శంకరాభరమంలో గురువుగారు ఇచ్చినది..
“సిరిగలవానికిఁ జెల్లును
దరుణులఁ బదియారువేలఁ దగఁ బెండ్లాడన్,
దిరిపెమున కిద్దరాండ్రా?
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.
ఈ శ్రీనాథుని చాటువును అన్యచ్ఛందంలో చెప్పండి.
నాపద్యము...
సిరి మగనికి
జెల్లు తరుణులు పదిహారు
వేలమంది, యాది భిక్షువయిన
ఇందుమౌళి !నీకు
యిరువురు సతులేల?
గంగను విడు మాకు
గౌరి చాలు!!!