Tuesday, February 25, 2014

( భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్1323)




 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...

భగవంతుడులేడనుచును 
నగధరుడినినమ్మలేని నాస్తికులకున్
నిగమము దెలియని వారికి
భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్

పద్య రచన ( నెమలి -505 ( NTR , ANR, with Ghantasala )




శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...





మురిపించెడిరూపముతో 
కురిపించెడి కళనుజూడ కూరిమి గలుగున్
శరజన్మునివాహనమౌ
పురిపులుగా,నీసొగసుని బొగడగ తరమా







ఒకరు ధర్మదాతనొకరు దానకర్ణ  
గాన గంధర్వ రారాజు ఘంటశాల
 కలసి చిత్రసీమనలరించు ఘనులు వీరు
 మరచి పోలేము మువ్వురి మధుర చరిత



నందమూరితోడ నాగేశ్వరుండును
నడుమ ఘంటశాల నగుచు నిలిచె
తెలుగు చలన చిత్రపు తేజమ్ములేవీరు
విశ్వ మంత తెలియు వీరి ప్రతిభ


సమస్యా పూరణలు..( మగని జడలోన మందార మాల ముడిచె 1321) ( మన మన మన మనమె మనమె మన మన మనమే 1322)




 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో..

మల్లెలడుగగ మందార మాల తెచ్చి 
చేతి కీయగ నతనిని చేర బిలిచి  
పంటి బిగువున వవ్వెడు పతిని నిరుప
 ,గని జడలోన మందార మాల ముడిచె





మన సంస్కృతి మన భాషయు 
ఘనమైనవి జగతిలోన కల్లన గలరే?
మనపదములనాద మిదియె
 మన మన మన మనమె మనమె మన మన మనమే
 

Monday, February 24, 2014

పద్య రచన ..(పల్లె సీమ..503 ) ( జలలింగము ..504)



 శ్రీ కంది శంకరయ్య గురువుగారకి కృతజ్ఞతలతో...





పాడిపంటల తులతూగు పల్లెసీమ
పచ్చ చేలము గట్టిన పసిడి కోమ
పాత కొత్తల కలనేత బాపు బొమ్మ
పల్లె సంస్కృతి జాతికి బట్టుగొమ్మ






గంగను తలనిడు దేవా!   
గంగను మునిగితివదేమి కారణ మేమో
నింగిని తాకెడు రూపున
జంగమ దేవర నినుగని జన్మ తరించెన్
 

జలముగ గరళము ద్రాగెను
లజల పరుగిడు సురనది జడలో ముడిచెన్
లజారినిసిగనుదొడిగె
జలలింగాకృతినికనగ చాలవె కనులున్