్పెట్టించి వారు ఆర్ధికంగా నిలదోక్కుకోనేట్లు చేయడం , ఇలాంటివే మంచిపనులు తన పరిధిని మించి , చేయడం , తను ఏకట్నం తీసుకోకుండా ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకుని , తనతో కలిసి కొన్ని ఏళ్ళుగా ఇద్దరూ కలిసీ ఏ మెప్పు ఏ ప్రతిఫలంఆశించకుండా , తాము చేస్తున్నట్లు ఎవ్వరికే తెలియకుండా ఇన్ని ఏళ్ళుగా ఈ సేవా కార్యక్రమాల్లో గడపడంఅభినందనీయం ,పైగా వారికీ ముగ్గురు ఆడపిల్లలు ,ఆ ముగ్గురినీ ,వుచిత విద్యను అందించే టీచర్ గా , వుచిత వైద్యంచేసే డాక్టర్ గా ,వుచిత న్నాయం అందించే లాయర్ గా వారిని సంసిద్దులని చేస్తూ ,తనలాగే వారు కూడా సమాజసేవచేయాలని , వారు తమ సంపాదనలో సగం సేవ కోసమే వినియోగించాలని చెప్పడం,వారి షాప్ కట్టగానే అటునుండి అటే,ప్రమాదకర గోతులు వున్నా చోటికి వెళ్లి అవి పూడ్చి ,అలాగే ఈ అన్నదాన కార్యక్రమాలు చేసి , వాళ్ళ రోజువారీ పనుల్లో వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ,ఆకలితో యెవరూ అలమటిస్తూ వుండకూడదని ,ప్రతీ వారు కనీసం తమ ఇంటిముందైనా నాలుగు రొట్టెలు మజ్జిగ కొంత అన్నం తో కొంతమంది ఆకలైనా తీరిస్తే అంతే చాలని అన్నారు , నిజమే కదా..
ఆ మంచిమనసుకి నాకు తెలియకుండానే నా కళ్లు కన్నీళ్ళ వర్షంతో ,తమ హర్షాన్ని పరోక్షం గా తెలియజేసాయి .
దైవం మానవ రూపం లో వుంటాడని అంటారు .. ఇదేనేమో ? .. అలాంటి మంచి మనసులకి వందనం ..
, ,

1 comment:

  1. సాక్షి చానెల్ లో ఆ ప్రోగ్రాం నేనూ చూసాను.. చాలా బాగుంది..

    ReplyDelete