Wednesday, September 4, 2013

పద్యం....పూరణ...


సవరించిన శ్రీ శంకరయ్యగురువుగారికి,శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతలతో...  

పద్యరచన ..అంశము.....బావ...

అక్కకుమగడగుబావన్
చక్కనిజోడగు వరుసకు చెల్లి మగడగున్
హక్కుగను మేనమామకు
నక్కడ సుతుడగును బావ నలుగురు మెచ్చన్


హితుడుగ నిలుచును తనస్నే
హితుడుగ నలరించు నెపుడు హితవచనములన్
సతతము సన్నిహితుడగున్
జతగా బావని పిలుచుచు జగడములాడున్

పద్యరచన ..అంశము...రూపాయి...

మాధవుండైన మహిని మనుజులైన
పచ్చనోట్లకు అహరహం పరితపించు
పరమపావన రూపమై పరిఢవిల్లు 
ఇచ్చురూపాయిలేకదా ఇహముపరము
పూరణ....శూలి తనయగంగసోదరియుమ....
వావి వరుస నడుమ వర్ణనలువినుడి
బావగారునయ్యెభవుడు నేడు
బ్లాగు జూడవచ్చెబ్రహ్మహరిబావ
శూలితనయగంగసోదరియుమ

పూరణ......పాదమ్ములులేని నరుడు పరుగిడ జొచ్చెన్
*శోధన చేయగచాలును
సాధింతురుపనులనిలనుశ్రమతోనయినన్
పాదముజైపూరివితొడిగి
పాదమ్ములులేనినరుడుపరుగిడజొచ్చెన్

నాదే గెలుపని తలచెను
గాదే యుత్తరుడు రిపులగని భీతిల్లెన్
దా దిగె నరదము నో యధి
పా! దమ్ములు లేని నరుడు పరుగిడ జొచ్చెన్


పద్యరచన...అంశము..దానిమ్మపండు..

ఎంత మంచిది దానిమ్మ ఎఱ్ఱనుండు
తినగతినగగారూపము తీరునుండు
పుష్కలముగవిటమినులుపూర్తిగుండు


దివ్య మయినట్టి మందిది తినగ రండు


పద్యరచన...అంశము..తెలుగు పద్యము...

తెలుగున పద్యము తీయన
మిలమిలమని మెరయునెపుడు మిన్నునతారన్
పలికిన పదముల భావము
సులువుగధారణ పరుగిడి సురుచిరమునగున్

తేనెకన్న తీపి తెలుగుభాషమనది
పాలధారవోలె పద్యముండు
భావనిధులువేడి భారతీదేవికి
ఆటవెలదితోడ ఆర్ఘ్యమిత్తు

పూరణ......భాగ్యనగరము కాదు హైదరాబాదు....

భాగమతిపేరవెలసిన భాగ్యసీమ
భావ రంజితసత్కళాభాసురమ్ము
భాగ్యనగరముహైదరాబాదు!కాదు!
కాదనియన్నపాడియా!కనులజూడ


పద్యరచన...ఆకాశవాణి...

అకట! ఆకాశవాణియెనంతరించె
కొత్త పోకడరూపమై కోరిపిలిచె
మంచిమాటలు పాటలు మాయమయ్యె
మిర్చిరేడియోగోలలు మింటికెగసె

2 comments:

  1. ఈ నడుమ కనుపించుట లేదు , ఏమైందా అనుకున్నాను . ఇపుడే అర్ధమైంది . అన్ని పద్యాలను ఏకధాటిగా ఒక్క టపాలోనే పెట్టి నాకు శ్రమ తగ్గించావు , నీకు కమెంట్లను కూడా తగ్గించుకొన్నావు . అర్ధం చేసుకున్నావు కదూ ! బాగున్నాయి .

    ReplyDelete
  2. చాలా ధన్యవాదములు..

    ReplyDelete