Sunday, July 19, 2015

నా తొలి ప్రయత్నం పుస్తక రూపంలో......

Friday, March 20, 2015

"మన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలు.

బ్లాగ్ మిత్రు లందరకు ఈ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.
 

Monday, November 10, 2014

న్యస్తాక్షరి - 4

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
 
    అంశం- నగర జీవనము
ఛందస్సు- కందము
మొదటిపాదం మొదటి అక్షరం ‘న’, రెండవపాదం రెండవ అక్షరం ‘గ’, మూడవ పాదం మూడవ అక్షరం ‘ర’, నాల్గవ పాదం నాల్గవ అక్షరం ‘ము’.
 

గరమున బ్రతుకు జూడగ
సుమముగా నుండు మిగుల సొమ్ములు గలుగన్
దగము లొచ్చిన దీరును
నగరము లో జీవనమ్మె నయముగ దోచున్ !

Friday, November 7, 2014

న్యస్తాక్షరి - 3

శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....

అంశం- జటాయువు వృత్తాంతము.
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా జ-టా-యు-వు ఉండాలి. 


నక సుతతోడ లంకేశు జనుటగనిక
టారి నెదిరింప దానవుం డాగ్రహముగ
యురుకు రెక్కలు ఖండించి పెరుక రాఘ
వునకు తెలిపి ప్రాణములను వీడెనపుడు!

నిషిద్ధాక్షరి - 18

శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....

  అంశం- పద్మవ్యూహంలో అభిమన్యుఁడు.
నిషిద్ధాక్షరాలు - పవర్గాక్షరాలు (ప,ఫ,బ,భ,మ)
ఛందస్సు - మీ యిష్టం వచ్చింది.


కంజ రచనను ఛేదించి కఱ్ఱి సుతుడు
శత్రు సేనల నెదురొడ్డి సంహరించె
నీరు గారెను కురుసేన వీరు నిగని
చిన్న వాడని జూడక చేరువయ్యి
దాడి జేయుచు గూల్చెను దండు గాను!!!