పకోడి |
కరకర లాడుచు
కమ్మగ
కరముల నందముగ
నమరి కన్నుల బడుచో
హరుడైన
కరగిపోవును
మరచుచు
నిజతత్త్వము కద మంచి పకోడీ!
చిరు చిరు
జల్లులు చినుకులు
కురియు నెడల
నెదుట నీవు ఘుమ్మనుచుండన్
నరులయినను
సురలయినను
నురకలనే
వేయరొక్కొ? యుల్లిపకోడీ!
పరిమళమిడెడు పకోడీ !
వరముగ దలతురు నిను దిన వదలరె యెవరున్
సరియగు నుల్లిని చేర్చిన
కరిగెదవే నోటిలోన కమ్మని రుచితో!!!
ఎందుకు పిజ్జా
బర్గరు
లెందుకు నూడుల్సు
నీవె యెదురగు నెడ నీ
ముందెల్ల
తీసికట్టే
విందగుదువు
నీవెకాదె? వేడి పకోడీ!
No comments:
Post a Comment