ఏకవింశతి పత్రి పూజ....
సీసపద్యం....
విఘ్ననాయక నిన్ను
వేడ్కతోబూజింతు
.........చక్కంగ
నిరువది యొక్కపత్రి
మామిడి దానిమ్మ
మరువమ్ము గండకీ
...........ఉమ్మెత్త
నశ్వద్ధ నుత్తరేణి
మారేడు జిల్లేడు
మద్ది జమ్మియు మాచి
........దేవదారు
తులసి రావి జాజి
గరిక మునగ విష్ణు
క్రాంతయు రేగుయు
..........చిన్న
ములక దెచ్చి శ్రీకరముగ
ఆటవెలది....
వెండిపళ్ళెరమున
మెండుగా మేలైన
పంచభక్ష్యములిడి
భక్తితోడ
దీపములను బెట్టి
ధూపహారతులిడి
వేడుకొంటిమయ్య
విఘ్నరాజ!!!
కందము...
నిన్నే మనమున
దలచుచు
నిన్నే నిరతము
గొలిచితి నిజముగ ణేశా
దన్నువి నీవని
నమ్మితి
చెన్నుగ మము గావరావె సింధురవదనా!!!
వందనము విఘ్ననాయక
వందనమిదె పరశుధరుడ పార్వతి తనయా!
వందనము వక్రతుండా
వందనము గణేశ నీకు వందనశతముల్!!!
వందనమిదె పరశుధరుడ పార్వతి తనయా!
వందనము వక్రతుండా
వందనము గణేశ నీకు వందనశతముల్!!!
No comments:
Post a Comment