Saturday, August 17, 2013

శంకరాభరణం

శంకరాభరణం భ్లాగులో నేను వ్రాసిన పద్యములు ,పూరణలు,..వీటిని సవరించి ఎంతో ప్రోత్సాహాన్ని,కల్గిస్తున్నశ్రీ శంకరయ్య గురువుగారికి,శ్రీ పండిత నేమాని గురువుగారికి,కృతజ్ఞతాభివందనములు..

అలాగే..చందస్సు వివరాలు తెలియజేస్తూ, నన్నెంతో ప్రోత్సహిస్తూ,తమ సహాయ ,సహకారాలందిస్తున్న, సాహితీ మిత్రులు, శ్రీ వరప్రసాద్ గారికి, శ్రీ మధుసూదన్ గారికి ధన్యవాదములు...



ఇంత  అద్భుతంగా ఫొటో తీసిన పరుచూరి వంశీగారికి అభినందలు....

 


పద్యరచన...అంశము...పిడికిట సూర్యుడు.....

దుఢుకుగ పండని భానుని
వడిగా మ్రింగగ నెగసెను వాయు సుతుండున్
పిడికిట సూర్యుని బట్టగ
గడుసుగ చిత్రముగ తీయు ఘను డీ నరుడున్






పద్యరచన అంశము........గురుభోధన......



గురుని యొద్ద విద్య కుదురుగ నేర్చిన


జయము లొదవు చుండు జగతి యందు


గురియె గలుగు గాన గురు బోధనములందు

మార్గదర్శకుడగు మంచి గురువు

పద్యరచన...అంశము......స్వాతంత్యదినోత్సవము..


స్వాగతించె జగతి స్వాతంత్ర్య దివసమున్ 

స్వార్థ చలిత సంఘ సమరమందు

నింపి శాంతి పూలు నిలుప సమైక్యత


గల పతాక ఎగురగలుగు నెపుడొ?

సమస్యా పూరణ......స్వాతంత్యఫలమ్ము దక్కు స్వార్ధపరులకే...

స్వాతంత్ర్య దినోత్సవమున
                                                      
వాతలు వచ్చును! మనుజుల వ్రాఁత తొలఁగునే?


నేతల వ్రాఁతలె వేఱగు;


స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు స్వార్థపరులకే!

3 comments:

  1. ప్రముఖుల ప్రోత్సాహమే ఈ పురోగతి అని భావిస్తున్నా . చాలా బాగున్నాయి . ఇంకా బాగా పురోగతి సాదించాలని అభిలషిస్తున్నా .

    ReplyDelete
    Replies
    1. నిజం సర్.. చాలా కృతజ్ఞతలు...

      Delete
  2. నేను తీసిన ఫోటో నచ్చినందుకు మరియు చక్కటి పద్యం అందించినందుకు ధన్యవాదములు శైలజ గారు ...నేను రోజూ మీరు రాసే పద్యాలు చదువుతూ ఉంటాను.మంచి పద్యాలు రాస్తున్నందుకు అభినందనలు ధన్యవాదములు ..మీ బ్లాగు బాగున్నది

    ReplyDelete