Friday, May 17, 2013

నన్ను కదిలించిన ...నండూరి ఎంకి....






నాటి కాలమునందు నండూరి కలమందు

నాట్యాలు చేసింది నాయుడోరి ఎంకి

నేడేమొ, ఈడేమొ, నాదు భావమునందు

కవితయై నిలిచింది కావ్యనాయకి ఎంకి

కాలాల ఎనకాల నిలచినా ఆ ఎంకి

కమనీయరూపమై కనుల కనిపిస్తాది

కనిపించి ,మురిపించి ,ఎదను రగిలించి

పదములల్లిస్తాది, పాటరాయిస్తాది

రాసినా ఆపాట నోటపలుకంగ

మురిసిపోతుంటాది, మెరిసిపోతాది

మురిసినా ఎంకి మోము చూడాలని

ఆశతో నే కనులు తెరచిచూడంగ

కలలాగ తానేమొ కరిగిపోతాది

కమనీయగాధగా మిగిలిపోతాది

పొద్దుపొడుపులోన ముద్దరాలకుమల్లె

పదమల్లెవచ్చింది,వరదంటి,ఎంకి

2 comments:

  1. ఎంకి పల్లెపిల్లే కాదు పాటల పిల్లే అని మళ్ళీ చెప్పారు . nice .

    ReplyDelete
  2. శైలజగారూ! నండూరి వారు మిమ్మల్ని ఆవహించారా?
    మీ పాట చదవంగానే నాకూ యెంకి మీద ఓ పాట రాసేయాలనిపిస్తోంది.
    కానీ, మాటలు అంత అందంగా రావే.......

    ReplyDelete