Wednesday, July 31, 2013

అక్షరాశ్రువులు







ఎందుకో అన్యమనస్కంగా వుంది.....

 .నాప్రమేయం లేకుండాకంటికొసలలోచెమ్మ ఆనవాలు,
నా ఆలోచన ఆడగకుండా కలం కదిలించె అక్షరాలు,
నా అనుమతి లేకుండా దాటిపోవు భావాలు,
                                       ఎందుకని ,.
బాల్యంలో గీసిన ఆంధ్రప్రదేశ్ మేప్ ఆకృతి మారిందనా,
ఆదరించిన అన్నపూర్ణ చెరిసగమయ్యిందనా........
బడినుంచి వల్లెవేసిన రాజధాని పేరు మారిందనా
నల్ల బంగారమే వేరయ్యిందనా
నాగార్జున సాగరే చేరువలేదనా
శ్రీశైల మల్లన్నకి దూరమయ్యామా...
భద్రాధ్రి రామయ్యకి భారమయ్యామా..
ఇన్ని వత్సరాల వాత్సల్యం
ఇరుకున పడి పోయిందా....







Monday, July 15, 2013

పద్యం - హృద్యం 3


                      పద్య రచన మీద ఆసక్తితో కొన్ని వ్రాసాను కానీ ,.వాటిని కాస్త అయినా చందోబద్దంగా వ్రాసానా ?..లేదా?... అన్న సందేహం ..అదుగో ...అలాంటి సమయంలోనే శ్రీ కంది శంకరయ్య గురువుగారు నిర్వహిస్తున్న శంకరాభరణం బ్లాగు చూడటం జరిగింది, అదో కవి సంగమం,ఎంతోమంది కవివరేణ్యులు ఫద్యాలను అలవోకగా పండిస్తూ,గురువుగారి ఆధ్వర్యంలో ఇంకా మెరుగులు దిద్దుకుంటూ , పసందైన పద్యరచనలు, ముగ్ధులుని చేసే పూరణలతో శోభాయమానంగారాగ రత్న మాలికా తరళము ఆ శంకరాభరణమల్లే వుంది ఆ బ్లాగు...నేను కూడా అందులో ఇచ్చే అంశాలతో పద్యరచన చేయడానికి సాహసించాను..నన్ను ప్రోత్సహించి , నేను వ్రాసిన పద్యాలను సవరణ చేసి వ్రాయగలనన్న నమ్మకాన్ని నాలో కల్గించిన గురువర్యులైన శ్రీ కంది శంకరయ్య గారికి  నమస్సుమాంజలి ఘటిస్తూ.. వారి సవరణలతో నేను వ్రాసిన పద్యాలు ఇవి...





ఈ ఫొటో శంకరాభరణము భ్లాగులో పద్యరచన అంశము....ముసురు....

కసురు కొనుచును కాలమే కాటువేసె
పసరు మందైన పూయ రెవ్వారలైన
ఎసరు పెట్టగ కానరారెవ్వరిచట
పట్టెను ముసురు ముదుసలి బ్రతుకునందు


ఆకలేమొ నేర్పు అవనిలో పాఠాలు
సృష్టి వస్తువెల్ల సూటి గురువు
ఓర్పు నేర్పు యున్న ఓటమే యుండునా
మేక యైన నేమి కేక కేక



లాగి నవ్వు తెచ్చి లాఫింగుధెరఫీగ
యోగ యనుచు రోగి యోగి ఆయె
వికటకవిని బోలు నొక విదూషకు డేడి
విశ్వమందు నవ్వు విగతజీవి



అత్త మామ తోడ , అందరకును స్వస్తి
ఆస్తి యొకటి తప్ప యన్ని నాస్తి
జీన్స్ ఫేంట్ డ్రస్సు,, స్విసు బేంకు బేలన్స్
కొత్త కాపురాల కోర్కెలంట.



నరకమున సుఖమ్ము దొరకు నయ్య!


నరకభాధలన్ని నెరవుగా ఇక్కడే
రోజుకొక్క తీరు రాజు చుండె
ఇహము లోన సౌఖ్యమింతైన లేదయ
నరకమున సుఖము దొరకునయ్య

Wednesday, July 10, 2013

నిన్న - నేడు - రేపు...





(ఈ కవిత 'కౌముది' అంతర్జాలపత్రిక జనవరి సంచికలో                 ప్రచురించబడినది..ప్రచురించిన కౌముది సంపాదకవర్గానికి,శ్రీ కిరణ్ ప్రభ గారికి కృతజ్ఞతాభివందనలు.)


నిదురించిన నిన్నని పిలిచి
కదిలించకు నీ మదిని,
బెదిరించిన నేటిని తలచి
నిదురించకు మారదని,
ఉదయించే రేపును వలచి
మొదలెట్టిన వాడే మనిషి
శ్రమజీవికి ఓటమి రాదు
శ్రమ శక్తికి పోటీ లేదు!
వెనుతిరగక వేసెయ్ అడుగు
వెన్నెల రాకుంటే అడుగు!!

Saturday, July 6, 2013

పాట - నాకు నేస్తం..




                    పాట నాకు నేస్తం..ప్రతి పాట నా ప్రయాణం
               పాట నాకు ప్రాణం, పాటేర నా సమస్తం... ఇది ఓ సినిమా పాట..నాది కూడా ఇదే ఫీలింగ్...బేసికల్ గా ఎక్కువగా పాటలే వ్రాస్తాను..పాట , కవిత ,పద్యం, ఏదో ఒకటైనా వ్రాయందే .ఆరోజు నా దినచర్య. పూర్తి కాదు...
నా పాటల ప్రస్థానంలో....ఎన్నో పాటలు....కొన్ని వెలుగులోని,....కొన్ని కలుగులోని వున్నాయి...

పాటమీదే  ..వ్రాసిన ...చిన్నిపాట ఇది....
               
             పాట నాతో జట్టు, కట్టి శాన్నాళ్ళాయె
            పట్టి ఒదలాదాయె..పట్టియె  తానాయె
            చెవివొగ్గి వినుకోవె చిలకా..చిలకా
            చెవివొగ్గి వినుకోవె మొలకా..    .... పాట...
చరణం......   భావకవి కైతల్లో అచ్చులే దిద్దించి
             నండూరి ఎంకితో  నాట్యమాడించి
             సిరివెన్నెల స్నానాల,జలకమాడించి
             తెలుగుకవుల, పాట తోటల్లొ తిప్పింది .     ..పా...
చరణం...    వెలుగులో తావచ్చి, నన్ను ఎరిగించింది
             జిలుగు వెలుగు త్రోవ, నను నడవమంది
             మలిగిపోవద్దంది , మాటిమ్మనీ అంది
             మనమద్దె దోస్తిని మరిచిపోవద్దంది
                   పాట తో నేజట్టు ,కట్టిశాన్నాళ్ళాయె
                   కట్టినా ఆ జట్టు పట్టి ఒదలాలేదె
                   చెవివొగ్గి వినుకోవె చిలకా...మొలకా
                   తేటతెనుగూలోన పలుకా...
                                     
                                                   
                            

    

Wednesday, July 3, 2013

వేసవి కవిత...





(  సాహిత్య వెన్నెలలు జాలువారి, ఓలలాడించే   ' కౌముది'  అంతర్జాల పత్రికలో  ఏప్ర్ల్లెల్  నెలలో  ప్రచురించబడిన నా  కవిత...వేసవి వచ్చేసింది.ప్రచురించిన శ్రీ కిరణ్ ప్రభగారికి , కృతజ్ఞతాభివందనాలు ....)

వేసవి వచ్చేసింది...
        ఎలకోయిల రావాలను..
        ఎండల కరవాలాలను..
తీసుకుని తోసుకుంటూ..
మండు వేసవి వచ్చేసింది..
        మామిడి రసాలను..
        మరుమల్లెల తావులను
పట్టుకుని నెట్టుకుంటూ..
మండు వేసవి వచ్చేసింది..
        ముంజెల ముత్యాలను..
        ముచ్చెమటల దాహాలను..
దోసిలి లో నింపుకుని..
వగరుస్తూ..వేసవి వచ్చేసింది..
        వడగాలుల లీలలను..
        వాసంతపు హేలలను..
వడినిండా పోసుకుని..
వేసవి వచ్చేసింది..
        శ్రీకారపు ఉగాదిని..
        శ్రీరామ నవమినీ..
శీఘ్రంగా తోడ్కొని..
వేసవి వచ్చేసింది..
మళ్శీ. వేసవి వచ్చేసింది..


        

Monday, July 1, 2013

పద్యం - హృద్యం 2

                         ఈ మధ్యన చందోభాషణ (fb page) చూసిన దగ్గరనుంచి పధ్యాలమీదకే మనసు పోతోంది,. ఆటవెలదికి వేమన,...సీసానికి శ్రీనాధుడు పెట్టింది పేరట, ఆటవెలది సులువుగ వ్రాయవచ్చు అని చదివాను, చిన్నప్పుడు చదివిన చందస్సు....గుర్తుకుతెచ్చుకుని, అంతర్జాలాన్ని శోధించి, ఎలాగైనా పధ్యాలు వ్రాయడానికే ప్రయత్నిస్తున్నా,..మామూలుగా పద్యాలయితే వస్తున్నాయి కానీ...వాటిని, చందస్సులో బంధించడానికే, పాట్లుపడాల్సి వస్తోంది,..అయినా నా కలం గో యె హెడ్ , అంటోంది,..ముందు,ముందు, చందంలో బంధించే పద్యాలు పెడతాను..ప్రస్థుతానికి, మందం గా వున్న పద్యాలు ....
                
నెట్టింట్లో ఉండుతప్ప
నట్టింట్లో వున్నదెపుడు
గట్టిగ నీ ఎలుక పట్టి
పట్టుకు తిరిగెదము కాదా ఓ విఘ్నేశా
..
మంచిని ముంచిన కాలమిది
వంచన కంచికి చేరనిది
కొంచెమైనను కంచంలోకి
నంచుకులేనిదే నడవనిది

ఆలయమ్మున నంది నతిభక్తితోకొల్చి
ఫలముకై ఆశించు పూజ్యజనము
ఇంటిముందున్న గంగిగోవును గొట్టి
ఏల హింసింతు రిది..ఏమి మూఢతనము