చిత్రము
తరళము...
కురియు చుండగ వర్షధారలు కూతవేయగ బండియే
పరుగు తీసిరి వేగిరమ్ముగ బాటసారులు నెక్కగన్
తరువు నీడకు బోవుచుండిరి తన్విలిర్వురు జల్లులో
వరుస బెట్టెల జూచుచుండిరి పజ్జకైమరి గొందరు
న్నరయ చిత్రము వాస్తవమ్ముగ నందగించుచు నున్నదే
పరిఢవిల్లగ బొమ్మగీసిన వర్ణి కుంచెకు
ప్రాంజలుల్ .. !!!
No comments:
Post a Comment