Monday, February 22, 2016

కనియెన్ రాముడు....



“కనియెన్ రాముడు...”


ఇది పద్య ప్రారంభం....దీనిని కొసాగిస్తు పద్యం వ్రాయండి...






కనియెన్ రాముడు వనముల

వనితయెశాపమ్మువలన పడుకుగ మారన్

తనపాదము దగిలించుచు

మునిభార్య నహల్య కపుడు ముక్తినొసంగెన్!!

సిరిగలవానికి జెల్లు...అన్యచ్ఛందంలో..

శంకరాభరమంలో గురువుగారు ఇచ్చినది..


సిరిగలవానికిఁ జెల్లును

దరుణులఁ బదియారువేలఁ దగఁ బెండ్లాడన్,

దిరిపెమున కిద్దరాండ్రా?

పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.

ఈ శ్రీనాథుని చాటువును అన్యచ్ఛందంలో చెప్పండి.


నాపద్యము...




సిరి మగనికి జెల్లు తరుణులు పదిహారు
వేలమంది, యాది భిక్షువయిన
ఇందుమౌళి !నీకు యిరువురు సతులేల?
గంగను విడు మాకు గౌరి చాలు!!!




Saturday, February 20, 2016

జనగణమనోధినాయక......

“జనగణమనోధినాయక....”


ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.




జనగణమనోధినాయక

యని బాడుచు భరతదేశ యశమును చాటన్

జనవరి ఇరువది యారున


మనజెండానెగురవేయు మహిలో జనులే!!!

Friday, February 19, 2016

కాఫీ...(శంకరాభరణం)

                                                                        కాఫీ



నురగలు గ్రక్కెడు కాపీ
సురుచిరమగు నిన్ను త్రాగు చుందుము నహమున్
హరిహరులిది చవి జూసిన
మరి వదలరు మాకు నిన్ను మధురపు కాఫీ!!!



కాఫీ త్రాగిన చాలును
సాఫీగా సాగు దినము సందియ మేలా?
హేఫీగా నతిధులకున్
కాఫీనందింతు రిండ్ల కాంతామణులే!!!



కాఫీ త్రాగగ నుదయము
సాఫీగా జరుగు పనులు జర లేటైనన్
దాపురమగు తలనొప్పియె
మాపాలిట రక్ష నీవె మధురపు కాఫీ!!!


ఎప్పుడు బడలిక గల్గిన
కప్పుడు కాఫీని త్రాగి కడు వేడుకతో
చప్పున పనులను జేయుచు
విప్పుగ నిను మెచ్చుచుంద్రు ఫిల్టరు కాఫీ!!!


Thursday, February 18, 2016

తొలి ప్రయత్నంలో మిగిలి పోయిన పద్య కుసుమాలు... కంది శంకరయ్య గురువుగారి పాద పద్మములకు...సవినయంగా ప్రణమిల్లుతూ......కాస్త...చదివి కామొంటిస్తారుకదా.......

నా యొక్క తొలి ప్రయత్నం.

ఈ ప్రయత్నాన్ని చూసి పేజీ లోంచి బయటికి వచ్చేయకుండా.... కాస్త కామెంటు తో తరింపచేస్తారని ఆశ పడుతున్నాను.