" మనిషిని బ్రహ్మ్మయ్య మట్టితో చేసేనయ
ఆడించుతున్నాడు బొమ్మలాట
నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా ...."
ఆడించుతున్నాడు బొమ్మలాట
నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా ...."
ఇది ఒక పాత పాట, ఈ పల్లవి నాకు నచ్చి గుర్తుండిపోయింది , పాటంతా తెలియదు , ఏ సినిమాలోదో కూడా తెలియదు ,
ప్రస్తుతం అది అప్రస్తుతం .. సాక్షి ఆదివారం బుక్ మీలో చాలా మంది చదివే వారుంటారు , ఎడిటర్ రామ్ గారు నిర్వహించేఇంటర్వ్యూ లన్నా, వ్యాసాలన్న, నాకు ఆసక్తి , నిన్న బుక్ లో కూడా , రిలేషన్స్ డబ్బాల గురించి రాసారు , నిజమే నండీప్రతీ ఒకరు ఇలాంటి డబ్బాలలోనే జీవిస్తున్నాం , ప్రతీ మనసు ఒక డబ్బా , ఒక కంపార్ట్మెంట్ , ప్రతీ వారు, వారి, వారి , డబ్బాలలో వుండే ఆలోచిస్తున్నారు , కానీ మరొకరి డబ్బాలలోకి వెళ్లి ఆలోచించలేకపోతున్నారు ,రామ్ గారు చెప్పినట్లు అలా మరొకరి మనసు డబ్బాలో కి వెళ్లి ఆలోచిస్తే చాలా సమస్యలు వుత్పన్నం కావు , ఒక చెడ్డతలంపు గానీ, వేరొకరికి హాని చేయలనుకున్నపుడు గానీ , ఒక్కక్షణం , కళ్లు మూసుకుని, ఆ హానే మనకెవరైనా చేస్తేమన పరిస్టితి ఎలా వుంటుందో వుహిస్తే , ఏ తప్పు చేయలేము , కళ్లు మూసుకుని ఒక్కసారి ,మనం లేని ఈ ప్రపంచాన్నికుటుంబాన్ని , పరిసరాలని , వూహించి చూస్తె, ఒళ్ళు గగుర్పొడుస్తుంది , గుండె పిండేసే బాధ కల్గుతుంది , మనలోమనం ఆత్మావలోకనం చేసుకున్నపుడు , చిన్న అభద్దమైనా, ఏ చిన్న హాని అయినా చేయాలనిపించదు , మంచినిపంచాలనిపిస్తుంది , ప్రపంచాన్నే ప్రేమించే మనసు వస్తుంది , ఇతరులని అర్ధం చేసుకునే మనస్తత్వం అలవడుతుంది , ప్రపంచమనే అతి పెద్ద డబ్బాలో , మనందరం చిన్న ,చిన్న డబ్బాలం, ఎవరికి వారు వారి వారి డబ్బాలలోనుండి, అప్పుడప్పుడు ఇతరుల డబ్బాలలోనికి పరకాయప్రవేశం చేసి ఆలోచిస్తే , సమస్యలు సానుకూలంగా సమసిపోతాయి , విశ్వశాంతి , విశ్వ వ్యాప్తమై విరాజిల్లుతుంది ... కాదంటారా ..?.. , ,