Saturday, July 25, 2009

ఇదే " నా " భారతం ? ..!

"యత్ర నార్యంతు పూజ్యంతే '

ఎందుకులెండి ? మనం ఇంకోలా చెప్పుకుందాం "యత్ర నార్యంతు హింసతే " అక్కడ చరించేది మటుకు దానవులే, మానవ రూపం లో కనిపించే దానవులు . నాకో పాట గుర్తొస్తోంది ,
" ఎక్కడి కెళుతోంది దేశం ఏమై పోతోంది "

ఎప్పుడో ద్వాపర యుగంలో వస్త్రాపహరణ గురించి చదువుకున్నాం , అదీ రెండు సమయాల్లో అనుకుంటాను , కృష్ణుడు గోపికల వస్త్రాలు చిన్నప్పుడు సరదాగా దాచి వారిని అల్లరి పెట్టటం , నిండు సభలో ద్రౌపదిని వలువలు విప్పి కౌరవులు అవమానించటం , అప్పుడు ద్రౌపది మానసంరక్షనకు గోవిందుడు వున్నాడు , మరి ఇది కలియుగం , ఇప్పుడు మానసంభక్షకులే గాని ,మాన సంరక్షకులు ఏరి ? నలుగురిలో నడిరోడ్డుమీద ఒక నారి కి అవమానం , ఇంతకన్నా హేయమైన స్తితి వుంటుందా ? భారత భారతి ఎన్నిసార్లు తన సంతతిని చూసి సిగ్గుతో తలదించుకుని ఎడ్త్చిందో కదా ?
ప్రతీ మనిషి మహనీయులు కానవసరం లేదు , మానవత్వాన్ని మరిచిపోకూడదు , పాసవికమైన ఆనందం కోసం , పరమ నీచానికి దిగకూడదు , 'కలకంటి కంట కన్నీరు ఒలికితే ' ఇల విలవిల లాడి, సజీవ జల సమాధి అవుతుంది , కాదు కాదు ,ఇప్పటికే అవుతోంది , ఒక చిన్న మంచి పని, ఒక నిజం, ఒక చిన్న సహాయం , చేయటంలో వున్న
ఆనందం ,ఇంకెదులోను దొరకదు , మనం మనుషులం , పసువులం కాదు , అవి కూడా ఇలా ప్రవర్తించవనుకుంట,

" గడ్డి మేసి ఆవు పాలిస్తుంది
పాలు త్రాగి మనిషి విషమవుతాడు
అది గడ్డి గొప్ప తనమా ?
ఇది పాల దోష గుణమా ?
లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మ "

అన్నారు ఒక కవి ,గడ్డే తింటే పోలా ..

Tuesday, July 14, 2009

ఇవేమిటీ వింత భయాలు

' అటు చుస్తే సేమ్యా ఇడ్లీ
ఇటు చుస్తే బాదాం పూరి
ఏట కేగుటో తెలియనిదొక విద్యార్ధికి .. అన్నారు శ్రీ శ్రీ , ప్రతీ మనిషీ ఎప్పుడు విద్యర్దే , అన్నింటిలోను ఈ ఎంచుకునే సమస్యవస్తూనే వుంటుంది . అలాగే ఇప్పుడు వచ్చిన హాట్ టాపిక్ , అటు శాస్త్రమా ?
ఇటు ఆధ్యత్మికమా ? .. వీటి గురించి మాట్లాడెటంత అనుభవం ఆలోచన నాకు లేకున్నా , ఆసక్తి చాలా వుంది, వీటిపైఅవగాహన ,వున్నవారెవరైనా ఇంకొన్ని విషయాలు తెలియపరుస్తారేమోనని జిజ్ఞాస .. రెండువేల పన్నెండు మే ఇరవైఒకటవ తేదీకి ప్రపంచ ప్రళయం అని టీవీ లో హొరెత్తుతు మరీ చెప్తున్నారు , ఒకవపు గ్లోబల్ వార్మింగ్ , మరో వైపు వచ్చేమూడు నెలల కాలంలో మూడు గ్రహణాలు వలన ఏవో ఆపదలు సంభవిస్తాయని , పదే, పదే చెపుతున్నారు ,ఇవీచాలవన్నట్లు గ్రహాంతర వాసులు ఎప్పుడైనా మీ ముందుకు రావచ్చు , అని మనిషిలో భయాన్ని తట్టి లేపుతున్నారు ,
మొన్నే వెళ్ళిన బిగ్ బ్యాంగ్ భయాన్నుండి జనం కోలుకోకముందే మళ్ళిఇవేమిటి ? బిగ్ బ్యాంగ్ భయం వలన హార్ట్ ఎటాక్కి గురి ఐన వారు వున్నారు , ఈ ప్రకృతి పరిణామాలు వస్తాయో రాదో తెలీదు గానీ ,సున్నిత మనస్కులకి ఈరకమైన వార్తలే స్కయ్లాబ్ వచ్చి ఢీ కొన్నంత మానసిక ఆందోళనకు గురిచేస్తున్నై , రానున్నది రాకమానదు , కానున్నది కాకపోదు ,కాలాన్ని మనం నియంత్రించలేమన్నది వాస్తవం ,కాదంటారా ? ప్రకృతిని మన కనుకూలంగామార్చుకుంటూ, మన వినాశనానికి మనమే పునాది తీసుకుంటున్నాం ,

" గ్రహదారుల నదిగమించి
ఘన తారల పదమునుంచి
గగనాంతర రోదశిలో
ఘంధర్వ గోళ గతుల దాటి
చంద్రలోకమైనా , దేవెంద్రలోకమైనా
బొందితో జయించి, మరల
భువికి తిరిగి రాగలిగే "
మానవుడి మేధా శక్తి , దేనికి దారి తీస్తుంది ? విజయానికా ? లేక ....

Saturday, July 11, 2009

మంచి మనిషికి అభినందనం

" మానవత్వం పరిమళించే మంచి మనిషికి వందనం
బ్రతుకు అర్ధం తెలియజేసిన మంచి మనసుకు అభివందనం "

ఈ బ్లాగు చదివే చదువరులతో నేను విన్న ,చూసిన , ఒక అనుభూతి వెంటనే పంచుకోవాలని మళ్లే ఈ రోజే రెండవపోస్టింగ్ కూడా చేస్తున్నా, మంచి పనులు చేయాలంటే సంచి నిడుగా డబ్బే వుండనవసరం లేదని మరోమారు రుజువైందిఇప్పుడే చానల్స్ అన్నీ తిప్పుతూ చూస్తున్న నాకు , సాక్షి ఛానల్ వారి సాక్షి సలాం ప్రోగ్రాం కనిపించింది , సాక్షి ఎడిటర్ రామ్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు ,ఆసక్తి గాఅనిపించి చూసాను , ఒక మామూలు కామన్ మాన్ సమాజానికి తన వంతు సేవ చేయాలన్న తపనతో , తనసంపాదనలో కొంత వెచ్చించి అన్నం ,రొట్టెలు ,మజ్జిగ వంటివి అన్నార్తులకి అందేటట్లు , అంతేకాక రోడ్ల పైన ప్రమాదకరంగా వున్నా గోతులని పూడ్చడం , ఇంకా చడువురానివారి దగ్గరకి వెళ్లి తనకు తెలిసిన చేతిపనులు, నేర్పి వారిచే షాప్స్పెట్టించి వారు ఆర్ధికంగా నిలదోక్కుకోనేట్లు చేయడం , ఇలాంటివే మంచిపనులు తన పరిధిని మించి , చేయడం , తను ఏకట్నం తీసుకోకుండా ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకుని , తనతో కలిసి కొన్ని ఏళ్ళుగా ఇద్దరూ కలిసీ ఏ మెప్పు ఏ ప్రతిఫలంఆశించకుండా , తాము చేస్తున్నట్లు ఎవ్వరికే తెలియకుండా ఇన్ని ఏళ్ళుగా ఈ సేవా కార్యక్రమాల్లో గడపడంఅభినందనీయం ,పైగా వారికీ ముగ్గురు ఆడపిల్లలు ,ఆ ముగ్గురినీ ,వుచిత విద్యను అందించే టీచర్ గా , వుచిత వైద్యంచేసే డాక్టర్ గా ,వుచిత న్నాయం అందించే లాయర్ గా వారిని సంసిద్దులని చేస్తూ ,తనలాగే వారు కూడా సమాజసేవచేయాలని , వారు తమ సంపాదనలో సగం సేవ కోసమే వినియోగించాలని చెప్పడం,వారి షాప్ కట్టగానే అటునుండి అటే,ప్రమాదకర గోతులు వున్నా చోటికి వెళ్లి అవి పూడ్చి ,అలాగే ఈ అన్నదాన కార్యక్రమాలు చేసి , వాళ్ళ రోజువారీ పనుల్లో వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ,ఆకలితో యెవరూ అలమటిస్తూ వుండకూడదని ,ప్రతీ వారు కనీసం తమ ఇంటిముందైనా నాలుగు రొట్టెలు మజ్జిగ కొంత అన్నం తో కొంతమంది ఆకలైనా తీరిస్తే అంతే చాలని అన్నారు , నిజమే కదా..
ఆ మంచిమనసుకి నాకు తెలియకుండానే నా కళ్లు కన్నీళ్ళ వర్షంతో ,తమ హర్షాన్ని పరోక్షం గా తెలియజేసాయి .
దైవం మానవ రూపం లో వుంటాడని అంటారు .. ఇదేనేమో ? .. అలాంటి మంచి మనసులకి వందనం ..
, ,

భావకవి

' ఆకులో ఆకునై , పూవులో పూవునై ,
కొమ్మలోకోమ్మనై .నునులేత రెమ్మనై
అడవి దాగిపోనా ,ఎటులైన ఇచటనే ఆగిపోనా '

మధురమైన పద సంపద అందరికీ కరతలామలకం కదా , భావకవి కృష్ణశాస్త్రి గారు , భావనామయమైన జగత్తులోమనలందరినీ మురిపించి మైమరపించే ఎన్నో పాటలు, కవితలతో , అలరించిన మహానుభావులు . పరోక్షంగా నాకు , నాలాంటి వారెందరికో గురువుగారు . మా నాన్నగారికి కృష్ణశాస్త్రి గారంటే తగని మక్కువ. అలా మా నాన్న గారు అతనికవిత్వం గురించి చెపుతుండగా విని, విని ,చిన్నప్పటినుండి నేను కూడా శాస్త్రి గారి అభిమానిని అయ్యాను .. ఎన్నోసార్లుకనులు చెమ్మగిల్లిన సందర్భాలు, అతని కవితా లోకంలో విహరిస్తున్నపుడు ..మచ్చుకు ఒక్కటి మీతో చెబుతున్నా,

"నా విరులతోట పెంచికోన్నాడ నొక్క
పవడపు గులాబి మొక్క నా ప్రణయ జీవ
నమ్ము వర్షమ్ము గా ననయమ్ము కురిసి '
నా పూ తోటలో ఒక మంచి గులాబి మొక్కని ప్రేమనే వర్ష ధారలని ప్రతీక్షణం కురిపించి పెంచుకుంటున్నాను
, ' ఎట్టు లది దాపురించేనో ఏమో యంత
నాకుసందుల త్రోవల నల్ల దిగియే
నొక్క క్రూరార్క కిరణమ్ము వుర్వి వాలి
నా గులాబి సోలి తూలి నన్ను వీడె'
అతని భార్యని కొల్పొయినపుడు కవితని ప్రసవించిందట అతని కలం , అంత ప్రేమగా పెంచుకుంటున్న గులాబిపైవాడి అయిన కిరణాల వేడి తగిలి గులాబీ వాడిపోయి తనని వీడెనని అనంతమైన భాధని పదాలలో పదిలపరచి గులాబిని , తద్వారా అతని భార్యను అమరం చేసారు మన కృష్ణశాస్త్రి గారు . ఇలాంటి భావనలు ఎన్నో కృష్ణపక్షం లో, వూర్వశి లో మననిపలకరిస్తాయి .. అలాగే మేఘసందేశం సినిమాలో , ' ముందు తెలిసినా ప్రభూ , మందిర మిటు లుంచేనా, మందమతిని నీవు వచ్చు మధుర క్షణ మేదో కాస్త ముందు తెలిసినా ' పైకి ఆరాధన ,లోపల ఆవేదనానిబిడీకృతమై , అనంత అర్ధాన్ని నింపుకున్న పాట కూడా నాకు చాలా ఇష్టం .. ఇలా ఒకటేమిటి ఎన్నో ,...మళ్లేమరోసారి ఈ మహాకవి గురించి మననం చేసుకుందాము ...

Friday, July 10, 2009

పేపర్ పాపాయి


" ఎగరేసిన గాలిపటాలు దొంగాటల దాగుడు మూతలు
చిన్నప్పటి జ్ఞాపకాలు చిగురించిన మందారాలు
గోలీలు , గోటిబిళ్ళ , ఓడిపోతే పెట్టిన డిల్ల
చిన్నప్పటి ఆనవాళ్ళు , కాలం లో మైలురాళ్ళు"
ఈ పాట స్నేహం అనే సినిమాలోనిదనుకుంటాను , పాడినవారు జైసుదాసు గారు అని గుర్తు , ఏది ఏమైనా ,నాకు చాలాఇష్టమైన పాటల్లో ఇది కూడా ఒకటి , నిజంగానే చిన్ననాటి గురుతులు , మనసుమీద పడిన ముద్రలు , మరిచిపోలేనివి, నా చిన్నతనం లో ' పేపర్ పాపాయి ' అనే పుస్తకం చదివాను , ఒకసారికాదుఅనేకసార్లు , ఆ కదా మీకు క్లుప్తం గా చెబుతాను .. ఒక చిన్న బాబు ఒక పుస్తకం చదువుతూ ,అందులో ఒక పిల్లాడి కటింగు , దానికిందన వున్న విషయం చదువుతాడు , అదేమిటంటే ' ఈ కటింగు కట్ చేసి చేతితో పట్ట్టుకుని దిగువనవున్న మంత్రాన్ని జపిస్తే , ఆ పేపర్ కటింగుకి ప్రాణం వచ్చి ఎగురుతుంది అని వుంటుంది , అది చదివిన ఆ బాబు ఆ విధంగానే చేసి మంత్రం చదివేసరికి ఆ పేపర్ పాపాయి కి జీవం వచ్చి ఎగురుతూ ,ప్రపంచమంతా పర్యటించి, ఒకొక్క ప్రాంతంలో కొన్ని రోజులు వుంటూ ,అక్కడి వారితో స్నేహం చేసి వారి జీవనవిధానం , ఆ దేశపు వింతలు ,అన్నీకళ్ళకు కట్టినట్లు మనకు చెపుతూ ,అలాప్రపంచమంతా తిరిగి,చివరకి హిమాలయాల మీద నివాసం వుంటాడు , ఆ పుస్తకం చదువుతుంటే మనమే ప్రపంచమంతా తిరుగుతున్న బ్రాంతికి లోనవుతాం , అది తెలుగు అనువాదం ,నిజంగా నాకెంత నచ్చిందంటే , ఎన్నోసార్లు నేను కూడా పేపర్లలో కటింగులు కట్ చేసి ఆ మంత్రాన్ని చదివి గాలిలోకి వదిలేదాన్ని , చిన్నతనంలోనే పిల్లలకి ప్రపంచంలోని దేశాలు ,వాటి పేర్లు ,ఆ ప్రాంతపు జీవన స్థితిగతులు, బాషలు , ఆ దేశాల స్థానిక జంతుజాలం , ఇలా అన్నీ ఆ పేపర్ పాపాయి కధ ద్వారా చెప్పిన ఆ రచయిత కి హాట్సాఫ్.. చిన్నప్పుడు నాపై ప్రగాఢ ముద్ర వేసిన ఆ పుస్తకాన్ని మిస్ చేసుకున్నాఇప్పటికీవెతుకుతూనే వుంటా ..ప్రతీవారు చదవదగ్గ పుస్తకం పేపర్ పాపాయి .. మీలో ఎవరికైనా అది దొరికితే నాకు చేఉతారు కదూ ..

Wednesday, July 8, 2009

జ్ఞాపకాలు

అమ్మ .. ఎంత కమ్మనిది మాట సందర్భం లో గజల్ శ్రీనివాస్ గారు ఆలపించిన గజల్ గురుతొస్తోంది,
" ఒక్కసారి నన్ను తిట్టి ఎన్ని రోజులు ఏడిచింది
ఒక్కసారి నన్ను కొట్టి రోజంతా పస్తుంది,
అది అమ్మే కదా .. జీవనదే కదా ..
నిజం కదండీ ,.. ఎంత దుర్మార్గులైన పిల్లలైనా , కడుపులో పెట్టి కాపడుకునేది అమ్మ ఒక్కతే .. అలాంటి తల్లిని నులకమంచం ఇచ్చి నడివీధిన వదిలేసాడు ప్రభుద్దుడు .. ఇలాంటి వారిని ఏమనాలి ...ఇలాంటి సంఘటనలు ఎన్నో...తల్లితండ్రులు పిల్లలకి చ్చేది మంచి జీవితాన్ని , మననుండి వారు ఆశించేది కాస్త ప్రేమని .. పెద్దవయసులో వారు పసిపిల్లలతో సమానం , స్థితి లో వారిని కష్టపెట్టకుండా చూడటం మన కనీస ధర్మం .. ఏమంటారు ?..
కవి కలం నుండి జాలు వారిన చినుకులో తెలియదు కాని , నన్ను కదిలించిన చినుకులలో మీరు కూడా తడవాలని రాస్తున్నా..

" అమ్మంటే ఎవరో తెలుసా ..
జన్మంటే ఏమో తెలుసా ..
నేలమీద ఉదయించిన దేవతరా అమ్మ ,
కన్నీళ్ళు , చనుబాలు కలబోస్తే జన్మ . '
అందమైన మా వూరు, ఎన్నో జ్ఞాపకాల సెలయేరు , శలవలకి ఇంటికి వచ్చే నా కోసం గడపలోనే ఎదురు చూసే అమ్మ ,
వస్తున్దిలేవే , చూసి చూసి , మెడ నొప్పెడుతుంది రా , అనే నాన్న , తిరిగి వెళుతున్నపుడు అమ్మ కళ్ళలో కదలాడే సన్నటి నీటిపొర , ఇప్పటికీ నాకు గుర్తే .. నేనే కాదు చదువుల నిమిత్తం ఎందరో పిల్లలు , వారి కన్నవారు పడే అవస్త ఇదే .కాని ప్రేమ పేరుతొ సునాయాసంగా వారి జీవితాలికి వారే చరమ గీతం పాడుకుని , కన్నవారి గుండెల్లో ఆరని చిచ్చు రగిలిస్తున్నారు నేడు చాలా మంది .ఇది ఎంతవరకు సమంజసమో ? వారు ఆలోచించటం లేదు ప్రేమలో వున్నవారు ఒక రకమైన వున్మాదస్తితి లో వుంటారు ..ప్రేమ వికటిస్తే జీవితం సరి అన్నభావనలో వరం లాగదొరికిన జీవితాన్ని శాపంగా చేసుకుంటున్నారు .. సమస్య వచ్చినపుడు దానిని కాలానికే వదిలేస్తే , కొన్నాళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే ,,,నేనేనా ? అంత పిచ్చిగా ఆలోచించినది అని భావిస్తారు .. ఇది నిజం ..కాలానికా శక్తి వుండిమరణిస్తే మరల పుడతామో లేదో తెలీదు .. నిధి లా దొరికిన జీవితాన్ని పెన్నిధి లా చూసుకోవాలి , మన జీవితం మన ఇష్టం ,అనుకుంటాము ,, కానీ మన జీవితం మీద మనకి హక్కు వుందంటారా .. వుంటే .. అది అమ్మకి నాన్నకి మాత్రమే వుంటుంది , ఎందుకంటె అది వారు పెట్టిన భిక్ష అందుకే అందమైన అనుభందాల మధ్య అవరోధాలని ఆనందంగా స్వీకరించి , జీవితాన్ని మధ్యలోనే త్రుంచకుండా ..పూర్తిగా గడపగలగాలి .. నిజమే కదా ...

ఆశలు

నాకు కవితలు పాటలు వ్రాసే అలవాటు వుంది, అందుకే మొదటగా ఆశలు పైన చిన్న కవిత ..ఆశలు అందరికి వుంటాయి, కానీ అవి నెరవేరేది , నెరవేర్చుకునేది కొద్దిమందే..
' ఆశిస్తే వచ్చేవే ఆశలు
ఆకలిలో ఆగవు ఆ శ్వాషలు
అవకాశమొదలకు
ఆకసమంటకు
అందమైన ఆశలును
ఆదిలోనే త్రుంచకు
అందాల జాబిల్లి ఆ నింగికి అందం
అది నేలకు వచ్చిందా ఆ వెన్నెల శూన్యం
అందని ఆకాశం ఫై ఎందుకు మమకారం
అమ్మ వంటి ఈ అవని మనకే కద స్వంతం '