" గుండె గుండె కు కధ వుంటాది
గురుతుగ మిగిలే సొద వుంటాది
మింటి నున్న చందమామ .. గువ్వలచెన్నా
కంటిలోన దాచుకోమ్మా .. గువ్వలచెన్న్న
కధలు కంచి చేరలేవు .. గువ్వలచెన్న
సొదలు మంచి సుధలు వూరు .. గువ్వలచెన్న ..
ఇది నా స్వీయ రచన .. ఈరోజు కూడా గుండె గొంతుకలోన కొట్లాడి అశ్రువులే అక్షరాలు గా మారి ఆ రూపం దాల్చాయి .గురుతుగ మిగిలే సొద వుంటాది
మింటి నున్న చందమామ .. గువ్వలచెన్నా
కంటిలోన దాచుకోమ్మా .. గువ్వలచెన్న్న
కధలు కంచి చేరలేవు .. గువ్వలచెన్న
సొదలు మంచి సుధలు వూరు .. గువ్వలచెన్న ..
సాక్షి సలాం, మరొకసారి ఆ దైవానికి మనస్సాక్షి లేదా అని అనిపించింది , మీలో చాలామంది చూసేవుంటారు ఈరోజు సాక్షి సలాం టీవీలో .. మనసాగక రాస్తున్న .. ముద్దు ముద్దు గా ముచ్చటగొలిపే చిన్నారి శివ ప్రియ జీవనం , మందులతో సహజీవనం , తలసేమియా వ్యాధి రూపం లో ఆ పాప తో విధి ఎంత గా ఆడుకుంటోంది ? .. పాప పుట్టిన నాలుగునెలలకే ఆ వ్యాధి బయట పడిందిట, అదొక్కటే కాదు , కేన్సర్ , కూడా దానికి తోడు, ప్రతీ పదిహేను రోజులకొకసారి రెండు యూనిట్ల బ్లడ్ పాపకి ఎక్కిస్తేనేగాని వీలుకాని పరిస్తితి, లేకుంటే ప్రాణానికే ముప్పు , ఇలా ఇప్పటికి పన్నెండు యియర్స్ గా బ్లడ్ ఎక్కిస్తూ ఆ పాపని కాపాడుకొంటూ వస్తున్నారు తల్లి తండ్ర్లులు , శివ ప్రియ కి ఇప్పటి కి నూట ఎనభై సార్లు రక్త మార్పిడి జరిగిందిట, ఇది చూసిన ,విన్న ఏ గుండె చెరువవ్వ కుండ వుండగలదు ? పెద్ద అయ్యాక ఏమవుతావు అని ఎడిటర్ రామ్ గారు అడిగితే , నాలాగ నాకంటే ఎక్కువగా జబ్బులతో బాధపడే వారికి సాయం చేస్తానని చెప్పింది శివప్రియ మరి డబ్బులు నీకోసం వుంచుకోవా అని అడిగితే , వుంచుకుని ఏం చేస్తాను ? అని అంది ,హాట్సాఫ్ , ఆ మనసు ఎంత మందికి వుంటుంది ? .. ఆ చిట్టి గులాబి వికసించి , పరిమళాలు వెదజల్లి , తన ఆశయం తీరేలా పదిమంది సాయం చేసే భాగ్యాన్ని కల్గించమని ఆ దైవాన్ని కన్నీళ్ళతో అర్ధిస్తూ. హైదరాబాద్, చైతన్యపురిలో ఉండే ఈ పాప మరిన్ని వివరాలకోసం 98495 62493 కి ఫోన్ చెయ్యొచ్చు.
No comments:
Post a Comment