నాలుగు పాదాల ప్రారంభంలో 'తల'ను అన్యార్థంలో ప్రయోగిస్తూ
ఇష్టదైవాన్ని స్తుతిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
దత్తపది..
తలచిన బలుకుచు మాచిం
తల నిల నెడబాపు నట్టి దండ్రివి యనుచున్
దలచెద వేంకటనాధుని
తలపులలో నిలిపి సతము తన్మయమగుచున్ !!!
తలచెదనే కలిమిచెలిని
తలచెదనే మరునియంబ దాక్షాయణినే
తలచుచు శ్రీ చరణమ్ముల
తలవంచి నమస్కరింతు తద్దయు భక్తిన్ !!!
No comments:
Post a Comment