శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతోో...
శ్రీరామ నవమి రోజున
శ్రీరాముని శరణువేడ శ్రేయము గలుగున్
శ్రీరామునిపెండ్లి కనగ
శ్రీరామునిరక్ష కలిగి చింతలు దీరున్
వామాంకమునన్ సీతను
ప్రేమముతోననుజునిలిపె ప్రీతిగ సరసన్
గోముగ భద్రాచలమున
క్షేమముగానుండి బ్రోచు సీతాపతియే!