Friday, June 14, 2013

మార్పు...The Change..

      



 మార్పు దేనికైనా సహజం.అని తెలిసినా కూడా స్పందించుట హృదయ లక్షణం..కాల మాయాజాలంలో కనుమరుగవుతున్నవి ఎన్నో..
        కనుమరుగై చాలా కాలమైనా ....కొత్తగా ..దాని సేవలను  అసాంతం ఆపేస్తున్నారు పోస్టల్ శాఖవారు...పోస్టుకార్డు ఎప్పుడో పోయింది....ఇదుగో ఇక ఇప్పుడు టెలిగ్రామ్ కూడా... ఎన్వలప్ పొట్టిదల్లా ..పొడుగయింది....
      ఆధునిక విజ్ఞానం అవుపోశన పట్టడంలో ..కొన్నిటికి తిలోదకాలు...తప్పవుమరి... 
     విజ్ఞానం అంటే గుర్తొచ్చింది...         ........
       అంగారక గ్రహంలోకే గృహప్రవేశం చేసేందుకు , తండోపతండాలుగా  సిధ్దమయ్యారుట...   మానవ మేధస్సు ..ఎన్ని అధ్బుతాలనైనా సృష్ఠించగలదు..బ్రహ్మసృష్టిని ,విశ్వామిత్రసృష్టిని మించిన సృష్టిని మానవుడు రాబోయే తరాలలో నిర్మిస్తాడని ఈ మధ్యనే ఓ బుక్ లో చదివాను..
      పెరుగుట విరుగుటకొరకే  అన్న సామెతలా ..విజ్ఞానం పెరుగుతున్నకొద్దీ...మనుషులు అజ్ఞానులవుతున్నారేమో...
                  విలువలకే వలువలు ఊడ్చే కాలం వచ్చేనా......
                  మానవులే దానవులయ్యే తరుణం ఇదియేనా...
                 వంచనకే తలవంచిన మంచి కంచికి చేరేనా
                 కంచే చేనుని మేసే కలికాలం మనదేనా.....
                
         


3 comments:

  1. బాగాచెప్పారు....ఏదైనా అతి ఏదీ పనికిరాదు

    ReplyDelete
  2. ఖంగారు పడకండి ,

    మీరు వ్రాసినవన్నీ ఇంతకు ముందే వచ్చాయి కాని , కలికాలం అంతం మాత్రం అపుడే కాదు సుమా !
    ఈ ప్రపంచంలో మార్పు మాత్రం శాశ్వతం ఆ పంచభూతాలతోటి , ఇది ( మార్పు ) ఆకారం లేని ఆరవ భూతం . ఈంకా కొన్ని కోట్ల సంవత్సరాలు పడ్తుంది .

    ReplyDelete
  3. ఖనిజాల్లాంటి నిజాలు , కళ్ళముందు కనపడ్తున్న నగ్న సత్యాలు ఇవి . ఆ కాలం రావటానికి ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు పడ్తుంది .
    పంచభూతాలు అనబడే వాటితో పాటు ఆరవ భూతం ఆకారమే లేని మార్పు . ఇవే
    ఈ ప్రపంచంలో శాశ్వతమైనవి . ఖంగారు పడవలసిన పని మనకు కాదు .

    ReplyDelete