Monday, August 17, 2009

మనసు గదులు

" మనిషిని బ్రహ్మ్మయ్య మట్టితో చేసేనయ
ఆడించుతున్నాడు బొమ్మలాట
నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా ...."

ఇది ఒక పాత పాట, ఈ పల్లవి నాకు నచ్చి గుర్తుండిపోయింది , పాటంతా తెలియదు , ఏ సినిమాలోదో కూడా తెలియదు ,
ప్రస్తుతం అది అప్రస్తుతం .. సాక్షి ఆదివారం బుక్ మీలో చాలా మంది చదివే వారుంటారు , ఎడిటర్ రామ్ గారు నిర్వహించేఇంటర్వ్యూ లన్నా, వ్యాసాలన్న, నాకు ఆసక్తి , నిన్న బుక్ లో కూడా , రిలేషన్స్ డబ్బాల గురించి రాసారు , నిజమే నండీప్రతీ ఒకరు ఇలాంటి డబ్బాలలోనే జీవిస్తున్నాం , ప్రతీ మనసు ఒక డబ్బా , ఒక కంపార్ట్మెంట్ , ప్రతీ వారు, వారి, వారి , డబ్బాలలో వుండే ఆలోచిస్తున్నారు , కానీ మరొకరి డబ్బాలలోకి వెళ్లి ఆలోచించలేకపోతున్నారు ,రామ్ గారు చెప్పినట్లు అలా మరొకరి మనసు డబ్బాలో కి వెళ్లి ఆలోచిస్తే చాలా సమస్యలు వుత్పన్నం కావు , ఒక చెడ్డతలంపు గానీ, వేరొకరికి హాని చేయలనుకున్నపుడు గానీ , ఒక్కక్షణం , కళ్లు మూసుకుని, ఆ హానే మనకెవరైనా చేస్తేమన పరిస్టితి ఎలా వుంటుందో వుహిస్తే , ఏ తప్పు చేయలేము , కళ్లు మూసుకుని ఒక్కసారి ,మనం లేని ఈ ప్రపంచాన్నికుటుంబాన్ని , పరిసరాలని , వూహించి చూస్తె, ఒళ్ళు గగుర్పొడుస్తుంది , గుండె పిండేసే బాధ కల్గుతుంది , మనలోమనం ఆత్మావలోకనం చేసుకున్నపుడు , చిన్న అభద్దమైనా, ఏ చిన్న హాని అయినా చేయాలనిపించదు , మంచినిపంచాలనిపిస్తుంది , ప్రపంచాన్నే ప్రేమించే మనసు వస్తుంది , ఇతరులని అర్ధం చేసుకునే మనస్తత్వం అలవడుతుంది , ప్రపంచమనే అతి పెద్ద డబ్బాలో , మనందరం చిన్న ,చిన్న డబ్బాలం, ఎవరికి వారు వారి వారి డబ్బాలలోనుండి, అప్పుడప్పుడు ఇతరుల డబ్బాలలోనికి పరకాయప్రవేశం చేసి ఆలోచిస్తే , సమస్యలు సానుకూలంగా సమసిపోతాయి , విశ్వశాంతి , విశ్వ వ్యాప్తమై విరాజిల్లుతుంది ... కాదంటారా ..?..
, ,

Saturday, August 15, 2009

పసి బోసి చిరునవ్వురా ...

" ఈ జెండా పసి బోసి చిరునవ్వురా
దాస్య సంకెళ్ళు తెన్చిందిరా ..
ఈ జెండా అమరుల తుదిశ్వాసరా ..
రక్త తిలకాలు దిద్దిన్దిరా ...
వందే మాతరం ... మనదే ఈ తరం .."

ప్రస్తుత పరిస్థితి " వంద ఏ మాత్రం , మనదే ఆయుధం " అన్న రీతి లో వుంది, కుక్కపిల్ల , అగ్గిపుల్ల , సబ్బుబిళ్ళ , కాదేది కవిత కనర్హం అన్నారు కవి శ్రీ శ్రీ , అదే ఇప్పుడయితే ఏమంటారో తెలుసా ? .. యాసిడ్ బాటిల్, పురుగులమందు, తాడు, బ్లేడు , చాకు, మేకు, కాదేది యువత కనర్హం అందురు .. యువతరం అంతటినీ నేననటం లేదు , చాలామందియువత ,తల్లితండ్రులని , దేశాన్ని, గురువులని, తోదబుట్టినవారిని ప్రేమించి ,అభిమానించే వారున్నారు , కానీతెనేతుట్టేకి పైన అల్లుకుని ఆ తేనే కనిపించకుండా వుంటాయి తేనెటీగలు , ఆ తెనేటేగాలని దులిపెదెవరు ? కమ్మనైన ఆ తేనే తీయదనం నలువైపులా పంచేదెవరు ? మంచిని ఆవరించి చెడు విశ్వవ్యాప్త మైతే ఏఁ చేయగలం ? ..
మహాత్మ్డు డు మళ్ళీ పుట్టి అందరినీ ఒక తాటి మీద నడిపిస్తే , అశాంతి వనం లో శాంతి పూలు వికసిస్తే , అంతకంటేభారత భారతి కి ఆనంద మేముంటుంది .. ? .. అలాంటి రోజుల రోజాలు అరుదెంచునా ..! ఈ యుగానికి అలాంటివుగాదినీ ఆశించడం అత్యాస అవుతుందంటారా .. ? వేచి చూడటం తప్ప పేచీ , పూచీ , ఏముంది ?.

మంచి మనసులకి . మంచి మనుషులకి , మరోసారి , వందనం చేస్తూ .. వూపిరి వున్నతవరకు " వందే మాతరం , అందాం అందరం " ...

Sunday, August 9, 2009

గుండె గొంతుకలో ...

" గుండె గుండె కు కధ వుంటాది
గురుతుగ మిగిలే సొద వుంటాది
మింటి నున్న చందమామ .. గువ్వలచెన్నా
కంటిలోన దాచుకోమ్మా .. గువ్వలచెన్న్న
కధలు కంచి చేరలేవు .. గువ్వలచెన్న
సొదలు మంచి సుధలు వూరు .. గువ్వలచెన్న ..
ఇది నా స్వీయ రచన .. ఈరోజు కూడా గుండె గొంతుకలోన కొట్లాడి అశ్రువులే అక్షరాలు గా మారి రూపం దాల్చాయి .
సాక్షి సలాం, మరొకసారి దైవానికి మనస్సాక్షి లేదా అని అనిపించింది , మీలో చాలామంది చూసేవుంటారు ఈరోజు సాక్షి సలాం టీవీలో .. మనసాగక రాస్తున్న .. ముద్దు ముద్దు గా ముచ్చటగొలిపే చిన్నారి శివ ప్రియ జీవనం , మందులతో సహజీవనం , తలసేమియా వ్యాధి రూపం లో పాప తో విధి ఎంత గా ఆడుకుంటోంది ? .. పాప పుట్టిన నాలుగునెలలకే వ్యాధి బయట పడిందిట, అదొక్కటే కాదు , కేన్సర్ , కూడా దానికి తోడు, ప్రతీ పదిహేను రోజులకొకసారి రెండు యూనిట్ల బ్లడ్ పాపకి ఎక్కిస్తేనేగాని వీలుకాని పరిస్తితి, లేకుంటే ప్రాణానికే ముప్పు , ఇలా ఇప్పటికి పన్నెండు యియర్స్ గా బ్లడ్ ఎక్కిస్తూ పాపని కాపాడుకొంటూ వస్తున్నారు తల్లి తండ్ర్లులు , శివ ప్రియ కి ఇప్పటి కి నూట ఎనభై సార్లు రక్త మార్పిడి జరిగిందిట, ఇది చూసిన ,విన్న గుండె చెరువవ్వ కుండ వుండగలదు ? పెద్ద అయ్యాక ఏమవుతావు అని ఎడిటర్ రామ్ గారు అడిగితే , నాలాగ నాకంటే ఎక్కువగా జబ్బులతో బాధపడే వారికి సాయం చేస్తానని చెప్పింది శివప్రియ మరి డబ్బులు నీకోసం వుంచుకోవా అని అడిగితే , వుంచుకుని ఏం చేస్తాను ? అని అంది ,హాట్సాఫ్ , మనసు ఎంత మందికి వుంటుంది ? .. చిట్టి గులాబి వికసించి , పరిమళాలు వెదజల్లి , తన ఆశయం తీరేలా పదిమంది సాయం చేసే భాగ్యాన్ని కల్గించమని దైవాన్ని కన్నీళ్ళతో అర్ధిస్తూ. హైదరాబాద్, చైతన్యపురిలో ఉండే ఈ పాప మరిన్ని వివరాలకోసం 98495 62493 కి ఫోన్ చెయ్యొచ్చు.

Wednesday, August 5, 2009

అలాంటి కధలేవి?

ఒకసారి నేను ఈనాడు అనుబంధంలో చాల కలం కిందట ఒక కధ "విష్ణుప్రియ" గారిది అనుకుంటా.
చదవడం సంభవించింది.. కధ నన్ను ఎంతగా కదిలించిందంటే.. దాన్ని చాలా కాలం దాక నిజంగా అలాఎక్కదైనజరుగుతుందేమో అన్నంతగా కదిలించింది..
కధ సంక్షిప్తంగా నాకు గుర్తున్నన్తవరకూ..
ఒక వూరిలో ఉన్నా ఒక పాఠశాలకి కొత్తగా ఒక ఉపాధ్యాయుడు బదిలీపై వస్తాడు.
ఆయనకీ నూతనంగా వివాహం అవుతుంది..
దంపతుల అన్యోన్యత చుసి వూరిలోని వారన్దరూ అచ్చేరువొందుతారు.
వారి దాంపత్యం చూసి విధికి కన్నెర్ర అవుతుంది..
చక్కదనాల చుక్క అయిన ఆయన భార్య కాలం తో బాటుగా పెద్దదవలసింది పోయి చిన్నపిల్లలా మారిపోతుంది..
కొంత కాలం వరకూ ఆమె ఎందుకలా మారిపోతుందో తెలియక ఏంటో మధనపడతాడు.
కన్నెలా ఉండే భార్య తన చేతులమీదే చంటి పిల్లలా మారి పోతూ చివరికి పోత్తిల్లలోంచి, నేల తల్లి వొడిలోకి చేరడం
మార్పు కి సమజంలో ఎదుర్కొనే సమస్యలూ , తనకి మిగలదని తెలిసి కూడా, సేవలు చెస్తూ చివరిదశ కి చేరుకున్న
భార్య /కూతురు ని పొదివి పట్టుకుని విలపించడం ..... అబ్బ కధ తలచుకొంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.. మీరుకూడా చదివే వుంటారని భావిస్తూ..

"పిచ్చి బ్రహ్మ ఆడుతున్న తోలుబొమ్మ లాటలో "
ఇలాంటి ఆటలు కూడా ఉంటాయా??

Tuesday, August 4, 2009

చట్ట సభలా..చెత్త సభలా!!

చట్ట సభలా..
" గాంధి పుట్టిన దేశమా ఇది? నెహ్రూ ఏలిన రాజ్యమా ఇది?
సామ్య వాదం రామ రాజ్యం సంభవించే కాలమా?"
అలనాడు శ్రీ శ్రీ గారు ఎంత చక్కగా చెప్పెరండి..
నిత్య సత్యం కదా?
ప్రజలచే, ప్రజలకొరకు, ప్రజా సేవకై ఉన్నదే నట చట్ట సభ!! చిన్నప్పుడు సోషల్ లో చదివేను..
నాయకుల చే, నాయకుల కొరకు, నాయకుల వలన నడప బడుతోంది ఈ నాటి చెత్త సభ..
ప్రజా సమస్యలు కాని, ప్రజా బాగోగులు కాని పట్టకుండా పరస్పర నిండా రోపనలతో కాలాన్నీ, ప్రజా ధనాన్ని సంతోషంగావ్రుధచేస్తున్న ఈ నాయకమ్మన్న్యులులకు వందనం.
ఎవరి కాలం లో ఎంత అభివృద్ది సాదిన్చేరని కాదుట.. ఎవరి కలం లో ఎక్కువ అవినీతి జరిగిందని పోటీపడుతున్నారు.
ఎంత బాగుందో కదా..
నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్నిమేషంగా చూస్తున్న అశేష జనం ముందు హాస్య`శపదం` గా తిట్టుకుంటున్నారు..

మార్పు రావాలి .... వస్తుండ్అంటారా???