Saturday, January 18, 2014

కనుమ ....





కనుమయె కర్షక పండగ
కనుమరుగగుచుండెనేడు కర్షక హేలల్
ఘనముగ జోడెడ్లగొలిచి
మనరైతులుచేయుపూజ మంగళకరమున్

సంక్రాంతి.....






                                                            సంక్రాంతి  శుభాకాంక్షలు

మకర సంక్రాంతి శుభవేళ మరల వచ్చె
సకల శుభముల నొసగగా సంకురాత్రి
సిరుల నిచ్చెడి లక్ష్మిని చేరి గొలువ
సర్వ శోభిత సంక్రాంతి  స్వాగతంబు


ధరణి జనులకు ప్రత్యక్ష దైవ మగుచు
జాగృతంబును చేయుచు జగతి నెపుడు
మకర రాశిన చేరెడు భాస్కరునకు
పద్మ పాణికి భక్తితో వందనములు

భోగీ రోజు...





భోగము లిచ్చును భోగియె
పోగొట్టునుపాపమెల్ల బోగీ మంటల్
వేగమె చూదము రారే
భోగీ మంటలనుజూడ బుణ్యము వచ్చున్



భోగి మంటలు గనలేము భోగి నేడు
పట్న వాసపు భోగాల బ్రతుకు లివియె
లెక్క కయినను లేవుగ రేగు పళ్ళు
భోగ భాగ్యము లిచ్చును భోగి మంట


Friday, January 3, 2014

శుభాకాంక్షలు.....


                                                  
నూతన సంవత్సరమున
ఖ్యాతియు శాంతియునుగలిగి కలతలు లేకన్
భూతలమున జనులందరు
ప్రీతిగ నుండెదరుగాదె ప్రియమగు చెలిమిన్



నూతన సంవత్సరమా!
ఖ్యాతిని నిలబెట్టినీవు కాంతినొసగు,మా
నేతలు కోతలు కోయక
నీతిని పాటించునటుల నీవే గనుమా