విద్యయె నిగూఢ యోగము
తధ్యముగా నిచ్చు నదియె ధనమును యశమున్
విద్యయె వివేక మిడుచున్
సద్యోజాతుడుని దెలియు సన్మతి నీయున్!!!
విద్యయె కీర్తియు కనకము
విద్యయె చుట్టము గురుండు విశ్వపుడదియే
విద్యయె వీడని నేస్తము
విద్యయె నీ నీడ గాదె విశ్వము నందున్ !!!
తరలించుకు పోలేనిది
పరులెవ్వరు దోచ లేని భాగ్యం బిదియే
సిరులన్నియు తొలగినను
స్ధిరముగ నీతోనె యుండు సిరిగద చదువే!!!
No comments:
Post a Comment