Saturday, September 7, 2013

శంకరాభరణం; సమస్యా పూరణ ; ( సర్వదా చింతయే గాదె సంతు వలన)

శ్రీ కంది శంకరయ్య గురువుగారి చలువ వలన ప్రధమ ప్రయత్నంగా ఈ రోజు 



పూరణ సీసపద్యంతో పూర్తి చేసాను...



తల్లి యొడిని దూరి తారాటలాడిన
....
పసిపిల్లలనుగని బరవశించు
ఉగ్గుపాలను పోసి ఉన్నతిని కాంక్షించి
....
తెలుగుపలుకుతెల్పితీర్చిదిద్దు
పస్తులున్ననుగానిపలుకష్టములురాని
....
పెంచిబెద్దగజేయుపేదయైన
కంటికిరెప్పగ కాచిరక్షించుచు
....
కాలమ్మువారికే ఖర్చుజేయు


ఎన్ని చేసిన తల్లుల కేమి ఫలము
ఎదురుమాటలచేతల ఎదను కోయు
పేరునిల్పరుసరికదావేరుచేయు
సర్వదా చింతయేగాదెసంతువలన…….

2 comments:

  1. ఎంత చక్కగా వ్రాశావు శైలజ .

    ReplyDelete
    Replies
    1. పద్యం మిమ్ములను అలరించినందులకు నెనర్లు..

      Delete