Monday, November 10, 2014

న్యస్తాక్షరి - 4

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
 
    అంశం- నగర జీవనము
ఛందస్సు- కందము
మొదటిపాదం మొదటి అక్షరం ‘న’, రెండవపాదం రెండవ అక్షరం ‘గ’, మూడవ పాదం మూడవ అక్షరం ‘ర’, నాల్గవ పాదం నాల్గవ అక్షరం ‘ము’.
 

గరమున బ్రతుకు జూడగ
సుమముగా నుండు మిగుల సొమ్ములు గలుగన్
దగము లొచ్చిన దీరును
నగరము లో జీవనమ్మె నయముగ దోచున్ !

Friday, November 7, 2014

న్యస్తాక్షరి - 3

శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....

అంశం- జటాయువు వృత్తాంతము.
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా జ-టా-యు-వు ఉండాలి. 


నక సుతతోడ లంకేశు జనుటగనిక
టారి నెదిరింప దానవుం డాగ్రహముగ
యురుకు రెక్కలు ఖండించి పెరుక రాఘ
వునకు తెలిపి ప్రాణములను వీడెనపుడు!

నిషిద్ధాక్షరి - 18

శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....

  అంశం- పద్మవ్యూహంలో అభిమన్యుఁడు.
నిషిద్ధాక్షరాలు - పవర్గాక్షరాలు (ప,ఫ,బ,భ,మ)
ఛందస్సు - మీ యిష్టం వచ్చింది.


కంజ రచనను ఛేదించి కఱ్ఱి సుతుడు
శత్రు సేనల నెదురొడ్డి సంహరించె
నీరు గారెను కురుసేన వీరు నిగని
చిన్న వాడని జూడక చేరువయ్యి
దాడి జేయుచు గూల్చెను దండు గాను!!!

Thursday, November 6, 2014

న్యస్తాక్షరి - 2

 

 శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....


అంశం- వినాయక స్తుతి.
ఛందస్సు- ఆటవెలది.
మొదటిపాదం 1వ అక్షరం ‘వి’, రెండవ పాదం 3వ అక్షరం ‘నా’, మూడవ పాదం 10వ అక్షరం ‘య’, నాలుగవ పాదం 12వ అక్షరం ‘క’.


విశ్వ నాధ సుతుడ విఘ్నేశ జేజేలు
విఘ్న నాయకునకు వేల నతులు
విద్య లొసగు మయ్య విజమ్ము లొసగుచు
శుభము గలుగ నెపుడు శూర్ప ర్ణ

న్యస్తాక్షరి - 1

 శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో...

ఇక మన మొదటి న్యస్తాక్షరి ఇది....
అంశం- సరస్వతీ స్తుతి.
ఛందస్సు- తేటగీతి.
మొదటిపాదం మొదటి అక్షరం ‘స’, రెండవ పాదం మూడవ అక్షరం ‘ర’, మూడవ పాదం తొమ్మిదవ అక్షరం ‘స్వ’, నాలుగవ పాదం పన్నెండవ అక్షరం ‘తి


సన్ను తించెద సతతము శారదాంబ
మధుర భాషిణి వాగ్దేవి మదిని నిన్ను
పలుకు కలికి సరస్వతీ! వందనమ్ము
ప్రస్తు తించెద భగవతి! ప్రణతి యిడుదు
 

నిషిద్ధాక్షరి - 17

శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో...

కవర్గాక్షరాలు లేకుండా
కాకాసుర వృత్తాంతాన్ని గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.



పత్ని ధరుణంబు జీరెడి పర్వి జూచి
దాశరథి వేసె నస్త్రము దర్భతోడ

చావ వెఱచిన పిశునము శరణుజొచ్చె
బొంది నందలి నేదైన పొంది యమ్ము
శాంత మౌనని శ్రీరామ చంద్రుడనిన
నేత్ర మొండిచ్చి సేవించి సూత్రి వెడలె
 

నిషిద్ధాక్షరి - 16


శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో ...
రామపట్టాభిషేకాన్ని వర్ణిస్తూ తేటగీతి వ్రాయండి.
మొదటిపాదాన్ని ‘రా’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘మ’ నిషిద్ధం.
రెండవపాదాన్ని ‘భ’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘ర’ నిషిద్ధం.
మూడవపాదాన్ని ‘ల’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘క్ష్మ’ నిషిద్ధం.
నాలుగవపాదాన్ని ‘శ’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘త్రు’ నిషిద్ధం.
నిషిద్ధాక్షరాలు కేవలం పాదంలో రెండవస్థానానికే పరిమితం. పద్యంలో మిగిలిన స్థానాలలో వాడవచ్చు.




 రాజ్య పట్టాభిషిక్తుడౌ రామునకును
భక్తి మీరగ మారుతి పరిచరించ
లక్షణంబుగ శత్రఘ్న లక్ష్మణుండు
శక్తిశాలురు జనులంత జయములిడగ
రమణి సీతమ్మతల్లితో రహిని గాంచె!!!

నిషిద్ధాక్షరి - 14

 శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో....

ర’ అన్న అక్షరాన్ని ఉపయోగించకుండా
రామ రావణ యుద్ధాన్ని వర్ణిస్తూ
కందపద్యం వ్రాయండి.


సీతమ్మ ను గావ దలచి
సీతాపతి లంక కేగె సేతువు మీదన్
పాతకుడౌ లంకేశు ని,
నాతిని బట్టిన దనుజుని నాశముజేసెన్!


కట్టెను సేతువు సత్యుడు
గొట్టెను లంకాధిపతిని కుజనే తెచ్చెన్
బిట్టుగ నయోధ్య జనితా
పట్టమ్మును గట్టుకొనెను పావనితోడన్!

నిషిద్ధాక్షరి - 13

 
శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో...
 
 
మొదటిపాదంలో కవర్గాక్షరాలను, రెండవపాదంలో చవర్గాక్షరాలను, 
మూడవపాదంలో తవర్గాక్షరాలను, నాల్గవపాదంలో పవర్గాక్షరాలను ఉపయోగించకుండా
భారతమాతను స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
 
 
జీవ నదులన్ని ప్రవహించు జీవభూమి!
వేదములు గీత వెలసిన వేదభూమి!
సకల కళలకు కాణాచి జయము జయము !
సుందర నందన జనని కి జోతలిడుదు!


Wednesday, November 5, 2014

నిషిద్ధాక్షరి - 12

శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....


 సరళాక్షరము(గ-జ-డ-ద-బ)లను ఉపయోగించకుండా
గాంధీజీని స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.



తెల్ల వారినెల్ల తరిమి తెచ్చె మనకు విచ్చలున్
తెల్లపంచె చేతికర్ర తెలిపె మానవత్వమున్
పిల్లలన్న పూవు లన్న ప్రేమ పంచు తత్వమున్
మల్లె వంటి మంచి మనసు మరువలేము తాతనున్

నిషిద్ధాక్షరి - 11

 శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....


 అనుస్వారాన్ని ఉపయోగించకుండా
పెండ్లి విందును గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.



విరిసిన మమతల తోడన్
మురియుచు నావడలు, బూరె, పులిహోరలతో
యరిసెలు మరి పాయసముల
పరిణయ భోజనము తినగ ప్రమదము గాదే!




 వరుస భోజనము లుపోయి పళ్లెము లను బట్టుచున్
మురిసి తినగ నొక్కమారె ముచ్చెమటలు బట్టునే
పరిణయమున భోజనములు ఫాస్ట్ ఫుడ్డు బోలగన్
వెరసి జూడ మొక్కుబడి గ వేడుకయ్యె నేడుగా!

నిషిద్ధాక్షరి - 10

 శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో..

శ, ష, స, హ అక్షరాలను ఉపయోగించకుండా
సతీసావిత్రి పాతివ్రత్యాన్ని గురించి 
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.


పతికి ప్రాణమ్ము లిమ్మని పట్టు బట్టి
వెంబడించెను కంకుని వేడుకొనుచు
దండపాణిని మెప్పించి ధర్మముగను
పతిని, తనయుని బొందెనా భాగ్యవతియె!

నిషిద్ధాక్షరి - 8



 శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....

కవర్గాక్షరము (క-ఖ-గ-ఘ-ఙ)లను ఉపయోగించకుండా
కైకేయి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.


 సుతుని రాజుని జేసెడి సూత్రమిదని
దుష్ట మంధర మాటలు దూరచెవిని
వరము నెపమున రాముని వనము జేర్చి
దశరధుని చిన్న భార్య యె తల్లడిల్లె.!

Tuesday, November 4, 2014

నిషిద్ధాక్షరి - 7

శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో....


గురువుల నిషేధంతో
గణపతిని స్తుతిస్తూ ఆటవెలదిలో
సర్వలఘు పద్యం వ్రాయండి.




శుభము గలుగు నెపుడు సుముఖుని దలచిన
విరుల నొసగి గొలువ సిరులు గురియు
కుడుము లిడిన జనుల నిడుములు తొలగును
పరశు ధరుని గొలిచి ప్రణతులిడుదు!!

నిషిద్ధాక్షరి - 6

శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో...

నిరోష్ఠ్యంగా (ప,ఫ,బ,భ,మ అనే అక్షరాలను ఉపయోగించకుండా)
మద్యపానాన్ని మానుమని హితబోధ చేస్తూ
మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.




సారా సేవించ వలదు
సారాయే హానిజేయు సర్వుల కిలలో
సారా కలతకు హేతువు
సారాయిని త్రాగకున్న స్వస్థత గల్గున్

నిషిద్దాక్షరి - 5

శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో....

నిషిద్ధాక్షరి.....


అవనిజ కనుదోయి వెలయ
శివధనువెత్తి దునుమాడి చేపట్టె కుజన్
దివి భువి నుతించె సత్యుని
పవనజనుతు భక్తితోడ వందన మనుచున్