సంక్రాంతి.....
సంక్రాంతి శుభాకాంక్షలు
మకర సంక్రాంతి శుభవేళ మరల వచ్చె
సకల శుభముల నొసగగా సంకురాత్రి
సిరుల నిచ్చెడి లక్ష్మిని చేరి గొలువ
సర్వ శోభిత సంక్రాంతి స్వాగతంబు
ధరణి జనులకు ప్రత్యక్ష దైవ మగుచు
జాగృతంబును చేయుచు జగతి నెపుడు
మకర రాశిన చేరెడు భాస్కరునకు
పద్మ పాణికి భక్తితో వందనములు
No comments:
Post a Comment