Friday, July 10, 2009

పేపర్ పాపాయి


" ఎగరేసిన గాలిపటాలు దొంగాటల దాగుడు మూతలు
చిన్నప్పటి జ్ఞాపకాలు చిగురించిన మందారాలు
గోలీలు , గోటిబిళ్ళ , ఓడిపోతే పెట్టిన డిల్ల
చిన్నప్పటి ఆనవాళ్ళు , కాలం లో మైలురాళ్ళు"
ఈ పాట స్నేహం అనే సినిమాలోనిదనుకుంటాను , పాడినవారు జైసుదాసు గారు అని గుర్తు , ఏది ఏమైనా ,నాకు చాలాఇష్టమైన పాటల్లో ఇది కూడా ఒకటి , నిజంగానే చిన్ననాటి గురుతులు , మనసుమీద పడిన ముద్రలు , మరిచిపోలేనివి, నా చిన్నతనం లో ' పేపర్ పాపాయి ' అనే పుస్తకం చదివాను , ఒకసారికాదుఅనేకసార్లు , ఆ కదా మీకు క్లుప్తం గా చెబుతాను .. ఒక చిన్న బాబు ఒక పుస్తకం చదువుతూ ,అందులో ఒక పిల్లాడి కటింగు , దానికిందన వున్న విషయం చదువుతాడు , అదేమిటంటే ' ఈ కటింగు కట్ చేసి చేతితో పట్ట్టుకుని దిగువనవున్న మంత్రాన్ని జపిస్తే , ఆ పేపర్ కటింగుకి ప్రాణం వచ్చి ఎగురుతుంది అని వుంటుంది , అది చదివిన ఆ బాబు ఆ విధంగానే చేసి మంత్రం చదివేసరికి ఆ పేపర్ పాపాయి కి జీవం వచ్చి ఎగురుతూ ,ప్రపంచమంతా పర్యటించి, ఒకొక్క ప్రాంతంలో కొన్ని రోజులు వుంటూ ,అక్కడి వారితో స్నేహం చేసి వారి జీవనవిధానం , ఆ దేశపు వింతలు ,అన్నీకళ్ళకు కట్టినట్లు మనకు చెపుతూ ,అలాప్రపంచమంతా తిరిగి,చివరకి హిమాలయాల మీద నివాసం వుంటాడు , ఆ పుస్తకం చదువుతుంటే మనమే ప్రపంచమంతా తిరుగుతున్న బ్రాంతికి లోనవుతాం , అది తెలుగు అనువాదం ,నిజంగా నాకెంత నచ్చిందంటే , ఎన్నోసార్లు నేను కూడా పేపర్లలో కటింగులు కట్ చేసి ఆ మంత్రాన్ని చదివి గాలిలోకి వదిలేదాన్ని , చిన్నతనంలోనే పిల్లలకి ప్రపంచంలోని దేశాలు ,వాటి పేర్లు ,ఆ ప్రాంతపు జీవన స్థితిగతులు, బాషలు , ఆ దేశాల స్థానిక జంతుజాలం , ఇలా అన్నీ ఆ పేపర్ పాపాయి కధ ద్వారా చెప్పిన ఆ రచయిత కి హాట్సాఫ్.. చిన్నప్పుడు నాపై ప్రగాఢ ముద్ర వేసిన ఆ పుస్తకాన్ని మిస్ చేసుకున్నాఇప్పటికీవెతుకుతూనే వుంటా ..ప్రతీవారు చదవదగ్గ పుస్తకం పేపర్ పాపాయి .. మీలో ఎవరికైనా అది దొరికితే నాకు చేఉతారు కదూ ..

3 comments:

  1. sailaja gaaru mee blog chuusaanu chaalaa bagumdi. meeru raasina paper paapaayi pustakam author evaru?? publishers evaru?? telupagalaru.
    sailajaangara

    ReplyDelete
  2. ఈ పుస్తకం ఇప్పుడు మంచిపుస్తకం వారు తిరిగి పబ్లిష్ చేసారు. మార్కెట్లో దొరుకుతుంది.

    ReplyDelete
    Replies
    1. నమస్తే మురళిగారు..
      నా బ్లాగుని చూసినందుకు ధన్యవాదాలు..పేపర్ పాపాయి బుక్ దొరుకుతోందని అన్నారు..చాలా సంతోషించాను..ఎక్కడ దెరుకుతున్నాయో మీకు తెలిస్తే నాకు తెలియచేయ ప్రార్ధన..

      Delete