Thursday, April 28, 2016

కృష్ణం వందే జగద్గురుం....



                              కృష్ణం వందే జగద్గురుం

రావయ్యా మురళీధర
రావయ్యా నల్లనయ్య రాధాకృష్ణా
రావయ్యా వెన్నదినగ
రావయ్యా మమ్ము బ్రోవ రాగుణజాలా!!!

దేవకి నందన కృష్ణా
యోవారిజ పత్ర నేత్ర యో యవనారీ
రావేల దీన భాంధవ
గోవర్ధన ధారి నీకు కూర్నినిషాతుల్!!!

వందనము భక్తవరదుడ
వందనము మురారి శౌరి వంశీధరుడా
వందనమో మైందహనుడ
వందనము యశోద తనయ వందన మయ్యా!!!

కన్నుల కనబడవైతివి
చెన్నుగమరి చిన్నికృష్ణ చింతలు దీర్చన్
వెన్నను దాచితి నీకై
కన్నా! నను గావుమయ్య కౌస్తుభధారీ

దేవకి నందన ధీరజ ! కృష్ణా !
శ్రీవర దాయక శ్రీకర ! కృష్ణా !
గోవులు గాచిన గోపతి! కృష్ణా !
బ్రోవవె మమ్ము సుపూజితకృష్ణా!!!

వారిజ లోచన వందిత కృష్ణా!
ధారుణి గాచిన దాతవు కృష్ణా!
కోరి భజించెద గోపిక కృష్ణా !
నేరము లెంచకు నిర్మల కృష్ణా!!!


దండమయా మురళీధర
దండమయా నందబాల తాండవ కృష్ణా!
దండమయా వనజోదర
దండమయా చిన్నికృష్ణ దండము నీకున్!



Friday, April 22, 2016

కాఫీ ఖండిక..





                                                                       
                                 కాఫీ

నీరము పౌడరునకలిపి
తీరుగ ఫిల్టరునవేసి తీపిని చేర్చన్
క్షీరము జోడించ నమరు
నోరూరించుచునుమంచి నురగల కాఫీ!                                       

నురగలు గ్రక్కెడు కాపీ
సురుచిరమగు నిన్ను త్రాగు చుందుము నహమున్
హరిహరులిది చవి జూసిన
మరి వదలరు మాకు నిన్ను మధురపు కాఫీ!!!


కాఫీ త్రాగిన చాలును
సాఫీగా సాగు దినము సందియ మేలా?
హేఫీగా నతిధులకున్
కాఫీనందింతు రిండ్ల కాంతామణులే!!! 

ఎప్పుడు బడలిక గల్గిన
కప్పుడు కాఫీని త్రాగి కడు వేడుకతో
చప్పున పనులను జేయుచు
విప్పుగ నిను మెచ్చుచుంద్రు ఫిల్టరు కాఫీ!!!

కాఫీ త్రాగగ నుదయము
సాఫీగా జరుగు పనులు జర లేటైనన్
దాపురమగు తలనొప్పియె
మాపాలిట రక్ష నీవె మధురపు కాఫీ!!!

ఎప్పుడు పడితే నప్పుడు
ముప్పొద్దుల త్రాగుచుంద్రు మురియుచు కాఫీ
చెప్పక వచ్చెడు నతిధికి
కప్పుడు కాఫీ నొసగును కమ్మగ నతివల్!!!

Tuesday, April 19, 2016

క్షీరసాగరమధనం (ఖండిక)

       
                                                    శంకరాభరణంలో నేను వ్రాసిన
                                        ఖండిక                  
                                  క్షీరసాగరమధనం





మంధరగిరి కవ్వముగను
బంధముగ నాదిశేషు బట్టగ గిరి నా
నంధువుగహరికమఠమై
సింధువు మధనమ్ము జేయ చెలువము తోడన్!!!

పొందుగ సురలును దనుజులు
నందముగాకడలిచిలుక నానందముతో
బొందిన హాలాహలమున్
ముందుగ పుక్కిటనుబట్టె మృత్యుంజయుడే!!!

మ్రింగెనుగద పరమశివుడు
పొంగిన గరళమ్ముతాను పుక్కిట నిడుచున్
హంగుగ గళమున బెట్టిన
జంగమదేవర నుగనగ జయజయ మనుచున్!!!

హరిహరులను గొలిచిజనులు
మరలన్ మధనమ్ముజేయ మంధర గిరితో
సురభియు నైరావతమును
సిరియును కల్పకము శశియు చెన్నుగ వచ్చెన్!!!

ధరియించెను శశిని శివుడు
వరియించెను సిరిని శౌరి వాత్యల్యమునన్
తరలెను సురపతి వెంబడి
సురభియు నైరావతమును సొగసుగ దివికిన్!!!

వందనము నీలగళునకు
మందరగిరిధారి హరికి మధుసూదనకున్
వందనము సిరికి, శేషుకు
వందనమాచార్యులకును వందన మెపుడున్!!!


Friday, April 8, 2016

ఉగాది.....




 శీతకము పరుగు దీసెను                                       
చూతమ్ములు మెఱయు చుండె సుందర వనిలో
ప్రీతిగ పాడుచు కోకిల
భూతలమును సేదదీర్చి  మురిపించెనహో  



మల్లెలు విరిసెడు రేయిని                                 
తెల్లని వెన్నెలపు శోభ తేజము నీయన్                  
చల్లని వేసవి గాలులె
నుల్లము రంజింప జేసె నుర్వీతలమున్      




లోకములో సుఖశాంతులు
సాకతముగ శుభము లీయ జనులందరకున్
శ్రీకరమౌ దుర్ముఖిలో
ప్రాకాశ్యముగా నుగాది పండుగ వచ్చెన్