Monday, November 4, 2013

శంకరాభరణం..సమస్యా పూరణలు..(క్రోధమే మేలుగద సర్వ గుణములందు) విరసంబై కావ్యమొప్పె - వీనుల విందై)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి  కృతజ్ఞతాభివందనములతో....

సమస్యా పూరణ..క్రోధమే మేలుగద సర్వగుణములందు,

కలుగు కష్టనష్టములకుకారణమ్ము
క్రోధమే, మేలుగద సర్వ గుణములందు
శాంత మయ్యదె సాధించు సౌఖ్యములను
సహన శీలము శాంతికి సాక్షి యగును



జిలేభి గారి భావము నచ్చి ...ఈ పద్యము..


అదిమి పెట్టిన కోపము హానికరము
మట్టు బెట్టగ క్రోధము మహికి శాంతి
బయట బెట్టగ క్రోధము భాధ తీరు
క్రోధమే మేలుగద సర్వ గుణములందు



సమస్యా పూరణ...విరసంబై కావ్యమొప్పె - వీనుల విందై...


హరినే తలచుచు ఒకకవి
హరి కధ నే రచనచేయ హరహర యనుచున్
సురుచిరసుమధురమగు మా
వి రసంబై కావ్యమొప్పె - వీనుల విందై

No comments:

Post a Comment